హృదయం: మొన్నటి జూలై 11 తో జోడీ రోస్, లె పాంట్ డు డయబుల్ వివాహ బంధానికి ఏడాది పూర్తి అయ్యింది! ఈ సందర్భంగా జోడీ లెపాంట్ డు మీద గంతులేస్తూ తన ఆనందాన్ని పంచుకొంది. చాలా మంది తమ బంధాన్ని అవమానిస్తూ మాట్లాడారని, తనను పిచ్చిదాన్ని చూసినట్టుగా చూశారని, అయితే ఏడాదిగా లెపాంట్ డుతో బంధాన్ని కొనసాగించి తన ప్రేమను నిరూపించుకొన్నానని, తమ వివాహ బంధం ఇలాగే నిండునూరేళ్లు కొనసాగుతుందని జోడీ చెప్పుకొచ్చింది! అయితే లెపాంట్ డు మాత్రం మారు మాట్లాడలేదు. ఎందుకంటే అది ఒక రాతి కట్టడం, కాంక్రీట్ స్ట్రక్చర్!
ప్రకృతిరమణీయ ప్రదేశాలపై ఎంతోమంది మనసు పారేసుకొంటారు. సహజసిద్ధంగా ఏర్పడిన నిర్మాణాలను, కట్టడాలను ప్రేమిస్తారు. అయితే జోడీ రోస్కు మాత్రం ఈ ప్రేమ ముదిరింది. ఏకంగా ఒక బ్రిడ్జిని పెళ్లి చేసుకొంది! ఆ బ్రిడ్జినే తన భర్తగా భావిస్తోంది! చట్టబద్ధంగా ఆ పెళ్లి చెల్లకపోయినా... జోడీ మాత్రం తమ జోడీని ఎవరూ విడదీయలేరని అంటోంది. జోడీ రోస్ ఒక ఆస్ట్రేలియన్. పాపులర్ పాప్ సింగర్. పాప్ ఆల్బమ్స్‌ను రూపొందించడంలో భాగంగా ప్రపంచంలోని అనేక ప్రాంతాలను సంద ర్శించిందామె. అనేక వంతెనల మీద నిలబడి పాడుతూ ఆల్బమ్స్‌ను రూపొందించింది. అలాంటి ఆమెకు ఫ్రాన్స్‌లోని లెపాంట్ డు డయబుల్ బ్రిడ్జ్ చాలా నచ్చేసింది! ఎంతగానంటే పెళ్లి చేసుకోవాలనేంతగా! ఇంకేముంది... తన నిర్ణయాన్ని సన్నిహితులందరికీ చెప్పేసింది. వాళ్లందరినీ తన పెళ్లికి ఆహ్వానించింది. అంతా ఆశ్చర్యపోయారు. ఒక వంతెననుపెళ్లి చేసుకోవడం ఏమిటి? అంటూ నోరెళ్లబెట్టారు. అయితే అప్పటికే జోడీ ఆ బ్రిడ్జితో నిండా ప్రేమలో మునిగిపోయిన తీరును చూసి ఎవరూ వాళ్ల పెళ్లికి అడ్డుగా మారలేదు. అయితే ఫ్రాన్స్‌లో ఇలాంటి పెళ్లిళ్లు చెల్లవు. మనుషులు ఇలా కట్టడాలను పెళ్లి చేసుకొంటే తాము గుర్తించమని స్థానిక మేయర్ స్పష్టం చేశాడు.
అయితే అంత కోరికగా ఉంది కాబట్టి... పెళ్లి చేసుకొంటే చేసుకోవచ్చని అనుమతినిస్తూ మేయర్ స్వయంగా ఆ పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదించి వచ్చారు. ఆ విధంగా ఏడాది కిందట జోడీ ముచ్చట తీరింది. ‘‘నేను ప్రపంచంలో ఎన్నో బ్రిడ్జిలను చూశాను. కానీ లె పాంట్ డు డయబుల్లో సొగసు ఎక్కడా కనపడలేదు. ఇది నా మీద తనప్రేమను ప్రకటిస్తున్నట్టుగా అనిపించింది. ఈ వంతెన మీద నిలబడి నేను అద్భుతమైన సంగీతాన్ని కంపోజ్ చేయగలిగాను. క్రమంగా దీని మీద ప్రేమ ఎక్కువైంది. అందుకే పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాను...’’అంటూ జోడీ తన ప్రేమ గురించి, పెళ్లి నిర్ణయం గురించి వివరిస్తుంది. అయితే ఇంతవరకూ బాగానే ఉన్నా... జోడీతో పెళ్లి కి లె పాంట్కు ఇష్టం ఉందా? లేదా? అనే ది కనుక్కోవాల్సిందని కొంతమంది చమత్కరిస్తున్నారు.
ప్రేమ సరిగమలు
భూగోళం వేగంగా పరిభ్రమిస్తూ ఉంటుంది. అలా తిరుగుతున్నప్పుడు మనుషులు ఎగిరిపోయి పడకుండా పట్టి ఉంచే బంధమే ప్రేమ. అలాంటి పవిత్రమైన ప్రేమకు ఉన్నశక్తులు అన్నీ ఇన్నీకావు!
- ప్రేమ గురించి, ప్రియమైన వాళ్ల గురించి ఎక్కువగా ఊహించుకొనే వాళ్లలో సృజనాత్మక శక్తి , ఏకాగ్రతలు పెరుగుతూ ఉంటాయట!
- ప్రియమైన వాళ్ల చేయి పట్టుకొని నడుస్తూ ఉంటే మనసులోని ఎంత బాైధె నా ఇట్టే తరిగిపోతుందట.
- కళ్లలోకి సూటిగా చూస్తూ ఐ కాంటాక్ట్ మెయింటెయిన్ చేస్తుంటే అపరిచితుల మధ్యనైనా సరే ప్రేమ పొంగుకొస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
- ఉదయాన్నే ప్రియురాలిని కిస్ చేస్తూ ఆమెతో సరదాగా గడిపే మగాళ్లు మిగతా వాళ్లకన్నా ఐదేళ్లపాటు ఎక్కువగా బతుకుతారని అంటోంది ఫ్రెంచ్ శాస్త్రవేత్తల అధ్యయనం.
- తొందరగా ప్రేమలోపడేది మగవాళ్లే. అలాగే ఆ ప్రేమ విఫలం అయితే ఎక్కువగా బాధపడేది కూడా వాళ్లే!
ఏడాది కాపురం పూర్తయ్యింది
Published Sun, Jul 20 2014 1:24 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఏపీ ఎన్నికలపై సీఎం జగన్ ట్వీట్
May 15th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
స్ట్రాంగ్ రూముల్లో అభ్యర్థుల భవితవ్యం:
వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడి హేయమైన చర్య
విజయం వైఎస్సార్ సీపీదే
20న ఎడ్ల బండలాగుడు పోటీలు
No Headline
ఓటేసిన 15,89,412 మంది
Hyderabad: కాస్త పెరిగినా చివరి స్థానమే..
జేసీకి భారీ షాక్..ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- హల్దీరామ్స్‌పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
Advertisement