Sakshi News home page

శరీరత్రయం

Published Wed, May 6 2015 1:20 AM

శరీరత్రయం

 జ్యోతిర్మయం
 ప్రతి జీవికి స్థూల సూక్ష్మ కారణ దేహాలనే మూడు శరీ రాలు ఉన్నాయి. పంచజ్ఞానేంద్రియాలతో, పంచకర్మేం ద్రియాలతో, కంటికి స్పష్టంగా కనిపించే, అస్థి మాంస మజ్జ రక్తమయ శరీరమే స్థూల శరీరం.

 సంకల్ప వికల్పాలతో మనస్సుగా, నిశ్చయాత్మక మైన బుద్ధిగా, స్మరణమాత్రమైన చిత్తంగా, భోగించే అహమ్‌గా, కంటికి కనిపించకపోయినా, నిరంతరం అనుభూతమయ్యే, ఆంతరిక శరీరమే సూక్ష్మ శరీరం. స్థూల శరీరమే నేను, సూక్ష్మ శరీరమే నేను, అన్న భ్రాం తికి కారణమైన మూలాజ్ఞానమే కారణ శరీరం. అం దరూ స్థూల శరీరాన్ని, కొందరే సూక్ష్మ శరీరాన్ని, మరి కొందరే కారణ శరీరాన్ని పరికిస్తూ ఉంటారు.

 స్థూల శరీరాన్ని అందంగా ఆరోగ్యంగా ఆకర్షణీయంగా ఉం చుకోవాలని అధికులు ఆరాటపడు తూనే ఉంటారు. స్థూల శరీరానికి నిత్యం స్నానం చేయిస్తూ ఉంటారు. నిర్మాలిన్య సాధ నాల్ని సౌందర్య సాధనాల్ని పరిమళ ద్రవ్యాల్ని వాడు తూనే ఉంటారు. వైద్యుల్ని ఆరోగ్యానికై సంప్రదిస్తూనే ఉంటారు.

 ఈ స్థూల శరీరానికి నిత్యం స్నానం చేయించక పోతే, అది మాలిన్యంతో దుర్గంధ భరితం అవుతుంది. అట్టి వారిని చూసి సభ్యసమాజం ముక్కు మూసుకుం టుంది. స్థూల శరీరానికి ఎలా మాలిన్యాలు ఉన్నాయో, అలానే సూక్ష్మ శరీరానికీ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే మాలిన్యాలు ఉన్నాయి. కానీ సూక్ష్మ శరీ రాన్ని మాలిన్య రహితంగా వినిర్మలంగా ఉంచుకోవా లని ఆరాటపడే వారు చాలా అరుదు.

 సూక్ష్మశరీర నిరంతర పరిశీలనమే ఆ నిర్మాలి న్యానికి తొలి సాధనం. అంతరంగంలో కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే దుర్గంధాలు పేరుకుం టున్నాయని ప్రథమంగా గుర్తించాలి. గుర్తించిన వెం టనే భగవన్నామ స్మరణంతో భగవత్ ధ్యానంతో భగ వత్ చింతనతో ఆ సూక్ష్మ శరీరానికి స్నానం చేయించి, దుర్గంధాల్ని నివారించాలి.

 అలా చేయకపోతే, సూక్ష్మ శరీరం దుర్గంధ భరిత మవుతుంది. సాధు సజ్జనులు ఇలాంటి సూక్ష్మ శరీ రాన్ని చూసి ముక్కు మూసుకుంటారు. మనం మన సూక్ష్మ శరీరానికి స్నానం చేయించకుండా, ఎన్నాళ్ల నుంచి ఎన్నేళ్ల నుంచి ఎన్ని జన్మల నుంచి దుర్గంధ భరి తం చేశామో, పరిశీలించాలి. అలా పరిశీలించి, తప్పి దాన్ని తెలుసుకొని, వెంటనే సూక్ష్మ శరీర అభ్యంగన స్నానానికి సమాయత్తం కావాలి. అనుదినం ఆమరణ పర్యంతం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉండాలి.

 అలా సూక్ష్మ శరీరాన్ని శుభ్రంగా వినిర్మలంగా ఉంచుకోగలిగితే, మూలాజ్ఞానమనే కారణ శరీరం కూడా జ్ఞానమయమవుతుంది. దేహ భ్రాంతి జీవభ్రాం తి అనే అవిద్య నశిస్తుంది. ఆత్మ నిష,్ఠ జ్ఞాన నిష్ఠ సిద్ధి స్తుంది. జీవితమే వినిర్మలమవుతుంది. కనుక స్థూల శరీరంతో పాటు సూక్ష్మ శరీర పారిశుద్ధ్యానికీ, తక్షణమే ప్రాధాన్యాన్ని ఇద్దాం. శరీరత్రయ శుద్ధికి సంకల్పిద్దాం. ఈ పుడమిని స్వర్గధామం చేద్దాం. నరజాతికి నారా యణ తత్వాన్ని ప్రబోధిద్దాం.

 పరమాత్ముని

Advertisement
Advertisement