సీతాకోకమ్మకు... గోరుముద్ద | Sakshi
Sakshi News home page

సీతాకోకమ్మకు... గోరుముద్ద

Published Sat, Jun 4 2016 10:57 PM

సీతాకోకమ్మకు... గోరుముద్ద

నెయిల్ ఆర్ట్
ఇది బటర్‌ఫ్లై నెయిల్ ఆర్ట్... దీన్ని వేసుకోవడానికి ఆరెంజ్, పసుపు, తెలుపు, నలుపు, ట్రాన్స్‌పరెంట్ నెయిల్ పాలిష్‌లు కావాలి. వాటితో పాటు నెయిల్ పాలిష్ రిమూవర్, స్పాంజి ముక్కను కూడా సిద్ధం చేసుకోవాలి. ముందుగా గోళ్లను శుభ్రం చేసుకొని, అందంగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ డిజైన్‌ను జాగ్రత్తగా వేసుకోండి. ఎలా అంటే..
 
1.    ముందుగా గోళ్లన్నిటికీ పూర్తిగా ట్రాన్స్‌పరెంట్ నెయిల్ పాలిష్ వేసుకోవాలి.
 
2.    అది పూర్తిగా ఆరిపోయాక.. అన్ని గోళ్లకు తెలుపు రంగు పాలిష్ వేసుకోవాలి.
 
3.    ఇప్పుడు స్పాంజి ముక్కపై ఫొటోలో కనిపిస్తున్నట్టుగా పసుపు, ఆరెంజ్ రంగులు పూయాలి (ఎక్కువ భాగం ఆరెంజ్ కలర్ ఉండేలా చూసుకోవాలి).
 
4.    ఆ స్పాంజీని గోళ్లపై అద్దాలి. అప్పుడు ఆ రెండు రంగులు మీ గోళ్లకు అతుక్కుంటాయి. రెండు మూడు కోటింగ్స్ వేసుకుంటే రంగులు ముదురుగా అందంగా వస్తాయి .
 
5.    నెయిల్ పాలిష్ గోళ్లకే కాదు.. వేళ్లకూ అంటుకుంటుంది. కాబట్టి ఇప్పుడు నెయిల్ పాలిష్ రిమూవర్‌తో అలా అంటుకున్న పాలిష్‌ను తొలగించండి. ఆపైన గోళ్లకు ట్రాన్స్‌పరెంట్ పాలిష్‌తో ఓ కోటింగ్ వేయండి.
 
6.    ఇప్పుడు బ్లాక్ పాలిష్‌ను తీసుకొని, అందులో సన్నని బ్రష్‌ను ముంచి గోళ్లపై ఓ ఆర్క్ (చాపం) గీయాలి.
 
7.    తర్వాత అదే కలర్ పాలిష్‌తో ఫొటోలో కనిపిస్తున్న విధంగా డిజైన్ వేసుకోవాలి.
 
8.    ఆపైన గోళ్ల పై చివర ఖాళీగా ఉన్న చోట బ్లాక్ పాలిష్‌ను పూర్తిగా రాయాలి.
 
9.    ఇప్పుడు తెలుపు రంగు పాలిష్‌తో బ్లాక్ పాలిష్‌పై చుక్కలు పెట్టుకోవాలి.
 
10.    పాలిష్ పూర్తిగా ఆరిపోయాక, ట్రాన్స్‌పరెంట్ పాలిష్‌తో ఓ కోటింగ్ వేసుకుంటే గోళ్లు అందంగా షైన్ అవుతాయి. అంతే, ఎంతో అందమైన సీతాకోక చిలుకలు మీ గోళ్లపై ఎగిరి తీరాల్సిందే.

Advertisement
Advertisement