అమ్మో! ప్లాస్టిక్‌తో బరువు | Sakshi
Sakshi News home page

అమ్మో! ప్లాస్టిక్‌తో బరువు

Published Wed, Jan 20 2016 11:45 PM

అమ్మో!  ప్లాస్టిక్‌తో బరువు - Sakshi

పరిపరి   శోధన

అతిగా తినడంతో, తక్కువగా శ్రమించడం వల్లే ఒంటి బరువు పెరుగుతుందని ఇప్పటి వరకు పలు పరిశోధనల్లో వెల్లడైంది. అయితే, బరువు పెరగడానికి ప్లాస్టిక్ వినియోగం కూడా కారణమేనని ఒక తాజా పరిశోధనలో తేలింది. ప్లాస్టిక్ టిఫిన్ బాక్సులు, ప్లాస్టిక్ బ్యాగుల్లో నిల్వ ఉంచిన ఆహారాన్ని తినడం వల్ల శారీరక జీవక్రియలు మందగించి, స్థూలకాయానికి దారితీస్తున్నట్లు జర్మనీ పరిశోధకులు గుర్తించారు.

ప్లాస్టిక్‌లోని ఫాలేట్స్ అనే రసాయనాలు ఆహారంలో కలిసి కడుపులోకి చేరుతున్నాయని, వాటి ప్రభావం వల్ల జీవక్రియలు మందగిస్తున్నాయని జర్మనీలోని హెల్మ్‌హాల్జ్ సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ రీసెర్చ్ పరిశోధకులు చెబుతున్నారు.
 

 

Advertisement
Advertisement