ఒక ఖాన్‌.. ఒక శర్మ.. ఒక కైఫ్‌ | Sakshi
Sakshi News home page

ఒక ఖాన్‌.. ఒక శర్మ.. ఒక కైఫ్‌

Published Thu, Dec 14 2017 11:39 PM

special story to  sharukh and anushka sharma - Sakshi

ఒక షారుక్‌ ఖాన్‌.. ఒక అనుష్కా శర్మ.. ఒక కత్రీనా కైఫ్‌. ముగ్గురూ కిక్కిరిసి ఒక సినిమాలో పట్టేలా ఆనంద్‌ ఎల్‌.రాయ్‌ చేస్తున్న మెగా ప్రాజెక్టు ఇది. ఇంకా నామకరణం కాలేదు. దీంట్లో షారుక్‌ ఖాన్‌ ఓ మరుగుజ్జు పాత్ర వేస్తున్నాడట! అదేం గొప్ప వార్త కాదు. ముగ్గురు హేమాహేమీలు నటిస్తున్నారన్నది కూడా వార్త కాదు. ఆ ముగ్గురిలో ఇద్దరితో ఒకరు ఫొటోలు తీసుకోవడం లేదన్నదే వార్త. ఎవరా ఇద్దరు? ఎవరా ఒక్కరు? షారుక్‌ ఖాన్‌ ఆ ఒక్కడు. హీరోయిన్‌లు ఆ ఇద్దరు. ఆ ఇద్దరిలో ఏ ఒక్కరితోనూ ఒకటంటే ఒక్క ఫొటో కూడా తీయనివ్వడం లేదట షారుక్‌!

ట్వీటర్లు, ఇన్‌స్టాగ్రామ్‌లు, వాట్సాప్‌లు.. యూజ్‌ చేసుకుని, సినిమా రాకముందే విపరీతంగా ప్రమోషన్‌ చేసే కింగ్‌ ఖాన్‌ సడెన్‌గా ఇలాంటి డింగ్‌ డాంగ్‌ ఎందుకు ఆడుతున్నాడు? ఎందుకంటే.. ఏ హీరోయిన్‌కి ఎంత పెద్ద పాత్రో బయటికి తెలియకుండా ఉండాలంటే కింగ్‌ ఖాన్‌ ఎంత వీలైతే అంత తక్కువగా సోషల్‌ మీడియాలో వీళ్లతో పాటు కనబడాలన్నది డైరెక్టర్‌ గారి క్యాలిక్యులేషన్‌. అయినా మనకెందుకులెండి. మన హీరోలు, హీరోయిన్‌ల సినిమాలు చూసేటప్పటికే జేబుల్లో చిల్లులు పడుతున్నాయి. ఒక ఖాన్, ఒక శర్మ, ఒక కైఫ్‌.. ఒక టీవీలో వచ్చినప్పుడు చూసుకుందాంలే. 

Advertisement

తప్పక చదవండి

Advertisement