హై లైఫ్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ ‘స్వర్ణ నఖషీ’ | Sakshi
Sakshi News home page

హై లైఫ్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ ‘స్వర్ణ నఖషీ’

Published Fri, Jul 4 2014 1:23 AM

High life fashion exhibition swarna krishi

‘స్వర్ణ నఖషీ’ ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? లేదంటే వూదాపూర్ నోవాటెల్ హోటల్‌లో నిర్వహిస్తున్న హై లైఫ్ ఫ్యాషన్
 ఎగ్జిబిషన్‌కు వెళ్లాల్సిందే. ‘స్వర్ణ నఖషీ’ అనేది రాజస్థాన్ జోధ్‌పూర్ ప్రాంతంలో ప్రసిద్ధి పొందిన హస్తకళ. బంగారాన్ని తాపడం చేసి విభిన్న రకాల ఆకృతులు, ఆభరణాలను రూపొందించే ఈ ఆర్ట్‌కు ప్రపంచవ్యాప్త ప్రాచుర్యం ఉంది. ఈ అపురూప గోల్డ్ ఎంబోజింగ్ కళాఖండాలు రెండు వేలు మొదలుకుని తొంభై వేల రూపాయుల వరకు అందుబాటులో ఉన్నాయి.

ఒడిశా నుంచి తరలివచ్చిన పటచిత్ర వస్త్రశైలులు, ముంబై నుంచి తెచ్చిన డిజిటల్ ప్రింటెడ్ బ్యాగులు, మొబైల్ ప-చ్‌లు (రూ.300 నుంచి రూ.2,000), ఉత్తరప్రదేశ్ టెర్రాకోటా, స్టోన్‌ప-డర్, పాలిస్టోన్‌ల మేళవింపుతో రూపొందిన గ-తమబుద్ధ తదితర ఆకృతులు (రూ.750 -రూ.2.50 లక్షలు) ఆకర్షణీయుంగా ఉన్నారుు. వీటితో పాటు డిజైనర్ దుస్తులు, ఇతర ఉత్పత్తులు కూడా కొలువుదీరిన ఈ వుూడు రోజుల ప్రదర్శనను ఉదయుం 10 నుంచి రాత్రి 9 గంటల వరకు సందర్శించవచ్చు. ప్రవేశం ఉచితం.

Advertisement
Advertisement