ఆ నలుగురిదీ ఒకే బాట! | Sakshi
Sakshi News home page

ఆ నలుగురిదీ ఒకే బాట!

Published Sun, Oct 12 2014 12:22 AM

ఆ నలుగురిదీ ఒకే బాట! - Sakshi

అక్కాచెల్లెళ్లు అన్న తర్వాత గిల్లికజ్జాలాడుకోవడం, వాదనలకు దిగడం మామూలే. కానీ ‘శాస్త్రీ సిస్టర్స్’ అలా కాదు. ఆ నలుగురు అక్కాచెల్లెళ్లదీ ఒకే మాట, ఒకే బాట! ఓ మధ్య తరగతి తండ్రికి నలుగురు ఆడపిల్లలు. భార్య పోయాక అల్లారుముద్దుగా పెంచుతాడు. క్రమశిక్షణ, మంచితనం అల వడేలా చేస్తాడు. వాళ్లు పెద్దవాళ్లయ్యాక కొన్ని కారణాల వల్ల ఉన్న ఊరు వదిలి పట్టణానికి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ ఆ నలుగురు పిల్లలకీ రకరకాల అనుభవాలు ఎదురవుతాయి. సమస్యలు ఏర్పడతాయి. వాటిని వాళ్లు ఎలా ఎదుర్కొన్నారు, తండ్రికి బాధ కలగకుండా నలుగురూ కలిసి సమస్యల్ని ఎలా పరిష్కరించుకున్నారు అనేదే కథ. ఆడపిల్లలు ఆత్మవిశ్వాసంతో మెలగాలని తెలిపే ఈ సీరియల్‌ని అమ్మాయిలు,  వారి తల్లిదండ్రులు తప్పక చూడాలి. చక్కని వినోదంతో పాటు, విలువలను కూడా నేర్పే సీరియల్ ఇది!

Advertisement
Advertisement