అధోగతిలో ఉన్నత విద్య | Sakshi
Sakshi News home page

అధోగతిలో ఉన్నత విద్య

Published Fri, May 8 2015 1:01 AM

వరుణ్ గాంధీ - Sakshi

 విశ్లేషణ
యూనివర్సిటీలు తమ అధ్యాపకులను డిగ్రీ కళాశాలల్లో బోధించకుండా నిరోధించి మేధోపరమైన పోషకాహార లోపాన్ని పెంపొందింపజేస్తున్నాయి. వృత్తి విద్యా సంస్థలకు లెసైన్సులను జారీ చేసే సంస్థలను నిషేధించి, వాటిని తిరిగి విశ్వవిద్యాలయాలకు అప్పగించాలి. వృత్తి విద్యలో ప్రత్యేకీకరణకు ప్రాధాన్యం ఇస్తూనే సమగ్ర బోధనాంశాలను చేర్చడం ద్వారా  వివిధ రంగాల మధ్య జ్ఞాన వారధులను నిర్మించగలం. ఐటీఐలు, పాలిటెక్నిక్‌లకు తగు గుర్తింపునిచ్చి, వర్సిటీల పరిధిలోకి తేవాలి.
 
 కలకత్తా, అలహాబాద్ విశ్వవిద్యాలయాలు ఒకప్పుడు నోబెల్ బహుమతి గ్రహీతలను, ప్రధాన మంత్రులను అందించాయి. ప్రపంచ విశ్వవిద్యాల యాల ర్యాంకింగ్స్‌లో నేడు వాటి స్థానం 400కు పైగానే! బ్రిక్స్ దేశాల్లోని 20 అగ్రశ్రేణి వర్సిటీల్లో ఒక్కటి కూడా మనది లేదు. మన విశ్వవిద్యాలయాలు అతి వేగంగా ‘‘మునిసిపల్ ఉన్నత విద్యాలయాలు’’గా దిగజారిపోతున్నా యి. ప్రవేశాలకు, డిగ్రీలకు భారీగా కేపిటేషన్ ఫీజులను వసూలు చేస్తున్న అధిక భాగం ప్రైవేటు విద్యా సంస్థల పరిస్థితీ అదే. ఆలోచన, సృజనాత్మకత, పరిశోధన, నవకల్పనల ప్రాధాన్యాన్ని తగ్గించడం ద్వారా ఈ వ్యవస్థ మేధో పరమైన పిరికితనాన్ని ప్రోత్సహిస్తోంది. భారత విశ్వవిద్యాలయ వ్యవస్థ విఫలమైంది. ఫలితంగా తరాలు గడిచేకొద్దీ ప్రమాణాలు దిగజారుతు న్నాయి. మన ఇంజనీరింగ్ పట్టభద్రుల్లో 19%, ఇతర పట్టభద్రుల్లో 5% మాత్రమే ఉద్యోగ నియామకాలకు అర్హులు. దేశవ్యాప్తంగా 5,000కు పైగా కళాశాలలు, 200కుపైగా యూనివర్సిటీలు ఉన్నాయి. వాటికి, వాటిని నియం త్రించే సంస్థలకు మధ్య ఆచరణలో పోషకులకు, సేవలందించే వారికి మధ్య ఉండే సంబంధం నెలకొంది.

 సంస్థాగతమైన క్షీణత
 మన విశ్వవిద్యాలయాలన్నీ అనిశ్చితిమయమైన మానవ వనరుల శాఖ  నియంత్రణలో ఉన్నాయి. 2013లో ప్రవేశపెట్టిన ‘రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభి యాన్’ (ఆర్‌యూఎస్‌ఏ) పథకం వికేంద్రీకరణకు ఉద్దేశించినదే గానీ, అమ లులో అది వెనుకబడి ఉంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నేటికీ కొన్ని వందల వర్సిటీలను, వేల కళాశాలలను పర్యవేక్షిస్తోంది. ఇది నిజాయితీ, సృజనాత్మకతల గొంతు నులిమేస్తోంది. చైనాలోని ఉన్నత విద్యా విధానమే మనకంటే మరింత ఎక్కువ ప్రజాస్వామికమైనదనిపిస్తుంది. మొత్తంగా మన విశ్వవిద్యాలయ వ్యవస్థ్థను విప్లవాత్మకంగా, మౌలికంగా పునర్వ్యవస్థీకరించాల్సి ఉంది. యూనివర్సిటీ పరిమాణంపై (అనుబంధ కళా శాలలు సహా) గరిష్ట పరిమితి ఉండాలి. ఆరోగ్యకరమైన వ్యవస్థల ద్వారా జవాబుదారీతనాన్ని అమలుచేయాలి. వర్సిటీ పరిపాలనను పూర్తి స్వయం ప్రతిపత్తితో, ఆర్థిక సహాయానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా అకడమిక్ పరిధిలోనే ఉంచాలి. మానవ వనరుల శాఖ, యూజీసీలు... ఐఐటీ ఐఐఐఎమ్‌ల డెరైక్టర్లు, వైస్‌ఛాన్స్‌లర్ల ఎంపికకు దూరంగా ఉండి, విధాన రూపకల్పనపై దృష్టిని కేంద్రీకరించడం మంచిది.

 కృత్రిమ విభజన
 స్వాతంత్య్రానంతరం భారత యూనివర్సిటీల వ్యవస్థను విభజించారు. విశ్వ విద్యాలయాలను బోధనకే పరిమితం చేసి, పరిశోధన కోసం వేరే సంస్థలను ఏర్పాటు చేశారు. డిగ్రీ చదువుల వరకు ‘దిగువస్థాయి’ విద్యగా మిగిలిపో యింది. ఇక వృత్తి విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. సాంకేతిక కోర్సులను సంకుచితమైన, ఒకే దిశ మార్గానికి పరిమితం చేశారు. ఇది భారీగా సామా జిక, సాంస్కృతిక నష్టాన్ని కలిగించింది. ఇంజనీరింగ్ విద్యార్థులకు సమగ్ర విద్య కొరవడగా, వైద్య కళాశాలలు ఏకాకులుగా వృద్ధి చెందాయి. ప్రత్యేకీకర ణను లోతుగా విస్తరింపచేయాలనే లక్ష్యంతో కొన్ని రంగాలకు విడిగా విశ్వ విద్యాలయాల ఏర్పాటుకు ఇచ్చిన అవకాశంతో అనావశ్యకమైన క్యాటరింగ్, యోగ వ ర్సిటీలు సైతం పుట్టుకొచ్చాయి. బోధనా కార్యక్రమాల్లో లేదా వృత్తి కోర్సుల శాఖల రూపకల్పనలో వర్సిటీల మాటకు విలువే ఇవ్వడం లేదు.

 మన గ్రేడింగ్‌ల వ్యవస్థ సైతం అయోమయమే. మూల్యాంకన ం కొల బద్ధల్లో చాలా తేడాలుండి ఒకే డిగ్రీకి రెండు నుంచి ఆరు డివిజన్ల పద్ధతులు అమల్లో ఉన్నాయి. మధురై కామరాజ్ యూనివర్సిటీ మాస్టర్ డిగ్రీ స్థాయిలో ప్రథమ, ద్వితీయ శ్రేణులను మాత్రమే ఇస్తుంటే, గుజరాత్, ఉస్మానియా వర్సి టీలు మూడు డివిజన్లను అమలు చేస్తున్నాయి. గురు గోబింద్ సింగ్ ఇంద్ర ప్రస్థ వర్సిటీ మూడు విడివిడి ప్రథమ శ్రేణులు సహా ఐదు డివిజన్ల పథకాన్ని అమలు చేస్తోంది. ఇక కాలం చెల్లిన పరీక్షల విధానం చూడటానికి విద్యార్థి శక్తి సామర్థ్యాలను సర్టిఫై చేస్తున్నట్టుంటుంది. కానీ విద్యార్థికి, ఉద్యోగ అవసరా లకనుగుణంగా మలచుకునే ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కల్పించడం లేదు. సీనియర్ వర్సిటీ అధ్యాపకులను డిగ్రీ కళాశాలల్లో బోధించకుండా నిరోధిం చడం ద్వారా మన విశ్వవిద్యాలయాల వ్యవస్థ మేధోపరమైన పోషకాహార లోపాన్ని పెంపొందింపజేస్తోంది. వర్సిటీల అత్యుత్తమ బోధనా సిబ్బంది సేవలను అందించడం ద్వారా కళాశాలలతో వర్సిటీ అనుబంధాన్ని పెంపొం దింపజేయాలి. ప్రత్యేకీకరణకు ప్రాధాన్యం ఇస్తూనే సమగ్ర బోధనాంశాలను కూడా చేర్చడం ద్వారా వృత్తి విద్యలోని వివిధ రంగాల మధ్య జ్ఞాన వారధు లను నిర్మించగలం. వృత్తి విద్యా సంస్థలకు లెసైన్సులను జారీ చేసే మధ్యస్థ సంస్థలను నిషేధించి, ఆ సంస్థలన్నిటినీ విద్యాసంబంధ విషయాల్లోనూ, పరిపాలనాపరంగానూ కూడా తిరిగి విశ్వవిద్యాలయాలకు అప్పగించాలి. పారిశ్రామిక శిక్షణా సంస్థలకు, పాలిటెక్నిక్‌లను కూడా వర్సిటీల పరిధిలోకి తేవాలి. అప్పుడే సుదీర్ఘంగా నిర్లక్ష్యం చేస్తున్న సామాజిక న్యాయం, అసమా నతల వంటి సమస్యలను పరిష్కరించగలుగుతాం.

 బోధనాపరమైన నాణ్యత
 టీచర్ల విద్యలో వర్సిటీల ప్రమేయం కేవలం బీఈడీ డిగ్రీ కార్యక్రమానికే అంటే సెకండరీ పాఠశాలలకు మాత్రమే పరిమితమైంది. పాఠశాల పూర్వ, ప్రాథమిక స్థాయి విద్యలను దాన్నుంచి మినహాయించారు. కీలక స్థానాల నియామకాలు అరుదుగా మాత్రమే ప్రతిభ ఆధారంగా జరుగుతుంటాయి. సర్వీసు కాలాన్నిబట్టి ప్రమోషన్లు వచ్చేస్తుంటాయి, ప్రభుత్వోద్యోగులతో ముడిపడ్డ  సాధారణ వేతన పద్ధతి  ఉంటుంది. ఇవన్నిటినీ నిరంకుశాధికారి లాంటి పే కమిషన్ నిర్ణయిస్తుంది. యూజీసీ విద్యార్హతలకు అధిక ప్రాధాన్యం ఇస్తుండటంతో, వర్సిటీ అధ్యాపకులు ప్రమోషన్ల వేటలో ప్రమాణాలు తక్కువైనా ఎలాగోలా పీహెచ్‌డీలు సంపాదించుకోవాలని ఆరాటపడు తున్నారు. అందుకే మన విద్యావేత్తలు అత్యధిక విద్యార్హతలున్నా అత్యంత అనుత్పాతదకమైన ‘దొరబాబులు’గా ఉంటున్నారు.
 ఉన్నత విద్యావ్యవస్థలోని ఉపాధ్యాయ విద్య నాణ్యతను పెంపొందింప జేయాలి. బోధనా సిబ్బంది కళాశాలలను ప్రోత్సహించి, కొత్త ఉపాధ్యా యుల కోసం అవి పూర్తిస్థాయి శిక్షణ కోర్సులను రూపొందించేలా ప్రోత్స హించాలి. ప్రతిభకు పట్టంగట్టే మెరిటోక్రసీని ప్రోత్సహించడం కోసం విద్యా సంబంధమైన ఉత్పాదకతతో వేతనాలను, ఉద్యోగ కాలాన్ని విస్పష్టంగా వ్యవ స్థీకృతం చెయ్యాలి. పరిశోధనలకు నిధులు, గ్రాంట్లకు సంబంధించిన విధాన పరమైన  చట్రాన్ని గణనీయంగా మార్చాలి. బోధనా సిబ్బంది నియామ కాలు, సమీక్షా వ్యవస్థ... పరిశోధనా ఫలితాలను వాటి నాణ్యతను తగు రీతిలో అంచనా వేయడంలో విఫలమౌతోంది. కాబట్టి బోధనా సిబ్బంది పరిశోధనకు, ప్రచురణలకు ప్రోత్సాహకాలను అందించడం అవసరం.  ‘విద్యాసంబంధమైన పని’ కొలమానం ప్రాతిపదికపై పరిశోధన ను పాయింట్ల పద్ధతిలో లెక్కగట్టడాన్ని యూజీసీ ఇటీవల ప్రవేశపెట్టింది. పరిశోధనలకు అవి ప్రచురితమైన పత్రికల ర్యాంకింగ్‌లను బట్టి పాయింట్లు లభిస్తాయి. ఆసక్తికరమైన విషయమేమంటే ఈ పత్రికల ర్యాంకింగ్‌ల ప్రాతిపదిక ‘‘శాన్ ఫ్రాన్సిస్కో డిక్లరేషన్ ఆన్ రీసెర్చ్ అసెస్‌మెంట్’’ పూర్తిగా తప్పని, దాన్ని వెం టనే ఎత్తేయాలని సూచించింది. పరిశోధనను దానికి దానిగానే అంచనా కట్టాలే తప్ప దాన్ని ప్రచురించిన పత్రికల ఆధారంగా లెక్కగట్టడ ం అందుకు ప్రత్యామ్నాయం కాజాలదని దుయ్యబట్టింది. కాబట్టి యూజీసీ భారతీయ ప్రచురణల కంటే ‘‘విదేశీ ప్రచురణ’’లకు, జాతీయ కాన్ఫరెన్స్‌లకంటే ‘‘అంతర్జాతీయ కాన్ఫరెన్స్’’లకు ప్రాధాన్యం ఇచ్చే పద్ధతికి స్వస్తి చెప్పాలి.

 పునరుజ్జీవం
 ప్రపంచ స్థాయి వర్సిటీలను రాత్రికి రాత్రే సృష్టించలేం. వాటికి విశ్వసనీయత గల బోధనా సిబ్బంది, అద్భుతమైన పరిపాలనావేత్తలు, మద్దతు సిబ్బంది అవసరం. అంతేకాదు, అవి పరిశోధనకు, విద్యకు మధ్య సున్నితమైన సంతులనాన్ని నెలకొల్పాల్సి ఉంటుంది. రష్యానే ఉదాహరణగా చూద్దాం (ప్రపంచంలోని అగ్రశ్రేణి 100 వర్సిటీల్లో 7 అక్కడున్నాయి). అది దేశంలోని ఉత్తమ వర్సిటీలను ఎంపిక చేసి, అందులోంచి ప్రపంచంలోని అగ్రశ్రేణి 100 జాబితాలో చేరేలా వాటిని అభివృద్ధి చేయడానికి పథకాన్ని చేపట్టింది. అంతర్జాతీయ నమూనాలను, పద్ధతులను ఉపయోగించి ఆ వర్సిటీలను లోతుగా పునర్నిర్మించింది. మనం కూడా దేశంలోని 50 అగ్రశ్రేణి వర్సిటీలను ఎంపిక చేసి, ప్రపంచ స్థాయికి చేరేలా వాటికి స్పష్టమైన అధికారాలు,  నిధులు, వనరులను సమకూర్చాలి. అయితే సర్వోత్కృష్టత రోజువారీ మస్తర్‌లో సంతకం చేయడంతో సమకూరేది కాదు. ఉపాధ్యాయులను, అధ్యా పకులను జాగ్రత్తగా అందుకోసం తర్ఫీదుచేసి, అభివృద్ధిపరచడం అవసరం. అలా చేస్తే వ్యవస్థగా ఆ సర్వోత్కృష్ట స్థానాన్ని చేరలేకపోయినా మన విద్యా ర్థులు అలాంటి శిఖరాలను అందుకోగలుగుతారు.  

 (వ్యాసకర్త కేంద్ర మంత్రి మనేకా గాంధీ కుమారుడు, బీజేపీ నేత)
 email: fvg001@gmail.com

Advertisement

తప్పక చదవండి

Advertisement