షార్ట్ ఫిల్మ్స్ | Sakshi
Sakshi News home page

షార్ట్ ఫిల్మ్స్

Published Mon, Nov 17 2014 1:15 AM

Short Films

చిన్నారులపై తీసిన షార్ట్ ఫిల్మ్స్ పంపండంటూ ఆహ్వానించిన సాక్షి ‘సిటీ ప్లస్’కు అనూహ్య స్పందన వచ్చింది. వాటిల్లో బెస్ట్ త్రీ ఫిల్మ్స్‌ను చిల్డ్రన్స్ డే సందర్భంగా ఎంపిక చేసి ప్రచురించిన విషయం తెలిసిందే. మిగిలిన చిన్నారులను కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆసక్తి కలిగించిన మరికొన్ని షార్ట్ ఫిల్మ్స్, వాటి వివరాలను పాఠకులకు పరిచయం చేస్తున్నాం. బహుమతికి ఎంపిక కాకపోయినా... చక్కని నైపుణ్యం కనబరిచిన ఆ చిత్రాల వివరాలు ఈ వారం ‘షార్ట్ సినిమా’లో...
 
చేంజ్ బిగిన్స్ నవ్..

చిన్న చిన్న షాట్స్‌తో సేవ్ గర్ల్ చైల్డ్, రెస్పెక్ట్ట్ వుమన్ అనే సందేశాన్ని చక్కగా చూపించాడు దుర్గాప్రసాద్. ఒక గంట సమయంలో మొబైల్ ఫోన్‌తో షూటింగ్ చేసిన ఈ వీడియో నిడివి రెండు నిముషాలు. అమ్మగా, చెల్లిగా, కూతురిగా.. ఇలా అన్ని బంధాల్లో ప్రేమ పంచే స్త్రీలను గౌరవించాలి కానీ హింసించ కూడదు. స్త్రీల స్వేచ్ఛా, స్వాతంత్య్రాల కోసం పోరాడుదాం, సమాజంలో మార్పుని తీసుకువద్దాం అనే సందేశంతో ఈ చిత్రం ముగించాడు ఈ బుల్లి దర్శకుడు.
డెరైక్టర్: కె.దుర్గాప్రసాద్
వయసు:15 ఏళ్లు
క్లాస్: 10 తరగతి

 
ఫారిన్ వర్సెస్ ఇండియన్

ఈ రోజుల్లో పిల్లలకు ఉన్న అబ్జర్వేషన్ స్కిల్స్‌ని మెచ్చుకోక తప్పదు ఈ చిన్ని సినిమా చూశాక. ఒక చిన్న దెబ్బ తగిలితే ఇక్కడి పిల్లవాడు, ఫారిన్‌లో పిల్లలు ఎలా స్పందిస్తారు, వారి పేరెంట్స్ ఎలా హ్యాండిల్ చేస్తుంటారో ఈ ముగ్గురు చిన్నారులు ఈ షార్ట్‌ఫిలింలో చూపించారు.  హ్యామ్ క్యాం గ్రూప్‌గా ఏర్పడి ఫారిన్ వర్సెస్ ఇండియన్ అనే బుల్లి సినిమా రూపొందించడమే కాదు.. ఇందులో కొడుకు, తండ్రి, డాక్టర్ పాత్రల్లో ఈ చిన్నారులు చక్కగా నటించారు.
డెరైక్టర్స్, యాక్టర్స్:  హృతిక్, ఆదిత్య, మాజిల్  
క్లాస్: 10  

 
హ్యూమానిటీ..

రెండు పాత్రలతో సాగే ఈ చిత్రాన్ని హరికిరణ్, సాయి అనుదీప్ నటించి దర్శకత్వం వహించారు. బ్యాట్ కొనుక్కునేందుకు డబ్బులు ఇమ్మని అడుగుతాడు హరి. లేవని పంపించేస్తుంది అమ్మ. బయటకు వెళ్లిన హరికి దారిలో 500 రూపాయలు దొరుకుతాయి. అక్కడే అతని ఫ్రెండ్ సాయి ఏడుస్తూ కనిపిస్తాడు. ఇంట్లో ఇచ్చిన ట్యూషన్ ఫీజు డబ్బులు పోయాయని చెబుతాడు. దొరికిన డబ్బులతో బ్యాటు కొనుక్కోవచ్చని అనుకున్న హరి మనసు మార్చుకుని ఆ డబ్బులు సాయికి ఇచ్చేస్తాడు. ఈ విషయం తెలిసిన హరి తల్లి అతనికి బహుమతిగా 500 ఇవ్వటంతో షార్ట్‌ఫిలిం ఎండ్ అవుతుంది. చిత్రీకరణ పరంగా మాములుగా ఉన్నా.. చక్కటి సందేశంతో రూపొందించిన ఈ బుడతలను అభినందించాల్సిందే.
హరికిరణ్, సాయి అనుదీప్
క్లాస్: 7 తరగతి

 
మంత్రం

నాట్యం, మంత్రం అనే షార్ట్ ఫిలింస్ రూపొందించాడు. క్లాసికల్ డాన్స్ ఇతివృత్తంలో తనకు తెలిసిన కథను జోడించి నాట్యానికి వున్న ప్రాముఖ్యతను తెలియచేసిన చిత్రం నాట్యం. అలాగే హర్రర్ నేపథ్యంగా చిన్న దెయ్యం కథను మంత్రం అనే షార్ట్ ఫిలింగా రూపొందించాడు ఈ చిన్ని దర్శకుడు.
వీవీఎస్ తరుణ్
వయసు: 14 ఏళ్లు

 
ఏకలవ్య

చిత్తుకాగితాలు ఏరుకునే ఓ అనాథ బాలుడు బడిబాట పట్టిన కథ ఇది. అనాథ అయిన హరి రోడ్డు పక్క చిత్తుకాగితాలు ఏరుకుంటూ ఉంటాడు. తాను చిత్తుకాగితాలు ఏరుకుంటున్న సమయంలోనే చూడచక్కని దుస్తుల్లో బడికి వెళ్లే పిల్లలను చూస్తుంటాడు. తనకూ బడికి వెళ్లాలని ఉన్నా, వెళ్లలేని పరిస్థితి. రోజూ బడి బయటే ఎక్కువ సమయం గడుపుతుంటాడు. పిల్లలకు మాస్టారు చెప్పే పాఠాలను శ్రద్ధగా ఆలకిస్తుంటాడు. మాస్టారు ఓ రోజు పిల్లలను అంతకు ముందు చెప్పిన పద్యం అప్పజెప్పమని అడుగుతారు. ఎవరూ చెప్పలేకపోతారు. అప్పుడు హరి తాను చెబుతానంటూ తరగతి గది బయట నిలుచుని మాస్టారి అనుమతి కోరతాడు. మాస్టారు సరేననడంతో అతడు పద్యం అప్పజెబుతాడు. చదువుకోవాలన్న అతడి కోరిక తెలుసుకుని, మాస్టారు అతడి చదువుకు సాయం చేస్తారు.
 
ఓ మధు
ఇండివిడ్యువల్ టాలెంట్‌ను ఎలివేట్ చేసే షార్ట్ ఫిల్మ్‌లంటే ఇప్పుడు యుత్‌లో యువు క్రేజ్. అలా మీరూ ఇటీవల షార్ట్ ఫిల్మ్‌లు తీసుంటే... వాటి ఫొటోలు, సంక్షిప్తంగా కథ తదితర వివరాలను వూకు పంపండి. యూట్యూబ్ లింకులతో సరిపెట్టవద్దు. వినూత్నంగా...విలక్షణంగా ఉన్న వాటిని ‘సాక్షి’ పాఠకులకు పరిచయుం చేస్తాం.
 మెరుల్ టు sakshicityplus@gmail.com

 

Advertisement
Advertisement