రమణీయం | Sakshi
Sakshi News home page

రమణీయం

Published Sun, Oct 12 2014 3:11 AM

రమణీయం

మదిలో మెదిలే చిత్రాలకు వర్ణాలద్ది కాన్వాస్‌పై ఆవిష్కరించే అద్భుత కళాకారులంతా ఒక్కచోట చేరారు. తమ కళాఖండాలను కళాభిమానుల ముందు పరచారు. ప్రముఖ ఆర్టిస్ట్ జగదీశ్‌మిట్టల్ గౌరవార్థం జూబ్లీహిల్స్ సృష్టి ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన ‘రమణీయం’ పెయింటింగ్స్ ప్రదర్శన రెండో రోజూ ఆకట్టుకుంది. 1950 నుంచి నేటి తరం వరకు గొప్ప గొప్ప కళాకారుల సృజనాత్మక చిత్రాలు ఇందులో అబ్బురపరిచాయి.

జగదీశ్ మిట్టల్, వైకుంఠం, లక్ష్మాగౌడ్, గౌరీ వేముల, ఏలె లక్ష్మణ్ వంటి ప్రముఖ కళాకారుల అద్భుత చిత్రరాజాలు ఇందులో కనువిందు చేశాయి. ఇలా అందరినీ ఒక్క చోట చేర్చడం ఎంతో ఆనందంగా ఉందని, ఇలాంటి అరుదైన రోజు కోసం పదిహేనేళ్లుగా కష్టపడుతున్నాం అని గౌరీ వేముల అన్నారు. తమ ఆరాధ్య చిత్రకారులతో కలసి ఈ ప్రదర్శనలో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నా అని లక్ష్మణ్ ఏలె సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఖవ్వాలీ ఆహూతులను ఉల్లాసపరిచింది.

Advertisement
Advertisement