పోరి... పోరాడి... ప్రేమించి | Sakshi
Sakshi News home page

పోరి... పోరాడి... ప్రేమించి

Published Mon, Feb 23 2015 12:52 PM

పోరి... పోరాడి... ప్రేమించి - Sakshi

తొలివిడత ఎంపిక పూర్తయింది! ... 24 మంది మధ్య పోటీ మొదలైంది!
 
 అమ్మ  అమృతమూర్తి-7
 
పదేళ్లప్పుడు నాన్న నన్ను హాస్టల్‌లో వేస్తానంటే మా అమ్మ ‘‘వద్దు’’ అంది. ‘‘వాడసలే నోరు లేనివాడు. ఎవర్నీ ఏదీ అడగలేడు. తిండికి, ఉండడానికి కష్టమౌతుంది’’ అని మా అమ్మ, నాన్నకు నచ్చజెప్పింది. ఇక ఆ తర్వాత నేను ఇంట్లోనే పెరిగాను. పదిహేడేళ్లొచ్చాక నాన్న తన బంధువుల సహాయంతో మా అమ్మ వద్దంటున్నా వినకుండా ఉద్యోగం కోసం నన్ను చైనా పంపించారు. అక్కడి తిండి తినలేక, ఆరోగ్యం పాడై నేను పడిన అవస్థలు తెలిసి అమ్మ భోజనం మానేసి, నన్ను ఇక్కడికి తీసుకొచ్చాకే ఏదైనా అని పట్టుబడితే అప్పుడు నన్ను చైనా నుంచి తీసుకొచ్చారు. అమ్మ అలా చేయకపోయి ఉంటే నేను అప్పుడే అక్కడే చనిపోయి ఉండేవాడిని.  అప్పుడు తెలిసింది అమ్మంటే ఏంటో.

నా ఫ్రెండ్స్ కొన్నిసార్లు నన్ను మోసం చేసినప్పుడు అమ్మ గమనించి ఒక మాట చెప్పింది. ‘‘ఎవరితోనూ లోతుగా స్నేహం చేసి, ప్రేమ పెంచుకోకు. చిన్ననాటి స్నేహితులు చాలు’’ అని చెప్పింది.

నాకు తరచు తలనొప్పి వస్తుంటుంది. అమ్మ చాలామంది డాక్టర్లకు చూపించింది. కానీ అది పుట్టుకతో వచ్చిందనీ, తగ్గకపోవచ్చనీ డాక్టర్లు అన్నారు. అయినా అమ్మ తన ప్రయత్నాలు మానలేదు. వైద్యంగా ఎవరు ఏది చెప్పినా దాన్ని పాటించింది. ఒక్కోసారి నేను భరించలేని తలనొప్పితో ఇంటికి వస్తే నా బాధను చెప్పకపోయినప్పటికీ నా ముఖం చూసి గుర్తుపట్టి టీవీ, లైట్స్ ఆఫ్ చేసి, బామ్ రాసి, నా చేత శొంఠి వేసిన టీ తాగించి పడుకోబెడుతుంది. చిత్రం ఏమిటంటే అమ్మకు ఒంట్లో ఏమాత్రం బాగోలేకపోయినా, నాకు తలనొప్పి అనగానే తనకు ఏ అనారోగ్యమూ లేనట్లు నాతో నవ్వుతూ మాట్లాడుతుంది. అందుకే అమ్మ గురించి ఒక్క మాటలో చెప్పమంటే ‘అమ్మ అంటే సర్వం’ అంటాను నేను.
 - సయ్యద్ ఆమిర్, ఖాజీపేట  ఈఫత్ సబీహా
 

Advertisement
Advertisement