జాయ్ ఆఫ్ సేవ | Sakshi
Sakshi News home page

జాయ్ ఆఫ్ సేవ

Published Wed, Dec 10 2014 12:19 AM

జాయ్ ఆఫ్ సేవ

‘సదా మీ సేవలో..’ అంటూ సాక్షి సిటీప్లస్ ఇచ్చిన పిలుపునకు స్వచ్ఛంద సంస్థల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. సిటీ జీన్స్‌లోనే చారిటీ ఉందంటూ.. నగరం వేదికగా తాము నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల వివరాలను పంపిస్తున్నాయి. సదా మీ సేవలో మేముసైతం అంటూ చేతులు కలిపి... తమ చేతల వివరాలను పంచుకుంటున్నాయి. ఈ వరుసలో ప్రచురితమవుతున్న పదకొండవ కథనమిది... నలుగురు స్నేహితులు ఓ చోట కూడితే...ఎలా ఎంజాయ్ చేయాలని ఆలోచిస్తారు.

కానీ నలుగురి కోసం ఏం చేయాలనే ఆలోచిస్తే.. ‘సంభవామి’ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు ఇలాంటి స్నేహితుల బృందమే. వరంగల్ కిట్స్ (కాకతీయ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్) కాలేజీలో చదువుకున్న ఓ నలభై మంది విద్యార్థులు ఉద్యోగాల్లో స్థిరపడ్డాక పేద పిల్లలకు సాయం చేయాలనే ఆలోచనతో ఈ సంస్థను స్థాపించారు. చదువు... మొదలు ప్రకృతి వైపరీత్యాల వరకూ.. చేతనైనంత సాయం చేస్తూ తోటివారికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
 
 సదా మీ సేవలో..
 చీకటి వెలుగుల జీవితంలో అందరూ కోరుకునేది వెలుగే. ఆ జిలుగు నీడలో పదివుందినీ ఆహ్వానించే వారు కొందరే ఉంటారు. అలాంటి వారి గురించి పదివుందికీ తెలిస్తే.. వురెందరి హృదయూల్లోనో సేవాభావం వెలుగు చూస్తుంది. సవూజం కోసం మీరు చేతులు కలిపి చేసిన చేతల వివరాలు వూకు తెలియుజేయుండి. మీకు స్ఫూర్తిగా స్టార్‌డమ్‌కి సేవను జోడించి తనదైన శైలిలో స్పందిస్తున్న సినీ నటి సవుంత ‘సిటీప్లస్’లో వెలుగుచూసే కథనాలకు బాసటగా నిలుస్తానంటోంది. మీరు చేయూల్సిందల్లా.. ఓ సంస్థ ద్వారా, వ్యక్తిగతంగా మీరు చేస్తున్న సేవల వివరాలను వూకు మెరుుల్ చేయుండి. వాటిని ‘సిటీప్లస్’లో ప్రచురిస్తాం. ఇలా ఉత్తమ సేవలు అందిస్తూ సమాజహితానికి పాటుపడుతున్న ‘సేవకుల’ను సవుంత పలకరిస్తారు. ఒక్క సవుంత వూత్రమే కాదు.. సేవ చేసే హృదయూలను అభినందించడానికి వురెందరో సెలబ్రిటీలు వుుందుకు రానున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు చేస్తున్న చారిటీ వివరాలు మెరుుల్ టు.. sakshicityplus@gmail.com
 
 నాలుగేళ్ల క్రితం స్నేహితులంతా కలిసినపుడు తోచినట్టు చేసుకుపోవడం కాకుండా ఏదైనా సంస్థని స్థాపిస్తే బాగుంటుందనే ఆలోచనకు వచ్చారు. ‘కాలేజీ రోజుల నుంచే మాకు ఇలాంటి ఆలోచనలు ఉండేవి. చిన్న చిన్న సహాయాలు చేస్తుండేవాళ్లం. మా ఫ్రెండ్స్ మొత్తం నలభై మంది వరకూ ఉంటారు. అందరూ చెన్నై, హైదరాబాద్ నగరాల్లో సెటిల్ అయ్యారు. ఒకరోజు అందరం కలిసి స్వచ్ఛంద సంస్థని స్థాపించాలనుకుని ‘సంభవామి’ పేరుతో సేవకు సిద్ధపడ్డాం. మొదట్లో అందరం నగరంలోని అనాథ పిల్లల ఆశ్రమాలకు వెళ్లి అక్కడ కాసేపు గడిపి వచ్చేవాళ్లం. వెళ్లేటప్పుడు ఊరికే వెళ్లకుండా...బియ్యం, నోటు పుస్తకాలు, బట్టలు, కూరగాయలు వంటివి తీసుకెళ్లేవాళ్లం. అలా నాలుగైదు సార్లు వెళ్లాక ఏదో ఒక సంస్థకు పూర్తిస్థాయిలో అండగా నిలబడితే బాగుంటుందనుకుని ఆశ్రీత అనాథాశ్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయడం మొదలుపెట్టాం. దీంతో పాటు వార్తాపత్రికల్లో వచ్చే కథనాలకు స్పందించి జిల్లాలకు వెళ్లి కూడా తోచిన సాయం చేస్తున్నాం’ అని చెప్పారు అలైఖ్య. ఈసీఐ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో సివిల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న అలైఖ్య.. తన స్నేహితులైన అఖిల, హర్ష, విక్రమ్, శ్రీనివాస్, అనూషల సేవాభావాన్ని కూడా గుర్తుచేసుకున్నారు.
 
 ఆశ్రీతతో పాటు...
 ఒంటరి సేవలు కాకుండా...ఒక బృందంగా ముందుకెళ్లాలన్న ఆలోచన తేజశ్వినిది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో ఆఫీసర్‌గా పనిచేస్తున్న తేజశ్విని ‘సంభవామి’ టీమ్‌కి లీడర్. ఆమె మాటల్లో చెప్పాలంటే ‘విద్యార్థి దశలో వచ్చిన ఆలోచనలు పెద్దయ్యాక ఆచరణలో పెడితే మంచి లక్ష్యాలను చేరుకున్నవాళ్లమవుతాం. ఏ స్వార్థమూ తెలియని వయసులో మనసుకు వచ్చే ఆలోచనలు చాలా స్వచ్ఛమైనవి. జీవితంలో స్థిరపడే వయసులో ఇలాంటి బాధ్యతలు నెత్తినేసుకోవడం మన ఎదుగుదలకు అడ్డంకి అవుతుందనే ఆలోచనతో చాలామంది రిటైర్ అయ్యాక సేవాకార్యక్రమాలకు ముందుకొస్తారు. కానీ మేం అలా చేయాలనుకోలేదు. ఏం చేసినా ఈ వయసులోనే చేయాలి. సొంతపని, సమాజం పని....రెండింటినీ చేసే సామర్థ్యం  ఈ వయసులోనే ఉంటుందనేది మా ఉద్దేశం. అందుకే పుట్టింది ‘సంభవామి’. ఈ టీం అనాథ పిల్లల బాగోగులతో పాటు సొంత జిల్లా వరంగల్‌కి కూడా వెళ్లి అక్కడున్న ఆర్ఫనైజ్ హోమ్స్‌కీ సహాయపడుతోంది.
 
 జిల్లాలకేగి...
 కిందటేడు ‘సంభవామి’ బృందం వరంగల్ పబ్లిక్ గార్డెన్‌లో ‘ప్లాస్టిక్‌లెస్ ఎర్త్’ అవగాహన కార్యక్రమం నిర్వహించింది. మూడు రోజులపాటు సాగిన ఈ కార్యక్రమంలో ఇరవై పాఠశాలల్లో వీడియో ప్రజెంటేషన్లు వేశారు. రోజంతా ర్యాలీ నిర్వహించారు. పిల్లలతో ఎగ్జిబిషన్లు నిర్వహించారు. ‘ఉద్యోగాలకు సెలవులు పెట్టి మేమంతా ఓ నాలుగు రోజులు వరంగల్‌లోనే ఉండిపోయాం. ప్లాస్టిక్‌లెస్ ఎర్త్ కార్యక్రమం అక్కడి ప్రజల్లో మంచి అవగాహన పెంచిందని చెప్పాలి. ఎందుకంటే వాటి వాడకం విషయంలో ప్రత్యామ్నాయ వస్తువుల్ని వాడడం గమనించాం మేం. అలాగే ఖమ్మం జిల్లా కొత్తూరు తండాలో ప్రజలు కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నారనే వార్త చదివి అక్కడికి వెళ్లాం. బట్టలు, రాగి, గోధుమ పిండి ప్యాకెట్లను తీసుకెళ్లి పంచాం. దానికోసం తెలిసినవాళ్ల దగ్గర మేమే స్వయంగా బట్టలు సేకరించాం. కొన్నింటిని కొత్తవి కొన్నాం’ అంటూ తన సంస్థ కార్యక్రమాల్ని వివరించారు అలైఖ్య.
 
 హుద్‌హుద్ కోసం...
 విశాఖపట్నంలో అల్లకల్లోలం సృష్టించిన హుద్‌హుద్ సంఘటనపుడు ‘సంభవామి’ సంస్థ వెంటనే స్పందించింది. పది మంది బృందం అక్కడికి చేరుకుంది. తాగునీటి సౌకర్యం లేక ఇబ్బందిపడుతున్న పల్లెలకు చేరుకుని వాటర్‌ప్యాకెట్లను, ఆహారపొట్లాలను పంచారు. వారి సమస్యల కోసం... కంటికి కనిపించిన, చెవికి వినిపించిన ఎలాంటి సమస్యపైనైనా స్పందించే ‘సంభవామి’ సంస్థ ఆశయం నెరవేరుస్తున్న ఈ స్నేహితులు మరింతమందకి ఆదర్శంగా నిలుస్తారని ఆశిద్దాం.
 - teamsambhavami@gmail.com
 ప్రజెంటేషన్: భువనేశ్వరి
 bhuvanakalidindi@gmail.com

Advertisement
Advertisement