Sakshi News home page

ఆదివాసీల అరణ్యరోదనపై ‘ఆస్థి’త్వ భవనాలు

Published Sun, Mar 29 2015 2:23 AM

డాక్టర్ ఆర్.రామ్‌దాస్

 సందర్భం

 స్వాతంత్య్రం వచ్చి 66 ఏళ్లు దాటిపోతున్నా మన దేశంలోని గిరిజనుల జీవితాల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఆదివాసీలపై దోపిడీని రూపుమాపటా నికి చేపట్టిన అభివృద్ధి పథకాలు వారి సంక్షేమానికి బదులు వారిని దోచుకోవ డానికి సులభమైన మార్గాలను సృష్టిం చాయి. స్వాతంత్య్రానంతరం హెమడా ర్ప్, విలియర్ ఎల్విన్ నాయకత్వంలో భారత ప్రభుత్వం, నిజాం ప్రభుత్వం గిరిజనుల పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేశాయి. అభివృద్ధి పథకాలు గిరిజనుల సమస్యల పరిష్కారానికి అనుకూ లంగా లేవని తేల్చాయి. స్వాతంత్య్రానికి పూర్వం గిరిజన సమ స్యల పరిష్కారానికి స్థానికంగానూ, వ్యక్తిగత స్థాయిలోనూ ప్రయ త్నాలు సాగాయి. గిరిజనేతరులపై గిరిజనుల తిరుగుబాటు ఫలి తంగా పరోక్ష పాలనా విధానం అమలులోకి వచ్చింది. మొదట్లో వారిని అణచివేసిన వారే ఆ తర్వాత లౌక్యంగా వ్యవహరిస్తూ వారి గ్రామ నాయకులను అదుపులోకి తెచ్చుకోగలిగారు. స్వాతంత్య్రా నంతరం గిరిజనుల అభివృద్ధి, సంక్షేమాలకు పెద్ద పీట వేస్తూ ప్రణాళికాబద్ధంగా కృషి ఆరంభమైంది. కానీ ఇది ఆశించిన ఫలి తాన్ని ఇవ్వలేకపోయింది.

 గిరిజన ప్రాంతాలలో వారి భూమి పరిరక్షణకు చట్టాలు చేసిన ప్పటికీ వాటిని నిజాయితీగా అమలుచేసే ప్రభుత్వాధికారులు కరువయ్యారు. గిరిజన ఉద్యమాల ఫలితంగా 1959లో భూబద లాయింపు నిరోధక చట్టం రూపుదిద్దుకుంది. ఈ చట్టం ప్రకారం ఆదివాసుల భూములను గిరిజనేతరులు కొనకూడదు. ఈ చట్టాన్ని సవరించి 1971లో 1/70 చట్టాన్ని తీసుకువచ్చారు. ఈ చట్టం ముఖ్యోద్దేశం గిరిజన ప్రాంతంలో ఉన్న భూములను గిరిజనేత రులు అమ్మకుండా, కొనకుండా చూడటం. ఈ చట్టం నుంచి తప్పించుకోవడానికి, తగాదాలను సృష్టించడం, కోర్టులలో ఈ చట్టాలను సవాలు చేయడం వంటి అనేక మార్గాలను గిరిజనేత రులు అవలంబిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 1979లో జీఓ నం.129 ను జారీచేసింది. దీనిని ఆధారం చేసుకొని గిరిజనేతరుల అధీనం లోని భూములను గిరిజనులకు చెందకుండా చేయడానికి, గిరిజన స్త్రీని వివాహం చేసుకొని గిరిజన భూముల్ని తమ అధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించారు. ఉప్పు, మిరప కాయలు ఇచ్చి భూములను ఆక్రమించు కున్న వారు కూడా ఉన్నారు.

 1974లో అప్పటి ప్రభుత్వం 1/70 చట్టాన్ని రద్దు చేయాలని ప్రయత్నించి విఫలమైంది. ఏజెన్సీలోని ధనిక, భూస్వా మ్యవర్గాల రాజకీయ ప్రయోజనాలను రక్షించడమే దీని ముఖ్యోద్దేశం. 1/70 రెగ్యులేషన్ చట్టం అమలులో ఉన్నప్పటికీ షెడ్యూల్డు ప్రాంతంలో గిరిజనులకు చెందిన 2,00,000 ఎకరాల భూమి గిరిజనేతరుల అధీనంలో ఉంది. ఏజెన్సీలోని జలవనరులతో గిరిజనుల భూము లను సేద్య యోగం చేయడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అంతంత మాత్రమే. ఏజెన్సీ ప్రాంతంలో జలాశయాలను, ఆనకట్ట లను నిర్మించి జలవనరులను మైదాన వాసుల అవసరాలకు తరలిస్తున్నారు. 1864లో దేశంలోని అడవులన్నింటిని ప్రభుత్వం పరిధిలోకి తెచ్చారు. 1865లో భారత అటవీ చట్టాన్ని ఆమోదిం చారు. వీటి ఆధారంగా 1927లో భారత అటవీ చట్టాన్ని ప్రభుత్వం రూపొందించింది. ఆదాయాన్ని రాబట్టే మార్గంగా అడవులను గుర్తించడంలో ఈ చట్టం ముఖ్యమైన పాత్ర వహించింది.

 1980 చట్టం ప్రకారం, అటవీ ప్రాంత పరిరక్షణకు భంగం కలిగించే ఎటువంటి నిర్ణయాలూ చేయకూడదు. కానీ, గిరిజనేత రుల పట్ల మెతక వైఖరి, గిరిజనుల పట్ల కఠిన వైఖరి అవలంబించి సంపన్న వర్గాలు అటవీ సంపదను దోచుకునే అవకాశం కల్పిస్తు న్నారు. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ప్రభుత్వం అటవీ బిల్లును సిద్ధం చేసింది. అటవీ చట్టం 2006 రక్షిత అడవుల న్నింటినీ రిజర్వుడు అడవులుగా ప్రకటించడంతో గిరిజనులు, గిరిజనేతరులు భూములు కోల్పోయి రోడ్డున పడే ప్రమాదం ఏర్ప డింది. ఫారెస్టు సెటిల్‌మెంట్ అధికారికి విపరీతమైన అధికారాలను కల్పించారు. ఆయనదే అంతిమ నిర్ణయం. అటవీ సంపదకు భం గం కలిగిస్తున్నారన్న ఆరోపణతో ఎవరినైనా అరెస్టు చేయవచ్చు. ఫలితంగా గిరిజనులకు తాము సాగుచేసే భూములు దక్కకుండా పోతున్నాయి. అలాగే పోలవరం ప్రాజెక్టు వల్ల షెడ్యూల్డ్ ఏరియా లో 276 గ్రామాలు మునిగిపోతాయి. ఇది 90 శాతం గిరిజనులు నివసించే ప్రాంతం. అదేవిధంగా పోలవరంతో పాటు బాక్సైట్ గనులు బయ్యారం, ఖమ్మం జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లాలో టైగర్ రిజర్వు ఫారెస్టును చేసి వాళ్ల హక్కులను కాలరాస్తుంది. అదేవి ధంగా ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ జిల్లాలో దాదాపు 15 ఆదివాసుల జాతులు నివసిస్తున్నాయి. చింతపల్లి, జెర్రెలగూడెం, అనంతగిరి ఈ ప్రాంతాలు అన్నీ కూడా బాక్సైట్ గనుల ప్రాంతాలు, వాటిని కాజేయడానికి ప్రభుత్వం ఎంతో ప్రయత్నం చేస్తుంది.

 మన దేశంలో ఉన్న రాజకీయ పార్టీలకు అభివృద్ధి అంటే సూపర్ పాస్ట్ రైళ్లు, ఫ్యాక్టరీలు, ఐటీ ఆధారిత సంస్థలు, కార్పొరేట్ విద్యాసంస్థలు, ఇవే అభివృద్ధికి నమూనాలు. ప్రభుత్వ పథకాలు ప్రచారానికి పరిమితమయ్యాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిం చి, పథకాలు ఏ మేరకు అమలవుతున్నాయో పట్టించుకొని వాటిని సక్రమంగా నిర్వహించని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. సుపరిపాలన మరియు గిరిజనుల హక్కులు, వారి జీవన ప్రమా ణాలు మరియు 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయవలసిన బాధ్యత, తెలుగు ప్రభుత్వాలపైన ఉంది. వీటి కోసం ప్రయత్నం చేస్తేనే ‘కొమరం భీమ్’ మరియు ‘సంత్ సేవాలాల్ మహరాజ్’ అస్తిత్వ భవనాల ఆశయాలు సార్థకతమవుతాయి. లేకపోతే ఆదివా సీల ‘అరణ్య’రోదనపై ‘ఆస్తి’త్వ భవనాలుగా మిగిలిపోతాయి?

 (వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ) మొబైల్:94403 27639

Advertisement

What’s your opinion

Advertisement