చిటికెడు ఇంగువతో చీడ దూరం! | Sakshi
Sakshi News home page

చిటికెడు ఇంగువతో చీడ దూరం!

Published Sun, May 17 2015 11:39 PM

wrom distance of asafoetida!

ఇంటిప్స్
పూల మొక్కలకు పురుగు పడితే... నీటిలో కొంచెం ఇంగువ కలిపి మొక్క మొదలులో పోస్తే చీడ వదిలిపోతుంది. పూలు కూడా బాగా పూస్తాయి.
బట్టల షెల్ఫుల్లో చిన్న చిన్న పురుగులు చేరి కొట్టేస్తూ ఉంటాయి. అవి రాకుండా ఉండాలంటే షెల్ఫులో ఓ మూల రెండు ఎండు మిరపకాయలు పెట్టాలి.
గాజు సామాన్లపై మరకలు పడినప్పుడు.. నిమ్మనూనెలో ముంచిన స్పాంజి ముక్కతో తుడిస్తే వదిలిపోతాయి.

కర్పూరాన్ని ఎక్కువ రోజులు ఉంచితే కొద్దికొద్దిగా హరించుకుపోతూ ఉంటుంది. అలా అవ్వకుండా ఉండాలంటే కర్పూరం డబ్బాలో నాలుగు మిరియపు గింజలు వేయాలి.
పాతబడిన ఫర్నిచర్ కొత్తగా మెరవాలంటే... ఆలివ్ నూనెలో కొంచెం వెనిగర్ కలిపి తుడవాలి.
పప్పు దినుసును నిల్వ చేసే డబ్బాలో కొన్ని వెల్లుల్లి రేకులు వేస్తే పురుగు పట్టకుండా ఉంటుంది.
పాతబడ్డ ఉడెన్ ఫర్నీచర్ కొత్తగా మెరవాలంటే.. వేడినీళ్లలో రెండు టీబ్యాగ్‌లను ఉంచండి. పదినిమిషాలయ్యాక వాటిని తీసేసి... మెత్తటి బట్ట తీసుకొని ఆ డికాషన్‌తో ఫర్నీచర్‌ను తుడవండి.

Advertisement
Advertisement