ఐ కెన్ ఫ్లై | Sakshi
Sakshi News home page

ఐ కెన్ ఫ్లై

Published Sun, Nov 30 2014 11:07 PM

ఐ కెన్ ఫ్లై

A dream is a wish your heart makes...
It is a destination you always wanted to reach

‘కలలు కనండి... వాటిని సాకారం చేసుకోండి’ అంటూ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ చెప్పే సందేశం నుంచి స్ఫూర్తి పొందినట్టుంది ఇంచుమించు ఈ కోట్ కూడా. ‘కష్టంగా కనిపించేవన్నీ అసాధ్యం కావు. ఒకవేళ దేన్నైనా అసాధ్యం అనుకుంటే దాన్ని ఎప్పటికీ సాధించలేవు’... అంటూ పదకొండు నిమిషాల ఛోటా సినిమా ‘ఐ కెన్ ఫ్లై’ యువతలో చక్కని స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేసింది. లక్ష్యం ఉన్నా... దాన్ని చేరుకొనే రాస్తా ఏదో తెలుసుకోలేని అయోమయంలో కొట్టుకుపోతున్న యువతరం భుజం తట్టి భరోసా ఇచ్చే ఈ తెలుగు షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు బెల్జియంలోని ఫ్లాండర్స్ సెకండరీ ఎడ్యుకేషన్ విద్యార్థులకు పాఠంగా మారింది. హైటెక్ సిటీలో చేసే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రవి వీడె ఈ చిత్రానికి రూపకర్త. హాలీవుడ్ సినిమా టేకింగ్‌లను తలపించేలా ఈ చిత్రాన్ని రూపొందించిన రవి తన అనుభవాలను ‘సిటీ ప్లస్’తో పంచుకున్నాడు.  - హనుమా
 
షార్ట్ ఫిల్మ్స్ తీయడం హాబీ. మా ఊరు కాకినాడ నుంచి హైదరాబాద్‌కు వచ్చాక  ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పటికి పది షార్ట్ ఫిల్మ్స్ తీశా. ‘మై లాస్ట్ ఫొటోగ్రాఫ్’కు రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులొచ్చాయి. క్రమంగా టార్గెట్ మారి... ప్రస్తుతం ఫీచర్ ఫిల్మ్ తీయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. దానికి ట్రయల్‌గానే ‘ఐ కెన్ ఫ్లై’ తీశాం. మాది పది మంది టీమ్. అందులో నలుగురు సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్. మిగిలినవారిలో ఇద్దరు హాలీవుడ్ బ్లాక్‌బస్టర్స్ ‘గాడ్జిల్లా, ప్లానెట్ ఆఫ్ ఏప్స్’ గ్రాఫిక్స్ టీంలో వర్క్ చేశారు. అంతా కలసి పెట్టుకున్నదే ‘వీకెండ్ క్రియేషన్స్’. ఈ బ్యానర్ కిందే ‘ఐ కెన్ ఫ్లై’ చేశాం.
 
ఎంతో కష్టపడ్డాం...
గత ఏడాది డిసెంబర్‌లో ఈ ఫిల్మ్ స్టార్ట్ చేశాం. ఈ ఏడాది ఏప్రిల్‌లో గానీ పూర్తి కాలేదు. నిడివి తక్కువే అయినా... ఒక్కో సన్నివేశానికీ చాలా శ్రమించాల్సి వచ్చింది. భువనగిరి ఫోర్ట్ వద్ద షూటింగ్. ఇంపోర్టెడ్ మోటర్, గోప్రో (హెలికాప్టర్) కెమెరా వంటి అధునాతన పరికరాలు ఉపయోగించాం. ఓ షాట్‌లో గాలికి పచ్చ గడ్డి కదులుతూ ఉంటుంది. అలాగే ఎత్తయిన కొండ. ఇవన్నీ చూడ్డానికి గ్రాఫిక్స్‌లా ఉన్నా... ఒరిజినల్‌గా చేసినవే. మా క్యామ్ ఓ సారి కొండ కొనపై ఇరుక్కుపోతే... ఎవరెస్ట్ ఎక్కి రికార్డు సృష్టించిన పూర్ణ, ఆనంద్ టీమ్ హెల్ప్ చేసింది. గ్రాఫిక్స్ కూడా ఎంతో అద్భుతంగా వచ్చాయి. దీని
 నెరేషన్ రికార్డింగ్ యూఎస్‌లో చేశాం.
 
లక్షన్నర రూపాయలు ఖర్చయినా... ఫిల్మ్ ఎంతో రిచ్‌గా వచ్చింది. ప్రసాద్ ల్యాబ్స్‌లో దీని ప్రీమియర్ చూసి సినీ పెద్దలు ఇంప్రెస్ అయ్యి... రెండు ఆఫర్లు ఇచ్చారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే
 ఫిబ్రవరీలో నా దర్శకత్వంలో... మా టీమ్ చిత్ర రంగ ప్రవేశం చేస్తుంది.
 
ఇదీ కథ...
చాలా మంది విజయానికి రెండు మూడు అడుగుల దూరంలోనే ఉన్నా... ఆ విషయం గ్రహించలేక చివరి నిమిషంలో డ్రాపయిపోతారు. ‘హార్డ్ వర్క్, డిటర్మినేషన్, డెడికేషన్’... ఇవి గోల్ వైపునకు తీసుకు వెళతాయి. ‘ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఇన్‌డిసిప్లీన్, లేజీనెస్’... ఇవి వెనక్కి లాగుతాయి. ఈ రెండింటినీ కచ్చితంగా బ్యాలెన్స్ చేస్తేనే గోల్‌ను రీచ్ కాగలవు. ఇదే ఈ సినిమా కథ కూడా. ఎంబీబీఎస్‌లో సీటు కోసం నాలుగేళ్లుగా ట్రై చేస్తున్న ఓ యువకుడుకి... దాన్ని సాధించడమంటే గాల్లో ఎగిరినంత. వాళ్ల నాన్నను అడిగితే... ‘ఎస్... యూ కెన్ ఫ్లై’ అంటూ ప్రోత్సహిస్తాడు. ఆ ప్రోత్సాహంతోనే యువకుడు ఫస్ట్ ర్యాంక్ సాధించడంతో చిత్రం ముగుస్తుంది. ‘కీప్ ట్రయింగ్’ అన్నదానికి కాస్త ఎడ్యుకేషన్ మిక్స్ చేసి దీన్ని రూపొందించాం.
 
బెల్జియంలో పాఠం...
ఇది చూసిన బెల్జియంలోని ‘వాన్ ఇన్’ పబ్లిషింగ్ సంస్థ నాకు రైట్స్ కోసం మెయిల్ పంపింది. రాయల్టీ చెప్పమంటే... ఓ మంచి కార్యక్రమం కోసం కనుక, నేను దాన్ని ఉచితంగానే వారికి ఇచ్చాను. డీవీడీ వెర్షన్‌గా అక్కడి 150 సెకండ్రీ ఎడ్యుకేషనల్ స్కూల్స్ (ఇక్కడ ఏడు, ఎనిమిది)లో పాఠ్యాంశంగా ప్రవేశపెడుతున్నారు. మొత్తం నాలుగు వేల మంది విద్యార్థులకు ఇది రీచ్ అవుతుందని వారు తెలిపారు. నిజంగా ఇదో పెద్ద విజయం మాకు. ఇప్పటి వరకు షార్ట్ ఫిల్మ్స్‌ను ఇలా ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం ఉపయోగించిన సందర్భాలు నాకు తెలిసి ఎక్కడా లేవు. ఇది మా టీమ్‌లో ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని నింపింది.
 
ఇండివిడ్యువల్ టాలెంట్‌ను ఎలివేట్ చేసే షార్ట్ ఫిల్మ్‌లంటే ఇప్పుడు యుూత్‌లో యువు క్రేజ్. అలా మీరూ ఇటీవల షార్ట్ ఫిల్మ్‌లు తీసుంటే... వాటి ఫొటోలు, సంక్షిప్తంగా కథ తదితర వివరాలను వూకు పంపండి. యూట్యూబ్ లింకులతో సరిపెట్టవద్దు. వినూత్నంగా... విలక్షణంగా ఉన్న వాటిని ‘సాక్షి’ పాఠకులకు పరిచయుం చేస్తాం.మెయిల్ టు sakshicityplus@gmail.com
 

Advertisement
Advertisement