Sakshi News home page

ప్రత్యేక హోదా తిరుగులేని హక్కు!

Published Tue, Apr 14 2015 12:45 AM

సి.రామచంద్రయ్య - Sakshi

 సందర్భం

  మోదీ నుంచి వెంకయ్యనాయుడు వరకు బీజేపీ నేతలంతా ఎన్నికల ముందు ఏపీకి పదేళ్ల ప్రత్యేక హోదా అంటూ ప్రజలపై కపట ప్రేమను ఒలకబోశారు. ఏరు దాటాక... అన్నట్టు నేడు ప్రత్యేక హోదాకు కుంటిసాకులతో ద్రోహం చేస్తున్నారు.
 
 పరిశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదానిచ్చే అంశంపై కేంద్రంలోని బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదానిస్తే ఇతర రాష్ట్రాలు కూడా అదే డిమాండ్ చేస్తాయనే వాదన సైతం విన వస్తోంది. ఏడు ఈశాన్య రాష్ట్రా లు, సిక్కిం, జమ్మూకాశ్మీర్‌లే గాక హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లకు.. మొత్తం 11 రాష్ట్రాలకు ఇప్పటికే ప్రత్యేక హోదా ఉంది. అలాంటి రాష్ట్రాలకు 90% నిధులు కేంద్ర గ్రాంటుగా వస్తాయి, 10% మాత్రమే రుణాలుగా ఉంటాయి. అంతేగాక రాష్ట్రం తెచ్చుకునే విదేశీ రుణాలకు సైతం కేంద్రం చెల్లిం పులు చేస్తుంది. ఎక్సైజ్, ఆదాయ పన్నులలో రాయితీలు కూడా లభిస్తాయి. ఫలితంగా విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి పరిశ్రమల స్థాపనకు పెద్ద ఎత్తున పెట్టు బడులు రావడానికి ఆస్కారం కలుగుతుంది. ప్రత్యేక హోదా లేకపోతే కేంద్ర నిధులలో 70% రుణంగా, 30% గ్రాంటుగా లభిస్తాయి. ఇతర మేళ్లేవీ కలుగవు. కేంద్రం తన వార్షిక ఆదాయంలో 30% ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల కోసం ఖర్చు చేస్తోంది. వెనుకబడిన రాష్ట్రాలు దేశంలోని ఇతర రాష్ట్రాలతో సమానంగా ఎదగడం కోసం కేంద్రం ప్రత్యేక హోదాను ఇస్తూ వస్తోంది.

 కాబట్టి రాష్ట్ర విభజన తర్వాత ఏపీ పరిస్థితి ఏమి టి? అనే అంశమే ఏపీ హోదాపై చర్చలో కీలకాంశం అవు తుంది. రాష్ట్రవిభజన నిర్ణయాన్ని తీసుకున్న కాంగ్రెస్ నేతృత్వంలోని నాటి యూపీఏ ప్రభుత్వం విభజనానం తర ఏపీ ఆర్థిక పరిస్థితిని వాస్తవిక దృష్టితో అంచనా వేసింది. అభివృద్ధి అంతా కేంద్రీకృతమైన హైదరాబాద్ ను కోల్పోవడం ద్వారా ఏటా సుమారు రూ. 15 వేల కోట్ల చొప్పున కనీసం ఐదేళ్ల పాటూ ఆర్థిక లోటు ఉం టుందని సరిగ్గానే లెక్కగట్టింది. అంతేగాక, ఏపీ ప్రధా నంగా వ్యవసాయక రాష్ట్రం కాబట్టి పారిశ్రామికాభి వృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలు ఇంకా ఏర్ప డలేదనీ, ప్రత్యేకించి రాష్ట్రంలో సగానికిపైగా జిల్లాలున్న ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడి ఉన్నాయనీ గుర్తి ంచింది. ఏపీ భవిష్యత్తు పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ సాగిన విద్యార్థి, ప్రజా ఉద్యమాలు కూడా ఈ వాస్తవిక అంచనాకు తోడ్పడ్డాయి. నాటి మన్మోహన్‌సింగ్ కేంద్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే ఏపీ ఆర్థిక స్వావలంబనకు తోడ్పడే వివిధ అంశాలను ఏపీ పునర్విభజన చట్టంలో చేర్చింది. పోలవరానికి జాతీయ హోదా, పోర్టులు, అం తర్జాతీయ విమానాశ్రయాలు, కేంద్ర విద్యాసంస్థలు, రైల్వేజోన్, మెట్రోజోన్‌లు తదితరాలు ఆ దృష్టితో చేర్చి నవే. ఏపీ ఆర్థిక లోటు పూడటానికి, పారిశ్రామికాభి వృద్ధికి, వెనుకబడ్డ జిల్లాల అభివృద్ధికి, అన్నిటికి మించి ఆర్థికంగా ఏపీ ఇతర రాష్ట్రాలకు సమంగా ఎదగడానికి దానికి ప్రత్యేక హోదా అవసరమని ప్రధానిగా మన్మో హన్ రాజ్యసభలో ప్రకటించారు. ఏదిఏమైనా రాష్ట్ర విభ జన జరగాల్సిందేనని పట్టుబట్టిన అరుణ్‌జైట్లీ, వెంక య్యనాయుడు, సుష్మా స్వరాజ్‌లతో ముందుగా చర్చిం చి మరీ ఆయన మార్చి 1 కేంద్ర మంత్రివర్గ సమావే శంలో ఏపీకి ఐదేళ్ల ప్రత్యేక హోదాను నిర్ణయించి, ప్రణా ళికా సంఘానికి ఆదేశాలు జారీ చేశారు.

 ఏపీ ప్రజల భావోద్వేగాలు మిన్నంటివున్న ఆనాడు వెంకయ్యనాయుడు ఐదేళ్ల ప్రత్యేక హోదా చాలదని పదేళ్ల హోదా కోరారు. ఆయన చిత్తశుద్ధిని విశ్వసించి ఆనాడు నేను ఆయనను బహిరంగంగానే అభినందిం చాను. ప్రజల చేత నాడు శభాష్ అనిపించుకొని, ఊరూ రా సన్మానాలు చేయించుకున్నారు కూడా. అదే పెద్ద మనిషి, అదే నోటితో నేడు ఏపీ ప్రత్యేక హోదాకు చట్ట బద్ధత లేదని పచ్చి అసత్య ప్రచారం సాగిస్తున్నారు. నాడు ప్రధానిగా మన్మోహన్ చేసిన ప్రకటనంటేనే, కేబి నెట్ నిర్ణయమంటేనే చట్టబద్ధమైనదని అర్థం. వాటికి విలువ,  చట్టబద్ధత లేకపోతే... మరి హుద్‌హుద్ తుపా ను బాధితులకు సహాయంగా ప్రధాని నరేంద్ర మోదీ విశాఖలో చేసిన రూ.1,000 కోట్ల సహాయం వాగ్దానానికి విలువ ఉంటుందా? ప్రభుత్వాలు నడిపే పార్టీలుంటా యి, పోతాయి. ప్రభుత్వం మాత్రం శాశ్వతంగా ఉం టుంది. ఒక ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాగ్దానాలు, ఆదేశాలు మరో పార్టీ ప్రభుత్వ హయాంలో అమలవు తాయనే నమ్మకం లేకపోతే ప్రజలు ప్రభుత్వాలను, పాలకులను విశ్వసిస్తారా? వారికి విలువ, గౌరవం ఉం టాయా? అలాంటి ప్రభుత్వాలపైనే కాదు ప్రజాస్వా మ్యంపైనే ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదముం దని వెంకయ్యనాయుడు గుర్తించకపోవడం శోచనీయం. బీజేపీ ఎన్నికల ప్రణాళిక ఏపీకి పదేళ్ల ప్రత్యేక హోదాను కల్పిస్తామని పేర్కొంది. పైగా ప్రధాని అభ్యర్థిగా మోదీ సైతం కాంగ్రెస్ ఏపీకి అన్యాయం చేసిందనీ, అది చేసిన దానికంటే మెరుగైన చట్టంతో, మరిన్ని ప్రయోజనాలను కల్పించి న్యాయం చేస్తామనీ వాగ్దానం చేశారు. మోదీ నుంచి వంకరటింకర వెటకారాల వెంకయ్య వరకు బీజేపీ నేతలంతా నాడు పదేళ్ల ప్రత్యేక హోదా అంటూ ప్రజలపై కపట ప్రేమను ఒలకబోశారు. ఏరు దాటాక.... అన్నట్టు నేడు ప్రత్యేక హోదాకు చట్టబద్ధతే లేదనీ, ఇం కేవేవో కుంటిసాకులతో ప్రజలను వంచించాలని చూస్తు న్నారు. ఇంతకుమించిన ద్రోహం మరొకటి ఉంటుం దా? ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ద్రోహంలో భాగ స్వామిగా మారడమే కాదు, ప్రజల ఆగ్రహం నుంచి మోదీని కాపాడటానికి నానాపాట్లు పడుతున్నారు. ఏదిఏమైనా దేశ ప్రధానిగా నాడు మన్మోహన్, మంత్రి వర్గం చేసిన నిర్ణయాలకు విలువ, చట్టబద్ధత ఉన్నాయ నేది తిరుగులేని సత్యం. దాన్ని నిరాకరించి బీజేపీ, టీడీపీలు ప్రధాని పదవినే పరిహాసం చేస్తూ తమ గోతిని తామే తవ్వుకుంటున్నాయి.
 ఏపీ ప్రత్యేక హోదా చట్టబద్ధమని నమ్మి,  కాంగ్రెస్ పార్టీ ‘ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు!’ నినాదంతో చేస్తున్న పోరాటానికి రాష్ట్ర ప్రజలందరి సంఘీభావాన్ని కోరుతున్నాం. రాజకీయాలకు అతీతంగా అందుకోసం ప్రజాపోరాటాన్ని నిర్మించడమే మన తక్షణ కార్యక్రమం.

 (వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ప్రతిపక్షనేత ఫోన్: 81069 15555)

Advertisement

What’s your opinion

Advertisement