డేటింగ్‌కు ఫుల్‌స్టాప్! | Sakshi
Sakshi News home page

డేటింగ్‌కు ఫుల్‌స్టాప్!

Published Fri, Feb 20 2015 11:32 PM

డేటింగ్‌కు ఫుల్‌స్టాప్!

బాలీవుడ్‌లో ఎవరు ఎందుకు కలుస్తారో... విడిపోతారో అర్థం కాదు. చాలా కాలంగా ఒకరికి ఒకరుగా తిరిగిన వర్ధమాన తారలు శ్రద్ధాకపూర్, ఆదిత్యారాయ్ కపూర్‌లు ఉన్నట్టుండి విడిపోయారు. ఇప్పటి వరకూ ఇరువురూ తమ రిలేషన్ గురించి పబ్లిక్‌లో ఎక్కడా చెప్పకపోయినా... అర్ధరాత్రుళ్లు కలసి తిరగుతూ, ప్రైవేటు పార్టీలకు అటెండవుతూ కనిపించారు.
 
 అయితే కొంత కాలంగా ఇద్దరి మధ్యా పొసగడం లేదనేది ఇండస్ట్రీ టాక్. ఇలాంటి పరిస్థితుల్లో కలిసుండి కొట్టుకోవడం కన్నా... విడిపోయి ‘గుడ్ ఫ్రెండ్స్’గా మిగిలిపోవడమే మంచిదని భావించినట్టు సమాచారం. ఇదిలావుంటే... ఎవరికి వారు సినిమాలతో బిజీగా ఉండటం వల్ల కెరీర్‌పై కాన్సన్‌ట్రేట్ చేయాలనే ఉద్దేశంతోనే దూరంగా ఉంటున్నారన్నది మరో కథనం.
 

Advertisement
Advertisement