చరణ్ ఆన్ కోర్స్ | Sakshi
Sakshi News home page

చరణ్ ఆన్ కోర్స్

Published Sun, Mar 15 2015 11:42 PM

చరణ్ ఆన్ కోర్స్

గోల్కొండ గోల్ఫ్ కోర్స్‌లో ఆదివారం ఎప్పుడూ లేనంత ఉత్సాహం కనిపించింది. స్టార్ హీరో రామ్‌చరణ్ గోల్ఫర్లు, వారి కుటుంబ సభ్యులతో ఎంతో సరదాగా గడిపాడు. కబుర్లు చెప్పి కాలక్షేపం చేశాడు. గోల్ఫర్ల ఆటను వీక్షించి అభినందించాడు. డబ్ల్యూడబ్ల్యూఎఫ్, గతి సంయుక్తంగా నిర్వహిస్తున్న గోల్ఫర్ వైల్డ్ లైఫ్ అండ్ నేచర్ టోర్నమెంట్‌లో భాగంగా ఇక్కడకు వచ్చిన రామ్‌చరణ్... అక్కడున్నవారందరితో ఫొటోలూ దిగాడు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వైల్డ్ లైఫ్ ఫొటో ప్రదర్శనలో పాల్గొన్న చిన్నారులతో ముచ్చటించి వారిని ఉత్సాహపరిచాడు. వన్యప్రాణుల సంరక్షణ తక్షణ అవసరమని పిలుపునిచ్చాడు. తాజ్ జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్ డెరైక్టర్ సరబ్‌జీత్‌సింగ్, గతి సీఈఓ మహేంద్ర అగర్వాల్, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ చైర్మన్ అనిల్‌కుమార్, హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్ రమేష్‌రెడ్డి పాల్గొన్నారు.
 -గోల్కొండ

Advertisement
Advertisement