ఇటు విలీనం.. అటు నిమజ్జనం.. | Sakshi
Sakshi News home page

ఇటు విలీనం.. అటు నిమజ్జనం..

Published Mon, Sep 8 2014 1:17 AM

ఇటు విలీనం.. అటు నిమజ్జనం.. - Sakshi

చరిత్రలో నిలిచిపోయిన ఆ రోజు భాగ్యనగరం పులకించిపోయింది. దేశభక్తికి దైవశక్తి తోడైందనిపించింది. ఓ వైపు ‘జై బోలో భారత్ మాతాకీ..’ అంటూ నినాదాలు.., రోవైపు ‘గణపతి బప్ప మోరియూ..’ నినాదాలతో హైదరాబాద్ మార్మోగిపోయింది.
 
1948 సెప్టెంబర్ 17.. తెలంగాణ విమోచన దినోత్సవం. నిజాం పాలన నుంచి హైదరాబాద్ సంస్థానం భారతావనిలో విలీనమైన రోజు. ఆ రోజు బొల్లారంలో మువ్వన్నెల జెండా రెపరెపలాడుతుండగా తెలంగాణ వ్యాప్తంగా ‘జై బోలో భారత్ మాతాకీ.. జై’ అంటూ నినాదాలు మిన్నంటాయి. తెలంగాణ చరిత్రలో వురిచిపోలేని ఈ రోజుకు వురో ప్రత్యేకత కూడా ఉంది. ఆ రోజు అనంత చతుర్దశి. హైదరాబాద్‌లో ఒకేరోజు రెండు పండుగలు. భాగ్యనగర వీధులు కోలాహలంగా ఉన్నారు. నవరాత్రులు లంబోదరుడికి స్వేచ్ఛగా వీడ్కోలు పలికారు సిటీవాసులు. రజాకార్ల దురాగతాలు ఇక ఉండవని తెలిసి ఆనందంతో పండుగ చేసుకున్నారు. సావుూహిక నివుజ్జన వేడుకల్లో వుుస్లిం సోదరులు కూడా పాల్గొని వుతసావురస్యానికి  అసలైన చిరునావూ హైదరాబాదే అని ఆనాడే చాటి చెప్పారు.
 
అందరి ఉత్సవం..
ఒక తం ధార్మిక వేడుకల్లో రో తానికి చెందిన వారు పాల్గొనడం హైదరాబాద్‌కు కొత్తకాదు. మూసీ వరదలు హైదరాబాద్‌ను ముంచెత్తి మృత్యుఘోష వినిపించిన సమయంలో నాటి నిజాం చార్మినార్ చెంతనే ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారికి చీర-సారె పంపి స్నేహగీతాన్ని వినిపిస్తే.. వినాయక నిమజ్జనోత్సవాల్లో ముస్లింలు మంచినీటి శిబిరాలు ఏర్పాటు చేసే సంప్రదాయూన్ని నేటికీ కొనసాగిస్తున్నారు.
 
మక్కామసీదులో మధ్యాహ్నం ప్రార్థనలు మొదలుకాగానే, అప్పటి వరకు భక్తిగీతాలు, భజనలతో కోలాహలంగా సాగిపోయే శోభయూత్ర నిశ్శబ్దంగా వుుందుకు వెళ్తుంది. నమాజ్ ముగించుకుని బయటకు వచ్చే పలువురు ముస్లింలు వినాయక ఊరేగింపునకు తిరిగి స్వాగతం పలకడంతో మళ్లీ నినాదాల హోరు మిన్నంటుతుంది. అడపాదడపా కొన్ని అసాంఘిక శక్తుల ప్రేరణతో ఊరేగింపులో ఉద్రిక్తతలు నెలకొన్నా.. దాదాపు వందేళ్లుగా సాగుతున్న సామూహిక నిమజ్జనోత్సవాలన్నీ ప్రశాంతంగా సాగాయి.

Advertisement
Advertisement