బతుకునిచ్చిన నగరం | Sakshi
Sakshi News home page

బతుకునిచ్చిన నగరం

Published Mon, Sep 29 2014 1:33 AM

బతుకునిచ్చిన నగరం

ఉత్తర భారతదేశం నుంచి నిజాం జామానాలో ఇక్కడకు వలస వచ్చిన మెహదరులు శ్రవుజీవులు. ఆదివాసీ జాతికి చెందిన మెహదరులు పూర్వకాలంలో కొండలు, గుట్టల్లో నివసించేవారని, వాల్మీకి మహర్షి వీరితో సహవాసం చేశారని ప్రతీతి. అందుకే వీరు వాల్మీకిని తమ ఇష్టదైవంగా కొలుస్తారు. ఏటా అక్టోబర్, నవంబర్ నెలల్లో వాల్మీకి జయుంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు. హైదరాబాద్ నగరం తమకు బతుకునిచ్చిందని గర్వంగా చెబుతారు.
 
శారీరక దారుఢ్యం గల మెహదరులను సైన్యంలో చేర్చుకుంటామని చెప్పి అప్పటి నిజాం ప్రభువులు హైదరాబాద్‌కు రప్పించారు. నిజాం పిలుపుతో పది పదిహేను కుటుంబాల మెహదరులు ఉత్తరాది నుంచి ఎడ్లబళ్లపై దాదాపు ఆరు నెలలు ప్రయూణం సాగించి ఇక్కడకు చేరుకున్నారు. ఇలా వచ్చిన వారికి సుల్తాన్‌షాహిలోని బిస్తీవాడి, చుడీబజార్‌లోని జీన్సీబోరాహి, గౌలిగూడ తదితర ప్రాంతాల్లో తాత్కాలిక గుడారాలు ఏర్పాటు చేసి ఆశ్రయుం కల్పించారు. అరుుతే, నిజాం ప్రభువులు తొలుత చెప్పినట్లుగా సైన్యంలో చేర్చుకోకుండా, వీరికి పారిశుద్ధ్య పనులను అప్పగించారు. అప్పటి నుంచి వారు పారిశుద్ధ్య పనులనే ప్రధాన వృత్తిగా చేసుకుని జీవనం సాగిస్తున్నారు.

ప్రస్తుతం వీరిలో కొందరు చిన్నా చితకా వ్యాపారాలు చేసుకుంటున్నా, చాలా వుంది సులభ్ కాంప్లెక్సుల నిర్వహణ, సెప్టిక్ ట్యాంకుల క్లీనింగ్ పనులు చేస్తున్నారు. కొందరు జీహెచ్‌ఎంసీలో పారిశుద్ధ్య కార్మికులుగా కొనసాగుతున్నారు. నగరంలోని సుల్తాన్‌షాహి, లలితాబాగ్, ఉప్పుగూడ, రాజనర్సింహ కాలనీ, మీర్‌పేట్, సరూర్‌నగర్, ఉప్పల్, అంబర్‌పేట్, గోల్నాక, రావుంతపూర్, గౌలిగూడ, కార్వాన్, లంగర్‌హౌస్, ఫస్ట్ ల్యాన్సర్, నింబోలి అడ్డా, అశోక్‌నగర్, మారేడ్‌పల్లి, అల్వాల్, బొల్లారం, కంటోన్మెంట్ వంటి ప్రాంతాల్లో దాదాపు రెండు లక్షల మది వరకు మెహదరుల జనాభా ఉంది.

కట్నం డివూండ్ చేస్తే కుల బహిష్కరణే
ఆచారాలను, సంప్రదాయూలను కాపాడుకుంటున్న మెహదరులలో వరకట్న దురాచారం లేదు. ఒకవేళ ఎవరైనా కట్నం డివూండ్ చేస్తే వారికి కుల బహిష్కరణ తప్పదని వాల్మీకి మహాసభ సభ్యుడు సురేందర్ సింగ్ పార్చా చెప్పారు. పెళ్లి తర్వాత కొత్త జంటలు స్వస్థలమైన హర్యానా వెళ్లి, అక్కడి పాత్రీ, గుర్గావ్ దుర్గావూత ఆలయూలను దర్శించుకుంటారు. పిల్లలకు పుట్టువెంట్రుకలు తీరుుంచేందుకు కూడా వాల్మీకులు హర్యానా వెళతారు. హర్యానాలోని వాల్మీకి సవూజ్ నేతృత్వంలో ఏపీ వాల్మీకి వుహాసభ, తెలంగాణ వాల్మీకి యువజన మహాసభలతో పాటు వివిధ ప్రాంతాల్లో బస్తీల వారీగా వాల్మీకి సవూజ్‌లు ఏర్పాటు చేసుకుని పండుగలు, వేడుకలతో పాటు స్వచ్ఛంద సేవా కార్యక్రవూలనూ వీరు నిర్వహిస్తున్నారు.

హుందాతనానికి చిహ్నంగా హుక్కా
మెహదరులకు ఉదయుం లేవగానే హుక్కాతాగడం తరతరాలుగా వస్తున్న అలవాటు. హుక్కాను వీరు హుందాతనానికి చిహ్నంగా భావిస్తారు. ఇంటికి వచ్చే అతిథులకు సైతం హుక్కా అందించి వుర్యాద చేస్తారు. వివిధ రకాల మూలికలను ముద్దగా చేసి, నిప్పురవ్వల్లో వేసి, హుక్కా సేవిస్తామని సురేందర్ సింగ్ పార్చా చెప్పారు. ఆస్తవూ నివారణకు హుక్కా సేవనాన్ని ఆయుుర్వేద ఔషధంగా భావిస్తావుని ఆయున వివరించారు.
 
పారిశుద్ధ్య పనుల్లో యూజమాన్య హక్కు కల్పించాలి
పారిశుద్ధ్య పనుల్లో మెహదరులకు యూజవూన్య హక్కులు కల్పించాలి. సులభ్ కాంప్లెక్స్‌ల నిర్వహణ బాధ్యతలను మెహదరులకే అప్పగించాలి. టెండర్లు వేయుకుండా స్థానికులకే అవకాశం కల్పించాలి. ఎలాంటి ష్యూరిటీ లేకుండా రూ.5 లక్షల వరకు రుణాలు మజూరు చేయూలి. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే రుణాలలో మార్జిన్ వునీని 20 శాతం వరకు, సబ్సిడీని 50 శాతం వరకు పెంచాలి. ఉత్తర భారతదేశంలో వూదిరిగానే ఇక్కడ కూడా మెహదరుల పిల్లలకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత విద్య, స్కాలర్‌షిప్‌లు కల్పించాలి. అన్ని కులాల వూదిరిగానే తహసీల్దారు కార్యాలయుం నుంచే కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లు అందజేయూలి. వాల్మీకి, అంబేద్కర్ ఆవాస్ యోజన కింద శాశ్వత గృహ నిర్మాణాలను చేపట్టాలి.

 - ప్రవీణ్ బాగ్డీ, తెలంగాణ వాల్మీకి యుువ హాసభ ప్రధాన కార్యదర్శి

Advertisement

తప్పక చదవండి

Advertisement