పట్టులాంటి మృదుత్వం | Sakshi
Sakshi News home page

పట్టులాంటి మృదుత్వం

Published Sun, Feb 10 2019 12:51 AM

Funday beauty tips 10-02-2019 - Sakshi

సౌందర్యవంతమైన ముఖ కాంతికి సహజమైన చిట్కాలే సరైనవంటున్నారు నిపుణులు. రోజు రోజుకీ పెరిగిపోతున్న కాలుష్యంతో ముఖం జిడ్డుగా, కాంతిహీనంగా మారిపోతుంది. అలాంటప్పుడు కొంత సమయం ఫేస్‌ ప్యాక్‌ వేసుకోవడానికి కేటాయిస్తే చాలు. ముందుగా క్లీనప్, స్క్రబ్‌ వంటివి చేసుకుని ఆవిరి పట్టించుకుని ఫేస్‌ప్యాక్‌ వేసుకుంటే ముఖం మృదువుగా పట్టులా మెరుస్తుంది. ఇంకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి.

కావల్సినవి : క్లీనప్‌ : పెరుగు మీగడ – 2 టీ స్పూన్లు, నిమ్మరసం – పావు టీ స్పూన్‌
 స్క్రబ్‌ : ఓట్స్‌ – 2 టీ స్పూన్లు, టమాటా గుజ్జు – 2 టీ స్పూన్లు
మాస్క్‌:  చిక్కటి పాలు–1 టీ స్పూన్, శనగపిండి – అర టీ స్పూన్, తులసి ఆకుల గుజ్జు – 3 టీ స్పూన్లు, పచ్చి పసుపు – చిటికెడు
తయారీ :  ముందుగా పెరుగు మీగడ, నిమ్మరసం ఒక చిన్న బౌల్‌లో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్‌ చేసుకోవాలి. ఇప్పుడు ఓట్స్, టమాటా గుజ్జు ఒక బౌల్‌లోకి తీసుకుని బాగా కలుపుకుని ఇంచుమించు ఐదు నిమిషాల పాటు స్క్రబ్‌ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు తులసి ఆకుల గుజ్జు, శనగపిండి, పసుపు, చిక్కటి పాలు ఒక బౌల్‌లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముఖానికి ఫేస్‌ ప్యాక్‌ వేసిన తర్వాత సబ్బు పెట్టకపోవడం మంచిది.

Advertisement
Advertisement