పుల్లే అని పారేయకండి | Sakshi
Sakshi News home page

పుల్లే అని పారేయకండి

Published Sun, Sep 18 2016 2:02 AM

పుల్లే అని పారేయకండి

ఇప్పటి వరకు ఎన్నోరకాల జ్యుయెలరీ మేకింగ్‌ను చూశాం. కొత్తగా.. వింతగా.. చిత్రంగా అనిపించే జ్యుయెలరీలను చూశాం. అయితే ఈ వారం మేకింగ్ కూడా ఆశ్చర్యాన్ని కలిగించేదే. ఏమీ లేదండీ... ఎన్నో రకాల బ్రేస్‌లెట్లను చూసుంటాం. అవునా, కానీ పాప్సికల్ స్టిక్ బ్రేస్‌లెట్లను చూశారా? అదేనండీ... ఐస్‌ఫ్రూట్ పుల్లలతో తయారు చేసినవి. అదెలా? వాటిని కాస్త వంచినా విరిగిపోతాయి కదా అంటారా? అయితే వెంటనే తయారీని తెలుసుకోవాల్సిందే..
 
కావలసినవి: ఐస్‌ఫ్రూట్ పుల్లలు, వేడి నీళ్లు, వివిధ రకాల కప్పులు, రంగురంగుల పెయింట్స్, రంగురంగుల దారాలు, డిజైనరీ టేప్స్
 
తయారీ: ముందుగా ఈ ఐస్‌ఫ్రూట్ పుల్లలను వేడి నీళ్లలో రెండు గంటల పాటు నానబెట్టాలి. తర్వాత మీ చేతికి తగ్గ సైజులో ఉన్న కప్పును తీసుకొని, ఈ నానిన పుల్లలను కాస్త వంచి కప్పు గోడకు అమర్చాలి. తర్వాత పుల్లలు పూర్తిగా ఆరిపోయాక (గట్టిపడ్డాక) వాటిని బయటకు తీయాలి. ఇప్పుడు వాటిని ఎలాగైనా అలంకరించొచ్చు. రంగురంగుల దారాలను వంగిన పుల్లకు చుట్టాలి. అలాగే, వివిధ రంగుల పెయింట్స్‌ను పూసినా సరిపోతుంది. అంతేనా, షాపుల్లో దొరికే డిజైనరీ టేప్స్‌ను కూడా వాటికి చుట్టొచ్చు. దారాలు, టేపులే కాదు... మామూలు కలర్ స్కెచ్ పెన్నులతోనూ వీటిపై డిజైన్స్ వేసుకోవచ్చు. ఇలాంటి బ్రేస్‌లెట్లను చిన్నపిల్లలు, యువత బాగా ఇష్టపడతారు. మరెందుకు ఆలస్యం.. కానివ్వండి మరి.

Advertisement
Advertisement