ఉగ్రవాదానికి మతంలేదు | Sakshi
Sakshi News home page

ఉగ్రవాదానికి మతంలేదు

Published Fri, Jan 9 2015 2:34 AM

ఉగ్రవాదానికి మతంలేదు

 రుజుమార్గం
 ఈనాడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అనేక సమస్యల్లో అగ్రతాంబూలం ఉగ్రవాదానిది. అకస్మాత్తుగా, ఎవరూ ఊహించని విధంగా జరిగే హింసాత్మక దాడిని ‘ఉగ్రవాదం’ అం టారు. శతృవుల్లో మానసిక భయోత్పాతాన్ని సృష్టించి, వారి ధైర్యాన్ని జావగారి పోయేలా చేయడం దీని ముఖ్య ఉద్దేశం. ఉగ్రవాద చర్య లన్నీ నేర స్వభావంతో మారణహోమం, హిం సాత్మక బెదిరింపులే లక్ష్యంగా ఉంటాయి. దీని ప్రత్యక్ష ప్రభావం నిరపరాధులు, నిరా యుధులు, సాధారణ ప్రజలపైనే ఉంటుంది.

 ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే వారు వ్యక్తిగత సైనికులు కాదు. తాత్కాలి కంగా ఉగ్రవాద శిబిరాల్లో చేరిన వారే అయి ఉంటారు. అయితే ఒక సంఘటిత ముఠాగా, దృఢసంకల్పంతో, భయాందోళనల వాతావ రణాన్ని కల్పించి ప్రభుత్వాలను అస్థిరపర చడం, ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేయడం వీరి ధ్యేయం. ఉగ్రవాదానికి కులం, మతం ఉండవు. దాని మతమే ఉగ్రవాదం. అమాయ కుల ప్రాణాలను మట్టుబెట్టడమే దాని అభిమ తం. ఉగ్రవాదాన్ని ఏదో ఒక మతంతో ముడి పెట్టడం అవివేకం. ప్రపంచంలోని ఏ మత మూ ఉగ్రవాదాన్ని, ప్రబో ధించదు, ప్రేరేపించదు. ఒక వేళ ఏ మతమైనా ఉగ్రవాదాన్ని బోధిస్తుందీ అంటే, అది మతం ఎంత మాత్రం కాదు. అసలు మతమంటేనే మతిని సంస్కరించేది, మనిషిని సన్మార్గంలో నడిపించేది. అన్నిరకాల రాగద్వే షాలకు, హింసా దౌర్జన్యాలకు అతీతంగా మనిషిలో ఉన్నత మానవీయ గుణాలను జనింపజేసేది, అతని హృదయంలో ప్రేమాను రాగాలను, స్నేహ, సౌహార్ద్రసోదర భావాలను నింపేదే మతం.ఇంతటి సుగుణ సంపదలు కలిగిన మతాన్ని ఉగ్రవాదంలో, తీవ్రవాదం తో ముడి పెట్టడం సమంజసం కాదు. ఉగ్ర వాది, తీవ్రవాది ఏ మతానికి, ఏ కులానికి చెందిన వాడైనా కావచ్చు. ఉగ్రవాది ఉగ్ర వాదే. ముంబై ఘాతుకానికి ఒడిగట్టిన దుర్మా ర్గులను ముస్లిం, ఇస్లాం ఉగ్రవాదులని సంబో ధించి, మాలెగావ్ ముష్కరులను హిందూ ఉగ్రవాదులని, వారిది హిందుత్వ ఉగ్రవాద మని అందామా? ప్రపంచమంతా వ్యతిరే కిస్తూ, నెత్తి నోరు బాదుకున్నా వినకుండా తనకు నచ్చని, తనమాట వినని దేశాలపై బాంబుల వర్షం కురిపిస్తున్న అమెరికాను, దాని అధ్యక్షులను క్రైస్తవ ఉగ్రవాదులని, వారిది క్రైస్తవ ఉగ్రవాదమనడం సబబా?

 ‘సర్వే జనాస్సుఖినోభవంతు’ అన్నది హిందూ ధర్మం. ‘నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించ’న్నది క్రైస్తవ మతం. ‘కనీసం నీ మాట ద్వారా కూడా పరుల మనసు గాయ పడకూడద’న్నది ఇస్లాం ధర్మం. ‘నీ కోసం ఏ స్థితిని కోరుకుంటావో, పరుల కోసం కూడా దాన్నే కోరుకో. నువ్వు తిని, నీ పొరుగు వారు పస్తులుంటే, నీలో విశ్వాసం, మానవత్వం లేవు’ అన్నారు ముహ మ్మద్ ప్రవక్త (స).

 ‘నిష్కారణంగా ఒక మనిషిని చంపితే, మొత్తం మానవ జాతిని చంపిన పాపం చుట్టుకుంటుందని ప్రవచించింది. పవిత్ర ఖురాన్. సాటి మనిషి మనసు కష్టపెడితేనే సహించని ధర్మం, ఏకంగా మానవ ప్రాణాలు తీయమని చెబుతుందా? శాంతి, ప్రేమ, కరు ణ, త్యాగం, పరోపకారం తదితర సుగుణాల ను బోధించే ధర్మం ఉన్మాదాన్ని ప్రోత్సహిస్తుం దని ఊహించడం కూడా తప్పే. కనుక ఉగ్ర వాదానికి కులమతాలు లేవు. హిందువు అయినా, ముస్లిం అయినా, క్రైస్త్తవుడైనా, లేక మరెవరైనా - వారి దుర్మార్గాల కారణంగా ఆయా మత ధర్మాలను నిందించడం, ఆ ముష్కరుల చర్యలను ఆయా మతాలకు అంటగట్టడం పూర్తిగా తప్పు. ఉగ్రవాదానికి మతం లేదు.
 ఎం.డి. ఉస్మాన్‌ఖాన్

Advertisement

తప్పక చదవండి

Advertisement