వారఫలాలు (17 మే నుంచి 23 మే, 2015 వరకు) | Sakshi
Sakshi News home page

వారఫలాలు (17 మే నుంచి 23 మే, 2015 వరకు)

Published Sun, May 17 2015 1:01 AM

వారఫలాలు (17 మే నుంచి 23 మే, 2015 వరకు)

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
నూతనోత్సాహంతో పనులు చక్కదిద్దుతారు. మిమ్మల్ని అభిమానించే వారు పెరుగుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభను చాటుకుంటారు. విద్యా, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు ఉన్నతస్థితి దక్కే అవకాశం. కళారంగం వారికి సన్మానాలు. ఎరుపు, లేత పసుపురంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.
 
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.)
ఆర్థిక పరిస్థితి ఆశాజకనం. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. నూతన ఉద్యోగావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలలో కొత్త ఆశలు. ఉద్యోగులకు హోదాలు. రాజకీయవర్గాలకు పదవీయోగం. కుటుంబ, ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. నారింజ, లేత ఎరుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
 
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
పనులు సమయానికి పూర్తి కాగలవు. రావలసిన సొమ్ము అందుతుంది. కార్యోన్ముఖులై ముందడుగు వేసి విజయాలు సాధిస్తారు. విద్యార్థులకు శుభవార్తలు. వాహన, గృహ యోగాలు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు విస్తరణ. ఉద్యోగులకు సంతోషక రం. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతం. ఆకుపచ్చ, ఎరుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారా స్తోత్రాలు పఠించండి.
 
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. కుటుంబసభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనయోగం. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. నీలం, లేత ఆకుపచ్చరంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.
 
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
వారం ప్రారంభం, చివరిలో కొద్దిపాటి చికాకులు ఎదురైనా అధిగమిస్తారు. చేపట్టిన పనులు చకచ కా పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలులో పెడతారు. మీ సత్తా చాటుకునేందుకు తగిన సమయం. భవిష్యత్‌పై కొత్త ఆశలు. ఆర్థిక ప్రగతి ఉంటుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు విధుల్లో చిక్కులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు, సన్మానాలు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. నీలం, లేత ఆకుపచ్చరంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి.
 
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఈవారం మిశ్రమంగా ఉంటుంది. పనులు జాప్యంతో పూర్తి కాగలవు. ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. పరపతి కలిగిన వ్యక్తులతో పరిచయాలు. సంఘంలో గౌరవానికి లోటు ఉండదు. స్వల్ప అనారోగ్య సూచనలు. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు. వ్యాపారాలలో లాభనష్టాలు సమానం. ఉద్యోగులకు పదోన్నతులు ఊరిస్తాయి. కళారంగం వారి యత్నాలు సఫలం. చాక్లెట్, తెలుపురంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.
 
తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
స్వల్ప ఆటంకాలు ఎదురైనా పనులు పూర్తి. ఆలోచనలు కార్యరూపం. ప్రతిభాపాటవాలను చాటుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. భూములు, వాహనాలు సమకూర్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగు. సమస్యలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. వ్యాపారవృద్ధి. ఎరుపు, లేత నీలం రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
 
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆశయాల సాధనలో కుటుంబసభ్యులు సహకరిస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకం. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. కోర్టు కేసుల పరిష్కారం. వస్తులాభాలు. వ్యాపారాల విస్తరణ. ఉద్యోగులకు ప్రశంసలు. కళారంగం వారికి సత్కారాలు. ప్రారంభంలో ఆరోగ్యం మందగిస్తుంది. బంగారు, తెలుపురంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.
 
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి. ఆర్థిక విషయాలు సంతృప్తికరం. సంఘంలో గౌరవం. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు. సోద రులు, బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. ఇంటి నిర్మాణయత్నాలు సఫలం. నిరుద్యోగులకు శుభవార్తలు. కళారంగం వారికి అవార్డులు. లేత నీలం, ఆకుపచ్చరంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీగణపతి స్తోత్రాలు పఠించండి.
 
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
వ్యతిరేకులు విధేయులుగా మారతారు. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి ఆహ్వానాలు. భూములు, వాహనాలు కొంటారు. ఆలయ దర్శనాలు. విద్యార్థులకు కొత్త ఆశలు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతి సూచనలు. రాజకీయవర్గాలకు పదవీయోగం. లేత ఆకుపచ్చ, తెలుపురంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.
 
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ప్రారంభంలో కొంత నిరాశ కలిగినా క్రమేపీ అనుకూలిస్తుంది. పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. బంధువుల నుంచి ఆహ్వానాలు రాగలవు. ఆర్థిక విషయాలలో కొంత పురోగతి కనిపిస్తుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు. తీర్థయాత్రలు చేస్తారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వ్యాపారాలలో లాభాలు కనిపిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. కళారంగం వారికి అనుకోని అవకాశాలు. లేత పసుపు, ఆకుపచ్చరంగులు, పంచముఖ ఆంజనేయస్వామిని పూజించండి.
 
 మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
 చేపట్టిన పనులలో అవరోధాలు చికాకు పరుస్తాయి. ఇంటాబయటా ఒత్తిడులు. శ్రమ పడ్డా ఆశించిన ఫలితం కనిపించదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. బంధువులతో వివాదాలు. తొందరపాటు మాటలు వద్దు. వ్యాపారాలలో నిరాశ. ఉద్యోగులకు పని ఒత్తిడులు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. గులాబీ, తెలుపురంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి.

Advertisement

తప్పక చదవండి

Advertisement