సంక్రాంతి పాటల పల్లకి | Sakshi
Sakshi News home page

సంక్రాంతి పాటల పల్లకి

Published Sun, Jan 10 2016 6:32 AM

సంక్రాంతి పాటల పల్లకి

వీనుల విందు
వెండితెరపై బంగారంలా మెరిసిన సంక్రాంతి పాటలను పాడుకోవాలనుకుంటున్నారా?
ఇక్కడ మూడు పాటలు ఉన్నాయి.
మురిపెంగా పాడుకోండి... గాలిపటాన్ని ఆట పట్టించండి.
‘బావల వీపులు తప్పెట్లోయ్’
అంటూ పల్లెల్లోని  అల్లరిని గుర్తు తెచ్చుకోండి.
మురిపాల సంక్రాంతిని ముంగిట్లోకి తీసుకురండి. 
ఇక మీదే ఆలస్యం. గొంతు సవరించండి...

1
పల్లవి: పదపదవే వయ్యారి గాలిపటమా (2)
 పైన పక్షిలాగా ఎగిరిపోయి పక్కచూపు చూసుకుంటూ
 తిరిగెదవే గాలిపటమా
 పదపదవే వయ్యారి గాలిపటమా
 చరణం : 1
 ప్రేమగోలలోన చిక్కిపోయినావా
 నీ ప్రియుడున్న చోటుకై పోదువా
 ఓ... ప్రేమగోలలోన చిక్కిపోయినావా
 నీ ప్రియుడున్న చోటుకై పోదువా
 నీ తళుకంతా నీ కులుకంతా
 అది ఎందుకో తెలుసును అంతా
 ॥
 చరణం : 2 నీకు ఎవరిచ్చారే బిరుదు తోక
 కొని తెచ్చావేమో అంతేగాక
 ఆ... నీకు ఎవరిచ్చారో బిరుదు తోక
 కొని తెచ్చావేమో అంతేగాక
 రాజులెందరూడినా మోజులె ంత మారినా
 తెగిపోక నిల్చె నీ తోక
 ॥
 చరణం : 3 నీలి మబ్బుల్లో ఆడుకుందువేమో
 మింట చుక్కల్తో నవ్వుకుందువేమో
 ॥
 వగలాడివిలే జగదంతవులే
 దిగిరాకుండా ఎటులుందువులే
 ॥
 చిత్రం : కులదైవం (1960)
 రచన : కొసరాజు
 సంగీతం : మాస్టర్ వేణు
 గానం : ఘంటసాల, జమునారాణి
 
2
పల్లవి :
భోగుల్లో భోగుల్లో భోగభాగ్యాల భోగుల్లో... భోగిమంటల భోగుల్లో...
 తెల్లారకుండానే పల్లెపల్లంతాను ఎర్రని కాంతుల భోగుల్లో
 తెల్లారకుండానే పల్లెపల్లంతాను ఎర్రని కాంతుల భోగుల్లో
 భోగుల్లో భోగుల్లో భోగభాగ్యాల భోగుల్లో... భోగిమంటల భోగుల్లో...
 తెల్లారకుండానే పల్లెపల్లంతాను ఎర్రని కాంతుల భోగుల్లో
 గొబ్బియల్లో గొబ్బియల్లో గొబ్బెమ్మ కొప్పున గుమ్మడిపూలో
 గొబ్బియల్లో గొబ్బియల్లో గొబ్బెమ్మ కొప్పున గుమ్మడిపూలో
 చరణం : 1
 గుమ్మడంటి గుమ్మడు మాయదారి గుమ్మడు
 కొప్పులో పూలెట్టి తుప్పర్లోకి లాగాడు
 గొబ్బియల్లో గొబ్బియల్లో గొబ్బెమ్మ కొప్పున గుమ్మడిపూలో
 కుప్పల్లో ఇల్లుందా అల్లుణ్ణే కుప్పమ్మా
 అత్తంటికెళదాము రమ్మంటే తప్పమ్మా
 తప్పొప్పులిప్పుడై తలబోసుకుందామా
 తలలంటుకున్నాక తలబోసుకుందామా
 గొబ్బియల్లో గొబ్బియల్లో గొబ్బెమ్మ కొప్పున గుమ్మడిపూలో
 భోగుల్లో భోగుల్లో భోగభాగ్యాల భోగుల్లో... భోగిమంటల భోగుల్లో...
 తెల్లారకుండానే పల్లెపల్లంతాను ఎర్రని కాంతుల భోగుల్లో
 హరిలో... రంగహరి... హరిలో రంగహరి... హరిలో రంగహరి... హరిలో రంగహరి... హరిలో రంగహరి... హరిలో రంగహరి... హరిలో రంగహరి... హరిలో రంగహరి... హరిలో రంగహరి...
 హరి కోసమైతే తపస్సులు హరి హరి
 హరిదాసుకైతే కాసుల హరి హరి
 దాసుని తప్పులు దండనతోసరి
 హరిలో రంగహరి... హరిలో రంగహరి... హరిలో రంగహరి...
 సరిలో రంగసరి... సరిలో రంగసరి... సరిలో రంగసరి...
 దండం అంటే రెండర్థాలు
 చేతులు రెండు కలిపేదొకటి
 వాతలు నిండుగా వేసేదొకటి
 హొయ్... చేతులు రెండు కలిపేదొకటి
 వాతలు నిండుగా వేసేదొకటి
 సరిలో రంగసరి... సరిలో రంగసరి... సరిలో రంగసరి...
 సరిలో రంగసరా హరా సరా హరా
 మ్మ్... సరి సరి
 హరిలో... రంగహరి...
 భోగుల్లో భోగుల్లో భోగభాగ్యాల భోగుల్లో... భోగిమంటల భోగుల్లో...
 తెల్లారకుండానే పల్లెపల్లంతాను ఎర్రని కాంతుల భోగుల్లో
 చరణం : 2
 బావల వీపులు తప్పెట్లోయ్ తాగినకొద్ది తప్పట్లోయ్
 బావల వీపులు తప్పెట్లోయ్ తాగినకొద్ది తప్పట్లోయ్
 అవి మోగినకొద్దీ ముచ్చట్లోయ్
 అవి మోగినకొద్దీ ముచ్చట్లోయ్
 మరదళ్ల బుగ్గలు బొబ్బట్లోయ్ కొరికినకొద్దీ దిబ్బట్లోయ్
 మరదళ్ల బుగ్గలు బొబ్బట్లోయ్ కొరికినకొద్దీ దిబ్బట్లోయ్
 అవి దొరికేదాకా ఇక్కట్లోయ్ దిబ్బట్లోయ్ బొబ్బట్లోయ్
 భోగుల్లో భోగుల్లో భోగభాగ్యాల భోగుల్లో... భోగిమంటల భోగుల్లో...
 తెల్లారకుండానే పల్లెపల్లంతాను ఎర్రని కాంతుల భోగుల్లో
 తెల్లారకుండానే పల్లెపల్లంతాను ఎర్రని కాంతుల భోగుల్లో
 చిత్రం : భోగిమంటలు (1981)
 రచన : ఆచార్య ఆత్రేయ
 సంగీతం : రమేష్‌నాయుడు
 గానం : బాలు, సుశీల, బృందం
 
3
సాకీ :
కలికి దిద్దిన ముగ్గు తళతళ మెరిసింది తుమ్మెద ఓ తుమ్మెద
 మురిపాల సంక్రాంతి ముంగిట్లోకొచ్చింది తుమ్మెద ఓ తుమ్మెద
 గొబ్బియ్యళ్లో గొబ్బియ్యళ్లో చలిమంట వెలుగుల్లో తుమ్మెద ఓ తుమ్మెద
 పల్లవి :
 సంక్రాంతి వచ్చిందే తుమ్మెద
 సరదాలు తెచ్చిందే తుమ్మెద
 కొత్త ధాన్యాలతో కోడి పందేలతో ఊరే ఉప్పొంగుతుంటే
 ఇంటింటా... ఆ... పేరంటం
 ఊరంతా... ఆ... ఉల్లాసం
 కొత్త అల్లుళ్లతో కొంటె మరదళ్లతో పొంగే హేమంత సిరులు
 చరణం : 1
 మంచీ మర్యాదనీ పాప పుణ్యాలనీ నమ్మే మన పల్లెటూళ్లు
 న్యాయం మా శ్వాసనీ ధర్మం మా బాటనీ చెబుతాయి స్వాగతాలు
 బీద గొప్పోళ్లనే మాటలేదు
 నీతి నిజాయితీ మాసిపోదు
 మచ్చలేని మనసు మాది
 మంచి పెంచు మమత మాది
 ప్రతి ఇల్లో బొమ్మరిల్లు...
 ॥
 చరణం : 2
 పాటే పంచామృతం మనసే బృందావనం తడితేనే ఒళ్లు జల్లు
 మాటే మకరందము చూపే సిరి గంధము చిరునవ్వే స్వాతి జల్లు
 జంట తాళాలతో మేజువాణి
 జోడు మద్దెళ్లనీ మోగుపోనీ
 చెంతకొస్తే పండగాయే చెప్పలేని బంధమాయే
 వయసే అల్లాడిపోయే...
 ॥
 చిత్రం : సోగ్గాడి పెళ్లాం (1996)
 రచన : భువనచంద్ర
 సంగీతం : కోటి
 గానం : ఎస్.పి.బాలు, చిత్ర

కూర్పు : డి. నాగేష్‌

Advertisement
Advertisement