దిస్ ఈజ్ జూనియర్ ఆర్జే భావన | Sakshi
Sakshi News home page

దిస్ ఈజ్ జూనియర్ ఆర్జే భావన

Published Sat, Nov 22 2014 11:48 PM

దిస్ ఈజ్ జూనియర్ ఆర్జే భావన

‘బిగ్’ ఎఫ్‌ఎం 92.7లో చిట్టి ఆర్జేగా అవతారమెత్తింది కె.భావన. రాయదుర్గం ఒయాసిస్ స్కూల్‌లో ఏడో తరగతి చదువుతున్న ఈ చిన్నారి... చక్కని మాటతీరుతో ఆకట్టుకుంది. బిగ్ ఎఫ్‌ఎం నిర్వహించిన పోటీలో నగరంలోని 13 పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పోటీపడ్డారు. వీరందరినీ వెనక్కు నెట్టి... అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన భావనను ‘జూనియర్ రేడియో జాకీ’గా బిగ్ ఎఫ్‌ఎం ఎంపిక చేసింది.
ఈ సీజనంతా ఈ చిన్నారి జేఆర్జేగా నగరవాసులను పలుకరిస్తుంది.

- రాయదుర్గం
 

Advertisement
Advertisement