మూవీ ఎట్ ఆర్ట్! | Sakshi
Sakshi News home page

మూవీ ఎట్ ఆర్ట్!

Published Sat, Nov 8 2014 3:25 AM

మూవీ ఎట్ ఆర్ట్! - Sakshi

మోడర్న్ ఇండియన్ ఆర్ట్‌కు ఆద్యుడు రాజా రవివర్మపై తీసిన ‘రంగ్ రసియా’ చిత్రం కళాభిమానులను ఆకట్టుకుంటోంది. గురువారం విడుదలైన ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. రణదీప్ హుడా, నందన్‌సేన్, పరేష్‌రావల్ నటించిన రంగ్ రసియాకు దర్శకత్వం కేతన్ మెహతా. రవివర్మ పెయింటింగ్స్‌లానే... చిత్రాన్ని కూడా కలర్‌ఫుల్‌గా తీర్చిదిద్దాడు దర్శకుడు. ప్రేమ కథ, సామాజిక అంశాలను బ్యాలెన్స్ చేస్తూ అద్భుతంగా తెరకెక్కించాడు. రవివర్మ ఇజాన్ని నేటితరం వారికి పరిచయం చేశాడనేది విమర్శకుల మాట.
 

Advertisement
Advertisement