‘మిస్ సౌత్ ఏసియా-2014’ | Sakshi
Sakshi News home page

‘మిస్ సౌత్ ఏసియా-2014’

Published Mon, Jan 5 2015 12:23 AM

‘మిస్ సౌత్ ఏసియా-2014’ - Sakshi

గ్లామర్‌కి సోషల్ రెస్పాన్సిబిలిటీ తోడైతే వరల్డ్ మరింత కలర్‌ఫుల్ అవుతుందని అంటోంది త్రిష గూడూరు. రంగుల లోకంలో విహరించడమే కాదు.. హంగులన్నీ పక్కన పెట్టి.. పేదరికంతో బాధపడే చిన్నారుల కన్నీళ్లూ తుడవాలనేది ఈ అమ్మడి మాట. ఇటీవలే అమెరికాలోని అట్లాంటాలో ‘మిస్ సౌత్ ఏసియా-2014’గా ఎంపికైన ఈ ముద్దుగుమ్మ హైదరాబాద్ వచ్చిన సందర్భంగా తన ఆశలు.. ఆశయాల్ని ‘సాక్షి సిటీప్లస్’తో ఇలా పంచుకుంది.
 ..:: శిరీష చల్లపల్లి
 
మాది కరీంనగర్. అక్కడే పుట్టాను. పన్నెండో ఏట వరకు హైదరాబాద్‌లోనే చదువుకున్నాను. చిన్నప్పటి నుంచి చారిటీ యాక్టివిటీస్ అంటే ఇంట్రెస్ట్. డాక్టర్‌నై గ్రామీణ ప్రాంత పేదల కోసం ఏమైనా చేయాలని ఆశయం. ప్రస్తుతం అమెరికాలో వైద్యవృత్తిని అభ్యసిస్తున్నాను.
 
చదువు.. చిన్నారులు

నాన్న బ్యాంకు ఎంప్లాయ్. తరచూ బదిలీలు కావడంతో పలు ప్రాంతాలకు మారే వాళ్లం. ఈ సమయంలోనే పల్లెలకు-పట్నాలకు మధ్య తేడాలను గమనించే దానిని. నన్ను అప్పుడు ఇప్పుడూ బాగా కలవరపరిచే విషయం.. పల్లెల్లోని చిన్నారులు చదువుకు దూరమైపోవడం. వారికి చదువు ప్రాముఖ్యాన్ని వివరిస్తే మంచి ఫలితాలు ఉంటాయని నమ్మి.. ఆ దిశగా నా వాలంటీర్‌షిప్ ప్రారంభించాను.
 
క్రమశిక్షణతోనే..

నేను అందాల టైటిల్ గెల్చుకున్నానంటే.. దాని వెనుక హార్డ్‌వర్క్ ఉందని చెప్పను. క్రమశిక్షణ, ప్లానింగ్‌తోనే ఈ కిరీటాన్ని గెల్చుకున్నా. లైఫ్‌లో డిసిప్లెయిన్ ముఖ్యమని నాన్న చెప్పిన మాటల్ని అనుసరించాను. నన్ను నేను మెరుగు పరుచుకున్నా. నా రోల్‌మోడల్ ఐశ్వర్యరాయ్. నా పేరెంట్స్‌కి నన్ను నేను గిఫ్ట్‌గా ఇచ్చుకోవాలనున్నా. చారిటీలో నిమగ్నమయ్యా. రోజూ రెండు గంటల చొప్పున పల్లెల్లో పనిచేశాను. నీటి కాలుష్యం, దాని దుష్పరిణామాలపై ప్రచారం చేశా. పిల్లలకు చదువు ఇంపార్టెన్స్ గురించి వివరించాను.
 
న్యూయార్క్‌లా ఉంది..


హైదరాబాద్‌ను వదిలి పదేళ్లయింది. రింగ్‌రోడ్, ఫ్లైఓవర్స్, మాల్స్.. ఇవన్నీ అప్పుడు లేవు. ఇప్పుడెంతో మారిపోయింది. ఈ డెవలప్‌మెంట్ మంచిదే. హైదరాబాద్‌కి న్యూయార్క్‌తో చాలా పోలికలున్నాయి. మెట్రో రైల్ వస్తే సిటీ ఇంకా మారిపోతుంది. ఎంత మారినా.. ఈ నగరం తన సంస్కృతిని, సంప్రదాయాన్ని పదిలంగా కాపాడుకుంటోంది.
 
అదిరేటి డ్రెస్ మనదే..

నేను అమెరికాలో ఉన్నా, మన సౌతిండియన్ సంప్రదాయ వస్త్రధారణనే ఇష్టపడతాను. ముఖ్యంగా లంగా-ఓణీ, చీరలో మన తెలుగుదనం ఉట్టిపడుతుంది. అక్కడ జరిగే ఏ పార్టీకైనా నేను ఈ డ్రెస్‌లో అటెండ్ అవుతా. స్వచ్ఛంద సంస్థలతో కలిసి సామాజిక సేవా కార్యక్రమాలను విస్తరించే యోచనలో ఉన్నాను. అదే పనిపై ప్రస్తుతం నేను సిటీకి వచ్చాను.
 

Advertisement
Advertisement