‘రెండు సార్లు తాగినా రిస్కే’ | Sakshi
Sakshi News home page

‘రెండు సార్లు తాగినా రిస్కే’

Published Fri, Nov 3 2017 4:35 PM

Two fizzy drinks a WEEK increases risk of diabetes, heart disease and stroke - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: వారానికి రెండు సార్లు ఫిజీ డ్రింక్‌ లేదా ఇతర శీతల పానీయాలను సిప్‌ చేసినా డయాబెటిస్‌, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, స్ర్టోక్‌ను ఆహ్వానించినట్టేనని తాజా పరిశోధన హెచ్చరిస్తోంది. వారానికి కేవలం రెండు సార్లు శీతలపానీయం తీసుకున్నా టైప్‌ 2 డయాబెటిస్‌ రిస్క్‌ అధికమవుతుందని, ఒకే ఒక్కసారి ఈ డ్రింక్‌ తీసుకుంటే రక్తపోటు అధికమవుతుందని పరిశోధన బాంబు పేల్చింది.ఈ పానీయాలతో మధుమేహంతో పాటు అధిక కేలరీలు శరీరంలో పేరుకుని బరువు పెరిగే ప్రమాదం ఉందని తెలిపింది.

వారానికి ఐదు సార్లు పైగా శీతల పానీయాలను సేవించే వారిపై జరిపిన అథ్యయనాల ఆధారంగా దక్షిణాఫ్రికాలోని స్టెలెన్‌బాష్‌ యూనివర్సిటీ శాస్ర్తవేత్తలు ఈ విషయం నిగ్గుతేల్చారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని వయసుల వారిలోనూ చక్కెరతో కూడిన శీతలపానీయాల వినియోగం పెరుగుతోందని సర్వే రచయిత ప్రొఫెసర్‌ ఫడీల్‌ ఎసోప్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ పానీయాలతో మధుమేహం, అధిక రక్తపోటు ముప్పు ఎక్కువవుతోందని తమ విశ్లేషణల్లో వెల్లడైందని చెప్పారు.ఎండోక్రిన్‌ సొసైటీ జర్నల్‌లో ఈ అథ్యయనం ప్రచురితమైంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement