కారుణ్యం కురిసే కాలం

4 Aug, 2019 09:10 IST|Sakshi

ఇస్లాం వెలుగు

ఇస్లామ్‌ ధర్మంలోని ఐదు మౌలిక అంశాల్లో ‘హజ్జ్‌’ కూడా ఒకటి. వెసులుబాటున్న ప్రతి ముస్లిం జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా తప్పక ఆచరించాల్సిన విధి. ఇది జిల్‌హజ్జ్‌ మాసంలో నిర్వహించబడుతుంది. అందుకే ఈ మాసానికి ఎనలేని ప్రాముఖ్యత ఏర్పడింది. ఈ మాసంలోని మొదటి పదిరోజులు చాలా ప్రాముఖ్యం కలవి. వారంలోని ఏడు రోజుల్లో శుక్రవారానికి, సంవత్సరంలోని పన్నెండు మాసాల్లో రమజాన్‌ మాసానికి, రమజాన్‌లోని 30 రోజుల్లో చివరి పదిరోజులకు ఏవిధంగా ప్రత్యేకత ఉందో, అదేవిధంగా జిల్‌హజ్జ్‌ మాసంలోని మొదటి పది రోజులకూ అలాంటి ప్రత్యేకతనే ప్రసాదించాడు.

ఈ మొదటి దశకంలో అల్లాహ్‌ కారుణ్యం వర్షిస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో చేసే ప్రతి సత్కార్యమూ ఎనలేని ప్రాముఖ్యతను కలిగి అల్లాహ్‌ కృపకు పాత్రమవుతుంది. మనిషి ఈదశకంలో చేసిన ఆరాధనలు ప్రీతికరమైనంతగా, మరే ఇతర దినాల్లో చేసిన ఆరాధనలు కూడా దైవానికి అంతగా ప్రీతికరమైనవికావు. అంటే, జిల్‌హజ్జ్‌ మాసం తొలి తొమ్మిది రోజుల్లో చేసే ఆరాధనలు, సత్కార్యాలు అల్లాహ్‌కు మిగతా మొత్తం రోజులూ చేసిన ఆరాధనలు, సత్కార్యాలకంటే అధిక ప్రీతికరం. ఈ రోజుల్లో పాటించే ఒక్కొక్క రోజా సంవత్సరం మొత్తం పాటించే రోజాలకు సమానం. ఇందులోని ప్రతి రాత్రి ఆచరించే నఫిల్‌లు షబేఖద్ర్‌లో ఆచరించే నఫిల్‌లతో సమానం.

నిజానికి ఇవి హజ్జ్‌ కోసం ప్రత్యేకించబడిన రోజులు. ఆర్థిక స్థోమత కలిగిన వారు తప్ప అందరూ హజ్‌ చేయలేరు. కాని అల్లాహ్‌ తన అపారమైన దయతో ఆ మహత్తరమైన పుణ్యఫలం పొందగలిగే అవకాశాన్ని అందరికి ప్రసాదించాడు. జిల్‌ హజ్జ్‌ మాసం ప్రారంభమవుతూనే, తమతమ ప్రాంతాల్లో, తమ తమ ఇళ్ళ వద్దనే ఉంటూ హాజీలతో ఆత్మీయ సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. వారి ఆచరణలను అనుకరించే ప్రయత్నం చెయ్యాలి. ఇదే ఈద్‌ ఖుర్బానీలోని రహస్యం. హజ్జ్‌ యాత్రకోసం మక్కాకు వెళ్ళిన హాజీలు జిల్‌ హజ్జ్‌ మాసం పదవతేదీన మినాలో ఖుర్బానీలు సమర్పిస్తారు.

మక్కా వెళ్ళలేక పోయిన యావత్‌ ప్రపంచంలోని ముస్లిములంతా తమ తమ స్వస్థలాల్లో ఇళ్ళవద్దనే ఖుర్బానీలు సమర్పిస్తారు. ఏ విధంగానైతే హాజీలు ‘ఇహ్రామ్‌’ధరించిన తరువాత క్షవరం చేయించుకోరో, గోళ్ళు కత్తిరించుకోరో అలాగే ఖుర్బానీ ఇవ్వాలని సంకల్పించుకున్న ముస్లింలు కూడా గోళ్ళు కత్తిరించుకోవడం, క్షవరం చేయించుకోవడం చేయకూడదు. అంటే మక్కాకు వెళ్ళిన హాజీలను అనుకరిస్తూ వారితో ఆత్మీయ సంబంధాన్ని పెంపొందించుకొనే ప్రయత్నం చెయ్యాలి.

ఈ విధంగా జిల్‌ హజ్‌ మాసం మొదటి దశలో సాధ్యమైనంత అధికంగా సత్కార్యాలు ఆచరించి దైవానుగ్రహాన్ని, అపారమైన ఆయన కారుణ్యాన్ని పొందడానికి కృషిచేయాలి. మక్కా వెళ్ళి హజ్జ్‌ ఆచరించే స్థోమత లేకపోయినా, కనీసం ఈదుల్‌ అజ్‌హా పండుగ వరకు ఈ పదిరోజులను సద్వినియోగం చేసుకుంటే అల్లాహ్‌ తన అపార కరుణతో హాజీలతో సమానంగా పుణ్యఫలాన్ని ప్రసాదిస్తానంటున్నాడు. కనుక హజ్జ్‌ పరమార్థాన్ని అర్థం చేసుకొని, దానికనుగుణంగా కర్మలు ఆచరిస్తూ, ‘ఈదుల్‌ అజ్‌ హా’ పర్వదినాన్ని జరుపుకుంటే ఇహలోకంలోనూ పరలోకంలోనూ సాఫల్యం పొందవచ్చు.
– ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌  

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఒకరిది అందం.. మరొకరిది ఆకర్షణ

శ్రావణ మాసం సకల శుభాలకు ఆవాసం...

కోడలి క్వశ్చన్స్‌..మెగాస్టార్‌ ఆన్సర్స్‌

కూరిమి తినండి

వెదురును వంటగ మలిచి...

అమెరికా గుజ్జు తీస్తున్నారు

ప్రకృతిసిద్ధంగా శరీర సౌందర్యం

ప్రకృతి హితమే రక్షగా...

పోస్టర్‌ల మహాసముద్రం

ఆమెకు అండగా ‘షీ టీమ్‌’

శుభప్రద శ్రావణం

అరచేతిలో ‘e’ జ్ఞానం

అమ్మ పాలు... ఎంతో మేలు

వరుసగా గర్భస్రావాలు.. సంతానభాగ్యం ఉందా?

యాంటీ డిసీజ్‌ ఆహారం

తండ్రి లేడు... అమ్మ టైలర్‌

పశ్చాత్తాప దీపం

ఆ కాపురంపై మీ కామెంట్‌?

నవ లావణ్యం

పిడుగు నుంచి తప్పించుకోవచ్చు.. 

పాప ముఖం మీద మచ్చలు.. తగ్గడం ఎలా? 

స్త్రీ విముక్తి చేతనం 

న్యూస్‌ రీడర్‌ నుంచి సీరియల్‌ నటిగా! 

ఏ జో హై జిందగీ..ఫ్యామిలీ సర్కస్‌

గుండె రంధ్రం నుంచి చూస్తే...

శివుడి ప్రీతి కోసం కావడి వ్రతం

అల్లంతో హైబీపీకి కళ్లెం!

క్షీర చరిత్ర

కందకాలతో జలసిరి!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రైఫిల్‌ షూట్‌ పోటీల్లో ఫైనల్‌కు అజిత్‌

సింగిల్‌ టేక్‌లో చేయలేను..!

రష్మిక కోరికేంటో తెలుసా?

ఆర్టిస్ట్‌ బ్రావో!

యాక్షన్‌ అవార్డ్స్‌

శత్రువు లేని యుద్ధం