వారఫలాలు ( 1 ఫిబ్రవరి నుంచి 7 ఫిబ్రవరి, 2015 వరకు ) | Sakshi
Sakshi News home page

వారఫలాలు ( 1 ఫిబ్రవరి నుంచి 7 ఫిబ్రవరి, 2015 వరకు )

Published Sun, Feb 1 2015 1:10 AM

వారఫలాలు ( 1 ఫిబ్రవరి నుంచి 7 ఫిబ్రవరి, 2015 వరకు )

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఆర్థిక లావాదేవీలు కొంత అనుకూలిస్తాయి. కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. వస్తు, వస్త్రలాభాలు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. మిత్రుల నుంచి ముఖ్య సమాచారం. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు. పారిశ్రామివర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో కుటుంబంలో చికాకులు. అనారోగ్యం.
 
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.)
పనులు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక పరిస్థితి  నిరాశ కలిగిస్తుంది. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. బంధుమిత్రులతో విభేదాలు. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. నిర్ణయాలు కొన్ని పునఃసమీక్షించుకుంటారు. వ్యాపారాలలో లాభాలు స్వల్పం. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. రాజకీయవర్గాలకు అసంతృప్తి. వారం మధ్యలో స్వల్ప ధనలాభం.
 
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు. కళారంగం వారికి కొత్త అవకాశాలు దక్కుతాయి. వారం చివరిలో ఆలయ దర్శనాలు. అనారోగ్యం.
 
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
కొత్త వ్యక్తుల పరిచయం. పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. భూములు, వాహనాలు కొంటారు. కోర్టు కేసులు పరిష్కారం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు.
 
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల నుంచి కీలక సమాచారం. భూవివాదాలు తీరతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం మధ్యలో అనారోగ్యం.
 
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం. శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నతస్థితి. పారిశ్రామికవర్గాలకు ప్రభుత్వం నుంచి ఆహ్వానాలు. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబంలో చికాకులు.
 
తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
పనులు విజయవంతంగా సాగుతాయి. ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. అంచనాలు నిజం కాగలవు. బంధువులతో ఉత్తర ప్రత్యుత్తరాలు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు పైస్థాయి నుంచి ప్రశంసలు. రాజకీయవర్గాలకు సన్మానాలు. వారం ప్రారంభంలో అనారోగ్యం. ధనవ్యయం.  దైవదర్శనాలు.
 
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ప్రారంభంలో నిరాశ కలిగినా అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతి సూచనలు. కళారంగం వారికి అవార్డులు. వారం మధ్యలో దూరప్రయాణాలు.
 
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగించినా అవసరాలు తీరతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. కొన్ని వివాదాలు  పరిష్కరించుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. రాజకీయవర్గాలకు సన్మానాలు. వారం మధ్యలో వ్యయప్రయాసలు.
 
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. బంధుమిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు అనుకూలం. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో కుటుంబ సభ్యులతో వివాదాలు.
 
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)

ఇంటాబయటాఎదురుండదు. బంధువులతో వివాదాలు తీరతాయి. మీ కృషి ఫలించి ఉద్యోగాలు సాధిస్తారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలు కలిసివస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త ఆశలు. కళారంగం వారికి పురస్కారాలు. వారం ప్రారంభంలో సోదరులతో విభేదాలు. అనారోగ్యం.
 
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
అనుకున్న వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. దూరప్రయాణాలు ఉంటాయి. ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. రావలసిన డబ్బు అందుతుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఉద్యోగులకు అంచనాలు నిజమవుతాయి. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం మధ్యలో కుటుంబంలో చికాకులు. ధనవ్యయం.
 సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు

Advertisement
Advertisement