విడాకుల మూల్యం రూ. 27 వేల కోట్లు.. | Sakshi
Sakshi News home page

విడాకుల మూల్యం రూ. 27 వేల కోట్లు..

Published Fri, May 30 2014 11:32 PM

విడాకుల మూల్యం రూ. 27 వేల కోట్లు..

చరిత్రలోనే అత్యంత ఖరీదైన విడాకుల వ్యవహారం ఇది. విడాకుల వివాదం సెటిల్మెంట్ కోసం అక్షరాలా రూ. 27 వేల కోట్లు భార్యకు చెల్లించాలంటూ రష్యాకు చెందిన వ్యాపారవేత్త దిమిత్రీ రైబొలొవ్లెవ్‌ను అక్కడి కోర్టు ఆదేశించింది. ఆయన ఆస్తి విలువ సుమారు రూ. 52,800 కోట్లు ఉంటుంది. దాదాపు ఆరేళ్ల నుంచి ఈ కేసు కొనసాగుతోంది.  

ఇలాంటివే మరికొన్ని భారీ విడాకుల కేసులు కూడా ఉన్నాయి. ఫ్రెంచ్ వ్యాపారవేత్త అలెక్ వెల్డైన్‌స్టెయిన్ డైవోర్స్ తీసుకున్నప్పుడు భార్య జోసెలిన్‌కి దాదాపు రూ. 15,000 కోట్లు ఇవ్వాల్సి వచ్చింది. అలాగే, మీడియా దిగ్గజం రూపర్ట్ మర్డోక్ తన మాజీ భార్య ఆనాకి సుమారు రూ. 10,000 కోట్లు ఇచ్చారు.

ఇదే కోవలో ఫార్ములా వన్ ప్రెసిడెంట్ బెర్నీ ఎక్లిస్టోన్ తన మాజీ భార్య స్లావికా నుంచి విడాకుల కోసం రూ. 9,000 కోట్లు వెచ్చించాల్సి వచ్చింది. హాలీవుడ్ స్టార్ మెల్ గిబ్సన్ కూడా భార్య రాబిన్ నుంచి విడిపోయినప్పుడు రూ. 2,000 కోట్లు పైగా ఇవ్వాల్సి వచ్చింది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement