స్వీట్ మెమొరీ | Sakshi
Sakshi News home page

స్వీట్ మెమొరీ

Published Wed, Oct 1 2014 2:14 AM

Sweet Memory: Bathukamma festival celebrations

సంతోషాన్నిచ్చింది బతుకమ్మ పండుగంటే చాలా ఇష్టం. తెలంగాణ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే ఈ వేడుకలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ అవకాశం కల్పించిన సాక్షి ‘సిటీ ప్లస్’కు ధన్యవాదాలు.
 - సందీప్తి, హీరోయిన్
 
 సంప్రదాయ వేదిక
 బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలకు వేదిక. స్వతహాగా కూచిపూడి డ్యాన్సర్‌ను కావడం... ఇలాంటి కళాత్మక పండుగను జరుపుకోవడం సంతోషంగా ఉంది.
 - రమ్య, నర్తకి
 
 పెరుగుతున్న ఆదరణ
 రాబోయే రోజుల్లో బతుకమ్మకు మరింత ఆదరణ పెరుగుతుంది. మరింత ఉత్సాహంగా ఈ వేడుక జరుపుకొంటాం. తొలిసారి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం మన సంప్రదాయానికి ఊపిరి పోస్తోంది.
 - అంజనాచౌదరి, మాజీ ఎమ్మెల్యే
 
 అదృష్టం

 గతేడాది బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నా. ఈసారి సాక్షి ‘సిటీ ప్లస్’ ఆధ్వర్యంలో ఈ ఉత్సవంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పండుగ ప్రతి ఇంటా సుఖసంతోషాలు తేవాలని ఆశిస్తున్నా.
 - మాధవీలత, హీరోయిన్
 
మధురానుభూతి:  బతుకమ్మ వేడుకలో పాల్గొనడం ఇదే తొలిసారి. ఈ అవకాశం కల్పించిన సాక్షి ‘సిటీ ప్లస్’కు కృతజ్ఞతలు. ఇలా సంప్రదాయబద్ధంగా ముస్తాబై సహ నటులతో ఆడటం జీవితాంతం గుర్తుండిపోతుంది.
 - ఫర్హాఖాన్, హీరోయిన్
 
 సంస్కృతీ సౌరభం
 బతుకమ్మ ఆట ఆరంభం నుంచి నిమజ్జనం వరకు.. ప్రతి క్షణం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కళ్లకు కట్టింది. అమెరికా నుంచి వచ్చిన వెంటనే ఈ వేడుకలో పాల్గొనే అవకాశం రావడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ టు ‘సాక్షి’.
 - రుచికాశర్మ, మిసెస్ సౌత్ ఏషియా ఇంటర్నేషనల్ 2014
 
 ‘సాక్షి’కి కృతజ్ఞతలు
 చిన్నప్పటి నుంచే సిటీలో బతుకమ్మ ఆడటం చూస్తున్నా. అప్పుడప్పుడు స్నేహితులతో కలిసి వేడుకలో పాల్గొనేదాన్ని. అయితే యాంకర్‌గా మారాక తొలిసారిగా బతుకమ్మ ఆడే అవకాశం కల్పించిన
 ‘సాక్షి’కి థ్యాంక్స్.
 - గీతాభగత్, యాంకర్

 
 ఎంజాయ్ చేశా
 ఈ వేడుకను ఎంతో ఎంజాయ్ చేశా. శిల్పరామంలో చాలా మంది మధ్య పాటలకు చప్పట్లు కొడుతూ... ఆడుతూ బతుకమ్మల చుట్టూ తిరగడం ఓ మధురానుభూతి.
 - అనూష, యాంకర్
 
 చిన్నప్పటి నుంచీ...

 మాది వరంగల్ జిల్లా. చిన్నప్పటి నుంచే బతుకమ్మ ఆడుతున్నా. అమ్మమ్మ, నానమ్మలు పాట పాడుతుంటే మేం కోరస్ అందుకునే రోజులు గుర్తొచ్చాయి. ‘సాక్షి’కి ధన్యవాదాలు.
 - మహతి, టీవీ నటి
 
 అంతా ఒక్కచోట...
 బతుకమ్మ ఆడటం ఇదే తొలిసారి. నాలాంటి నటీమణులందరినీ ఒక చోటకు చేర్చిన సాక్షి ‘సిటీ ప్లస్’కు థ్యాంక్స్. సంప్రదాయ వేదిక శిల్పారామంలో ఈ వేడుక జరుపుకోవడం మరిచిపోలేని అనుభూతి.
 - తనుశ్రీ, హీరోయిన్
 
 కలకాలం...
 సిటీలో ఎవరి లైఫ్‌లో వారు బిజీగా ఉంటున్నారు. అలాంటి సిటీకి ‘సాక్షి’ బతుకమ్మ కళ తెచ్చింది. తెలంగాణ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ ఆడటం జీవితంలో మరిచిపోలేనిది.
 - క్యాండీ, యాంకర్
 
 అద్భుతం
 గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్నవారందరినీ ఒక చోటకు చేర్చి బతుకమ్మ ఆడించడం అద్భుతంగా ఉంది. ఇలాంటి చక్కని వేడుకను నిర్వహించి, మా అందరికీ స్వీట్ మెమొరీని మిగిల్చిన ‘సాక్షి సిటీ ప్లస్’కు ధన్యవాదాలు.
 - అనిత, యాంకర్

Advertisement
Advertisement