ఈకో ఫ్రెండ్లీ | Sakshi
Sakshi News home page

ఈకో ఫ్రెండ్లీ

Published Sun, Sep 7 2014 3:16 AM

ఈకో ఫ్రెండ్లీ - Sakshi

నగరంలో మంచినీటి కొరత సర్వసాధారణం. ఈ నేపథ్యంలో చాలామంది అయిష్టంగానైనా బోర్ వాటర్ ఉపయోగిస్తుంటారు. ఇందులో ఉప్పు శాతం అధికంగా ఉంటుంది. ఈ ఉప్పు నీటిని వుంచినీటిగా మారుస్తుంది ఎకో ఫ్రెండ్లీ ‘నానో కాటలిక్ ఇన్‌స్టంట్ వాటర్ కన్వర్టర్’.   ఇది బోర్ వాటర్‌ను ఫిల్టర్ చేసి మంచి నీటిగా మారుస్తుంది. కెమికల్స్, పొల్యూషన్, బ్యాక్టీరియా ఉండదు. ఈ కన్వర్టర్‌ను గృహావసరాలకు, వ్యవసాయం, పరిశ్రమల్లో కూడా ఉపయోగించవచ్చు. నీటిలో టోటల్ డిజాల్వ్ సాలిడ్ 300 వరకు ఉంటే దాన్ని తాగునీటిగా వాడవచ్చని దివ్యశక్తి ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ జగన్‌మోహన్‌రావు తెలిపారు. ఫ్లోరైడ్ నీటిని వంద శాతం మంచి నీటిగా మార్చే పరికరాలు త్వరలోనే అందుబాటులోకి వస్తాయంటున్నారు.

సోలార్ స్ట్రీట్‌లైట్
ఎల్‌ఈడీ ఆధారిత సోలార్ స్ట్రీట్ లైట్. 100 వాట్స్ ప్యానల్ 5.5 కిలోవాట్స్ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది బ్యాటరీతో నడుస్తుంది. దీంతో పాటు 6 మీటర్ల పోల్, బ్యాటరీ బాక్స్, లూమినరీ, సోలార్ ప్యానెల్ ఉంటుంది. స్ట్రీట్‌లైట్‌కు దీటుగా లైటింగ్ వస్తుంది. పార్కులు, ఫామ్‌హౌస్, గెస్ట్‌హౌస్, వ్యవసాయ కేంద్రాల్లో ఏర్పాటు చేసుకోవచ్చు. వీటి ద్వారా 92 శాతం వరకు విద్యుత్ ఆదా అవుతుంది. ‘సూర్యకిరణాల ప్యానెల్‌పై పడుతుంది. ఇక్కడి నుంచి చార్జ్ కంట్రోలర్ ద్వారా ఆపరేట్ అయి పగలంతా చార్జ్ అవుతుంది. వెలుతురు పోగానే ఆటోమేటిగ్గా అన్ అవుతుందని, వెలుతురు రాగానే ఆఫ్ అవుతుంది’ అని వి-ప్రో సోలార్ సిస్టమ్స్ ప్రతినిధి వీరప్రతాప్ తెలిపారు.
 
విద్యుత్ షాక్‌కు చెక్
విద్యుత్ షాక్‌కు గురై నిండు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు నగరంలో నిత్యం చోటుచేసుకుంటూనే ఉంటాయి. వీటిని నివారించేందుకు ఈక్వలెంట్ ‘ఎర్తింగ్ ఎలక్ట్రోడ్’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనివల్ల మనుషుల ప్రాణాలతో పాటు ఆస్తులకు కలిగే నష్టాన్ని నివారించవచ్చు. ఎర్తింగ్ సిస్టమ్ ఎంపిక ఆధారంగా భూమిలో ఈ పరికరాన్ని అమరుస్తారు. దీని చుట్టూ రసాయనాన్ని వాడుతారు. ఈ పరికరం సుమారు 20 ఏళ్ల పాటు పనిచేస్తుందని చెన్నైకి చెందిన ఈక్వలెంట్ పీడీ రాజేశ్ కుమార్ తెలిపారు. - వాంకె శ్రీనివాస్

Advertisement
Advertisement