మంచి తండ్రిగా మీకు మార్కులెన్ని? | Sakshi
Sakshi News home page

మంచి తండ్రిగా మీకు మార్కులెన్ని?

Published Thu, Jun 8 2017 11:34 PM

మంచి తండ్రిగా మీకు మార్కులెన్ని?

సెల్ఫ్‌ చెక్‌

ఇంట్లో వస్తువులు ఉన్నాయా? లేదా? పిల్లలు సరిగా చదువుతున్నారా? లేదా? కుటుంబానికి రక్షణగా ఉంటున్నామా? లేదా?... ఇలా అన్ని విషయాలనూ గమనిస్తూ ఫ్యామిలీకి చేదోడువాదోడుగా కుటుంబ యజమాని ఉంటాడు. ఇలా చేసినప్పుడే కుటుంబంలో అతనికి విలువ ఉంటుంది. పిల్లలు ‘‘మా నాన్న మంచివాడు’’ అనాలన్నా... ‘‘అవర్‌ డాడీ ఈజ్‌ది బెస్ట్‌’’ అనిపించుకోవాలన్నా వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవటం తప్పనిసరి. పరిశీలనా దృష్టి ఎక్కువగా ఉండే పిల్లలు ఇతరులతో మిమ్మల్ని పోల్చుకొని ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారు కాబట్టి, వారనుకున్న విధంగా మీరు ఉండటం అవసరం. యజమానిగా మీరు పర్‌ఫెక్ట్‌ డాడీనో కాదో ఒకసారి చెక్‌ చేసుకోండి.             
                
1.    మీ పిల్లలు మిమ్మల్ని చాలా ఇష్టపడతారు.
ఎ. అవును     బి. కాదు

2.    మీరెంత బిజీగా ఉన్నా మీ పిల్లలతో సమయాన్ని గడుపుతారు.
ఎ. అవును     బి. కాదు

3.    పిల్లల భవిష్యత్‌ గురించి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఎ. అవును     బి. కాదు

4.    సెలవు దొరికితే మీ సమయాన్ని కుటుంబంతోనే గడుపుతారు.
ఎ. అవును     బి. కాదు

5.    పిల్లలకు ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా చే స్తారు.
ఎ. అవును     బి. కాదు

6.    పిల్లలను అనవసరంగా కోప్పడరు. వారిని శారీరకంగా దండించే ప్రయత్నం ఎప్పటికీ చేయరు.
ఎ. అవును     బి. కాదు

7.    పాఠశాలలో జరిగే పేరెంట్‌– టీచర్‌ సమావేశాలకు తప్పక హాజరవుతారు.
ఎ. అవును     బి. కాదు

8.    పిల్లలపై ప్రేమ చూపించటానికి మొహమాటపడరు.
ఎ. అవును     బి. కాదు

9.    మీ పిల్లలు ‘ఫలానా కావాలి నాన్నా’ అని అడిగిన సందర్భాలు చాలా తక్కువ. వాళ్లు అడగక ముందే సిద్ధం చేసి ఉంటారు.
ఎ. అవును     బి. కాదు

10. పిల్లల అవసరాలు తీర్చడంతోపాటు వారిని క్రమశిక్షణగా ఎలా పెంచాలో మీకు తెలుసు.
ఎ. అవును     బి. కాదు

‘ఎ’ లు ఐదు వస్తే కన్నతండ్రిగా మీరు యావరేజ్‌. ‘ఎ’ లు ఏడు దాటితే మీరు పర్‌ఫెక్ట్‌ తండ్రి, పిల్లలను శ్రద్ధగా పెంచటంలో మీకు వందమార్కులు వచ్చినట్లు. మీ పిల్లలు మిమ్మల్ని ఎంత గౌరవిస్తారో అంతే ప్రేమిస్తారు. ‘బి’ లు ‘ఎ’ ల కన్నా ఎక్కువగా వస్తే పిల్లలని ప్రేమించి, వారిని సంరక్షించడం, బాధ్యత తీసుకోవడం విషయంలో మీరు తెలుసుకోవలసింది చాలా ఉంటుంది.

Advertisement
Advertisement