వీడెవడండీ బాబూ!

27 Sep, 2014 00:41 IST|Sakshi
వీడెవడండీ బాబూ!

వెండి తెరపై కనిపించే తారలను ‘పిచ్చి’గా ప్రేమించే వార్ని చూశాం. కానీ.. వీడెవడండీ బాబు..! ఇంత తేడాగా ఉన్నాడు..! సెలబ్రిటీలపై ‘చేయి’ చేసుకొని దురద తీర్చుకోవడం ఇతగాడి సరదానట! పేరు విటాలీ సెడూక్. లేటెస్ట్‌గా ప్యారిస్‌లో ఫ్యాషన్ వీక్‌కు వెళ్లిన రియాల్టీ షో స్టార్ కిమ్ కర్దాషియాపై తెగబడ్డాడు. ఆమెను గట్టిగా లాగితే... పాపం కింద పడినంత పనైంది. షాక్ నుంచి తేరుకున్న సెక్యూరిటీ.. అతగాడిని పట్టుకుని చితకబాదారు. తీగ లాగితే.. గతంలో లియో డికాప్రియో, బ్రాడ్ పిట్, విల్‌స్మిత్ వంటి సూపర్‌స్టార్‌‌సపై పడినట్టు గొప్పగా చెప్పుకొంటున్నాడట.

మరిన్ని వార్తలు