కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో కలసి తాను నటిస్తున్న ‘బజరంగీ భాయీజాన్’ కథకు తన జీవితానికి ఎలాంటి సంబంధం లేదని కరీనా కపూర్ చెబుతోంది. ముస్లిం అబ్బాయి, బ్రాహ్మణ అమ్మాయి మధ్య ప్రేమ కథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సల్మాన్ ఖాన్ తన సొంత బ్యానర్ ‘సల్మాన్‌ఖాన్ వెంచర్స్’ కింద నిర్మిస్తున్నాడు. సైఫ్ అలీఖాన్‌తో తన ప్రేమగాథ ఆధారంగానే ఈ చిత్రం రూపొందుతోందన్న వదంతులను కరీనా తోసిపుచ్చింది. అయితే, ఇదొక చక్కని ప్రేమకథా చిత్రం అని చెబుతోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ఈద్ పర్వదినం సందర్భంగా విడుదల కానుంది.
బోనీ తదుపరి చిత్రంలో శ్రీదేవి
తన భర్త బోనీ కపూర్ నిర్మించనున్న తదుపరి చిత్రంలో శ్రీదేవి నటించనుంది. సుదీర్ఘ విరామం తర్వాత ‘ఇంగ్లిష్ వింగ్లిష్’తో తెరపై తళుక్కుమన్న ఈ అతిలోక సుందరి ప్రస్తుతం చింబు దేవన్ దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ చిత్రంలో నటిస్తోంది. తమిళ హీరో విజయ్, కన్నడ హీరో సుదీప్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యాక బోనీ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందులో ఒక పద్దెనిమిదేళ్ల అమ్మాయికి సవతితల్లి పాత్రలో శ్రీదేవి కనిపించనుంది.
అజయ్ దేవ్గన్ చిత్రంలో కాజోల్
చాలాకాలంగా తెరమరుగైన కాజోల్, త్వరలోనే తన భర్త అజయ్ దేవ్గన్ నిర్మించనున్న చిత్రంతో తెరపైకి రానుంది. ‘ఎండెమాల్’ సంస్థ సహ నిర్మాణంతో అజయ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి రామ్ మాధ్వానీ దర్శకత్వం వహించనున్నాడు. రామ్ మాధ్వానీ తొలుత అమీర్ ఖాన్‌తో ఈ చిత్రాన్ని తీయాలనుకున్నాడు. అమీర్ నిర్ణయం జాప్యం కావడంతో అజయ్‌కు కథ వినిపించాడు. ఈ స్క్రిప్ట్ అజయ్‌కు నచ్చడంతో నిర్మాణానికి సిద్ధపడ్డాడు. ఇందులో కాజోల్ ప్రధాన పాత్ర పోషించనుంది.
నా కథ కాదు...: కరీనా కపూర్
Published Wed, Jul 30 2014 1:46 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- తాతా.. నీకు టాటా..
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్‌వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి
- రగులుతున్న క్యాంపస్‌లు!
Advertisement