Sakshi News home page

మనం - మనదేహం!

Published Mon, Aug 25 2014 11:25 PM

మనం - మనదేహం!

 ట్రివియా
 
మన చిన్న పేగు పాతిక అడుగుల పొడవు ఉంటుంది. పెద్ద పేగు ఐదడుగులు ఉంటుంది. అయితే వెడల్పు మాత్రం చిన్నపేగు కంటే పెద్దపేగు మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది.
 
మనం ఒక అడుగు వేయాలంటే రెండు వందల కండరాలు పనిచేయాలి. నవ్వాలంటే పదిహేడు కండరాలు కదలాలి. అయిష్టంగా, అసంతృప్తిగా ముఖం పెట్టినప్పుడు 43 కండరాలు బిగుసుకుంటాయి.  ఎముక కణాలు కొత్తవి పుడుతూ పాతవి నశిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో పన్నెండేళ్లకో కొత్త అస్థిపంజరం తయారవుతుంటుంది.  

మనిషిలోని నరాలను వరుసగా పేరిస్తే వాటి పొడవు 45 మైళ్లు ఉంటుంది. రక్తనాళాల పొడవు 60 వేల మైళ్లు ఉంటుంది.  నాలుక మీద రసననాడులు రుచిని తెలియచేస్తాయి. వీటిలో చేదును గుర్తించే టేస్ట్‌బడ్స్ వెనుకవైపు, కారాన్ని గుర్తించేవి నాలుకకు లోపలగా ఇరు పక్కల, ఉప్పును గుర్తించేవి నాలుక ముందు భాగంలో పక్కల, తీపిని గుర్తించేవి నాలుక చివర్లోనూ ఉంటాయి.
 

Advertisement
Advertisement