నిర్మల చిత్రం.. | Sakshi
Sakshi News home page

నిర్మల చిత్రం..

Published Wed, Apr 8 2015 10:57 PM

నిర్మల చిత్రం.. - Sakshi

కొందరు కుంచె కారుల చిత్రం కాన్వాస్‌పై కుందనపు బొమ్మలా కొలువుదీరితే.. ఇంకొందరు కళాకారుల ఆలోచనలు విచిత్రాకృతుల్లో విస్మయం కలిగిస్తాయి. దేవులపల్లి హనుమంతరావు రెండో తరహా చిత్రకారుడే. ఆయన సృజించిన 20 ఆయిల్ పెయింటింగ్స్‌తో ‘సెరెన్ రివిలేషన్స్’ పేరిట ఏర్పాటు చేసిన ప్రదర్శన ఈ రోజు  సాయంత్రం 6 గంటలకు బాగ్‌లింగంపల్లిలోని ఐలమ్మ ఆర్ట్ గ్యాలరీలో ప్రారంభం అవుతోంది. ఈ నెల 24 వరకు కొనసాగే ఈ ఎక్స్‌పో ప్రతి రోజు మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 8 గంటల వరకు సందర్శించవచ్చు.
 

Advertisement
Advertisement