నేడే చేయండి! | Sakshi
Sakshi News home page

నేడే చేయండి!

Published Mon, Mar 10 2014 11:17 PM

నేడే చేయండి! - Sakshi

 క్యాలిఫోర్నియా (అమెరికా)లో ఇప్పుడు సరికొత్త ఎక్సర్‌సైజు ఒక ఊపు ఊపేస్తోంది. ‘ఫిట్‌నెస్’ కోసం తపించేవాళ్లు ఈ వ్యాయామం గురించి ఆరా తీయడమే కాదు... క్లాసులలో చేరిపోతున్నారు కూడా.

 ‘భవిష్యత్తు వ్యాయామం’గా పిలవబడుతున్న ‘ఫిట్‌వాల్ వ్యాయామం’ పరిపూర్ణ శరీరాకృతికి రాజమార్గంలాంటిది అంటున్నారు. ఏడు అడుగుల మెటల్ షెల్ఫ్ ఆధారంగా నలభై నిమిషాల పాటు చేసే వ్యాయామమే ‘ఫిట్‌వాల్’.
 

వ్యాయామం చేస్తోన్న షెల్ఫ్‌కు ఐపాడ్ అమర్చబడి ఉంటుంది. దీని ద్వారా గుండె కొట్టుకొనే తీరునూ, ఖర్చవుతున్న కేలరీలనూ మానిటర్ చేసుకోవచ్చు.

 వ్యాయామంలో పొరపాట్లు దొర్లకుండా సూచనలతో కూడిన వీడియో ఉపకరిస్తుంది.

 ‘ఫిట్‌వాల్’లో మొత్తం 900 రకాల వ్యాయామ భంగిమలు ఉంటాయి. ప్రతి మూవ్‌లోనూ కండరాలను దృఢతరం చేసే శక్తి ఉంటుంది. ‘‘ఎక్సర్‌సైజ్ మార్కెట్‌లో ఏది కొత్తగా వచ్చినా దాని గురించి విపరీతమై అంచనాలు ఉంటాయి. అది నిలబడుతుందా లేదా? అనేది మాత్రం కాలం చెబుతుంది’’ అంటున్నాడు యోగాను ఇష్టపడే ఒక పెద్దాయన. మరి ఫిట్‌వాల్ నిలుస్తుందా? లేదా అనేది కాలమే తేల్చాలి.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement