వినియోగదారే విపణిలో రారాజు | Sakshi
Sakshi News home page

వినియోగదారే విపణిలో రారాజు

Published Wed, Dec 24 2014 1:36 AM

వినియోగదారే విపణిలో రారాజు

 ఆధునిక ఆర్థికవ్యవస్థ వినియోగదారు కేంద్రంగా నడుస్తోంది. వ్యాపార సంస్థలు ఎన్ని లక్షల సరుకులను తయారు చేసినా వాటిని కొనుగోలు చేసే వినియోగదారులకే ప్రాధాన్యం ఉంటుంది. వారి హక్కుల రక్షణ ప్రభుత్వాల కర్తవ్యమైంది. దీంట్లో భాగంగానే ఏటా డిసెంబర్ 24న జాతీయ విని యోగదారుల హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నాం. భారత పార్లమెంటు వినియోగదారుల పరిరక్షణ చట్టం 1986ను ఆమోదిం చిన దినంగా ఇది చరిత్ర కెక్కింది. మార్కెట్లో న్యాయబద్ధమైన ధరలు, వస్తుసేవలకు సంబంధించి నిజమైన సమాచారాన్ని ఆశించే వినియోగదారుల హక్కును పరిరక్షించేందుకు జాతీయ కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను రూపొందించారు. అక్రమ పద్ధతులకు పాల్పడే వ్యాపారులు, సర్వీస్ ప్రొవైడర్ల బారి నుండి ఈ చట్టం వినియోగ దారులను రక్షిస్తుంది. అమెరికా కాంగ్రెస్‌లో అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ 1962 మార్చి 15న వినియోగదారుల హక్కులపై చారిత్రక ప్రకటన చేశారు. అప్పటి నుంచి మార్చి 15వ తేదీని ప్రపంచ విని యోగదారుల దినంగా జరుపుకుంటున్నారు. దీని ప్రభావంతోటే మన దేశం కూడా వినియోగదారుల హక్కును గుర్తించే చట్టాన్ని రూపొందించుకుంది.

విద్యుత్ సరఫరా, నీటి పం పిణీ, ఆరోగ్యరంగం, టెలిఫోన్, విద్య, విద్యుత్, కొరియర్, టెలికామ్, క్రెడిట్ కార్డులు, ఎల్‌పీజీ, ఆటోమొబైల్స్, బ్యాంకింగ్, గృహోపకరణాలు, పోస్టల్, రవాణా వంటి  ప్రభుత్వ, ప్రైవేట్ సేవ లతోపాటు మార్కెట్లో కొనుగోలు చేసే ప్రతివ స్తువు, సేవ నుండి వినియోగదారులకు రక్షణ కల్పించేలా ఈ చట్టాన్ని రూపొందించారు. ఇందులో వినియోగదారులు పాటించా ల్సిన బాధ్యతలు కూడా ఉన్నాయి. అవి- 1. కొనుగోలు సమ యంలో రసీదు, వారంటీ, గ్యారంటీ కార్డును తీసుకోవాలి. 2. ఉత్పత్తి తయారీ తేదీ, గడువు ముగింపు తేదీని పరిశీలించాలి. 3. ఉత్పత్తిపై ముద్రించిన గరిష్ట ధరను తనిఖీ చేయాలి. 4. విక్రయ దారులు అందించే ఉత్పత్తి బుక్‌లెట్‌కనుగుణంగా సరుకు బ్రాండ్ పేరు, కంపెనీ పేరును తనిఖీ చేయాలి. 5. షాపులో తెల్లకాగితంపై ఎలాంటి పరిస్థితిలోనూ సంతకం పెట్టకూడదు. ఒక వేళ సంతకం పెట్టవలసివస్తే దాని ఫొటో కాపీని అడిగి తీసుకోండి.
 (నేడు జాతీయ వినియోగదారుల హక్కుల దినం)
 కె.రాఘవేంద్రరావు,  హైదరాబాద్

Advertisement

తప్పక చదవండి

Advertisement