ప్రేమాకాశం : ఆకాశ మంత ప్రతిపాదన! | Sakshi
Sakshi News home page

ప్రేమాకాశం : ఆకాశ మంత ప్రతిపాదన!

Published Wed, Nov 27 2013 12:01 AM

ప్రేమాకాశం : ఆకాశ మంత ప్రతిపాదన!

 కాగితంపై అందమైన అక్షరాలతో ప్రేమలేఖ రాసిన వారు ఉండొచ్చు... ఇంటర్నెట్, సెల్ మెసేజ్‌ల ద్వారా ప్రేమ ప్రతిపాదన చేసిన వారు ఉండొచ్చు... అయితే అమెరికాకు చెందిన ఒక ప్రేమికుడు చాలా అరుదైన రీతిలో తన ప్రియురాలికి ప్రేమప్రతిపాదన చేశాడు. ఆకాశంలో అక్ష రాలను డిస్‌ప్లే చేసి ‘ఐ లవ్యూ’ అని చెప్పాడు. అయితే అతడెవరనేది తెలీదు, అతడి ప్రియురాలి గురించి కూడా తెలియదు. వెస్ట్ లాస్ ఏంజెలెస్ పరిధిలో ఓ రోజున ఉన్నట్టుండి ఆకాశంలో అక్షరాలు కనిపించాయి. ‘ఫరెవర్ లవ్...లవ్ అన్ కండీషనల్లీ...మ్యారీ మీ మికో...’ అంటూ ఇంగ్లిష్‌లో టెక్ట్స్‌ను డిస్‌ప్లే చేశాడో అగంతకుడు. స్కై రైటింగ్ టెక్నిక్స్ ద్వారా అతడు చేసిన ఈ విన్యాసానికి అందరూ ఆశ్చర్యపోయారు. అలా ప్రేమను ప్రతిపాదించడం విచిత్రంగా ఉందన్నారు. మరికొంతమంది ఆ అమ్మాయి ఎవరో అదృష్టవంతురాలు...అంటూ జలసీని ప్రకటించుకొన్నారు.
 
      ఇంతలోనే ఆకాశంలో మళ్లీ అక్షరాలు మెరిశాయి. ‘మికో సెడ్ యస్...’ అంటూ ఆ ప్రేమికుడు తన లవ్ సక్సెస్‌ను కూడా అందరికీ తెలియబరిచి అంతవరకూ అతడి గురించి చర్చించుకొన్న వారందరి సస్పెన్స్‌కు తెరదించాడు. అందరూ వినూత్నమైన అతడి ప్రేమ ప్రతిపాదనను ఫోటోల్లో బంధించి సోషల్‌నెట్ వర్కింగ్ సైట్ల ద్వారా షేర్ చేసుకొంటున్నారు

Advertisement

తప్పక చదవండి

Advertisement