Sakshi News home page

అన్వేషణం: కదిలే అలలపై... కదలని ఎయిర్‌పోర్ట్!

Published Sun, Dec 1 2013 4:15 AM

అన్వేషణం: కదిలే అలలపై... కదలని ఎయిర్‌పోర్ట్!

ఎక్కువ స్థలం అవసరమవుతుంది కాబట్టి, విమానాశ్రయాన్ని ఎప్పుడూ నగర శివార్లలోనే కడతారు. కానీ జపాన్‌వారు ఏం చేసినా వెరైటీగా చేస్తారు కదా! అందుకే ఏకంగా సముద్రంలో కట్టారు. మరి సముద్రంలో విమానాలు ఎలా ల్యాండవుతాయి?! అది చెబితే అర్థం కాదు. స్వయంగా వెళ్లి చూడాల్సిందే. జపాన్‌లోని కాన్సాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 1994లో ప్రారంభించారు. ఇది సముద్రపు నీటిలో కట్టిన ఓ అద్భుతమైన ఎయిర్‌పోర్‌‌ట. అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించారు. భూంకంపాలను, సునామీలను కూడా ఇది తట్టుకోగలదు.
 
 కాన్సాయ్ విమానాశ్రయ నిర్మాణం 1987లో మొదలుపెట్టారు. దాదాపు పదివేల మంది, మూడేళ్ల పాటు కష్టపడితే పూర్తయ్యింది. మిగతా పనులన్నీ పూర్తి చేసేందుకు నాలుగేళ్లు పట్టింది. నిజానికి ఎయిర్‌పోర్‌‌ట ఇటామి ప్రాంతంలో ఉండేది. అయితే వ్యాపార లావాదేవీల నిమిత్తం విమానాల రాకపోకల్ని మరింత పెంచాలనుకుంది అక్కడి ప్రభుత్వం. మొదట కాన్సాయ్ రీజియన్‌లోని, కోబె దగ్గర కొత్త ఎయిర్‌పోర్‌‌ట కట్టేందుకు ప్లాన్ వేశారు. కానీ అక్కడివారు ఒప్పుకోలేదు. ఎయిర్‌పోర్‌‌టను నిర్మించేందుకు ఆల్రెడీ ఉన్న నిర్మాణాలను తొలగించడానికి వీల్లేదని, పైగా ఇళ్లు, ఆఫీసుల మధ్య విమానాశ్రయం ఉంటే విమానాల మోత భరించడం కష్టమని గొడవపెట్టారు. ఒకవేళ కట్టినా కూడా, దాన్ని ఎప్పటికీ విస్తరించడం వీలు కాదని కండిషన్ పెట్టారు.
 
 దాంతో  సముద్రంలో కడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది అధికారులకి. వెంటనే మొదలు పెట్టేశారు. సముద్రజలాల్లో ఎయిర్‌పోర్‌‌టను నిర్మించారు. సముద్రపు ఒడ్డు నుంచి ఎయిర్‌పోర్టుకి వెళ్లడానికి మూడు కి.మీ.ల పొడవైన బ్రిడ్జిని కూడా నిర్మించారు. జలాల మీద నిర్మాణం అంత తేలిక కాదు. ఎయిర్‌పోర్‌‌ట అంటే మరీ కష్టం. అయినా వారు సాధించారు. ఇప్పుడది ప్రపంచం మొత్తాన్నీ ఆకర్షిస్తోంది. అమెరికన్ ఇంజినీరింగ్ సొసైటీ అయితే... ‘సివిల్ ఇంజినీరింగ్ మాన్యుమెంట్ ఆఫ్ ద మిలీనియం’ అంటూ దీన్ని కొనియాడింది కూడా!
 
 సరస్సుకెలా వచ్చెను గులాబీ సొగసు!
 తళతళలాడుతూ జలజల పారుతూ ఉండే సరస్సులు తెలుసు మనకి. కానీ గులాబిరంగులో వర్ణమయంగా ఉండే సరస్సు ఒకటి ఉందని తెలుసా? అసలు ఏ సరస్సయినా ఆ రంగులో ఉంటుందంటే నమ్మబుద్ధి వేస్తుందా? కానీ రెబ్టా లేక్‌ని చూస్తే నమ్మక తప్పదు మరి!
 ఆఫ్రికా ఖండంలోని సెనెగల్ ప్రాంతంలో ఉన్న రెబ్టా లేక్‌ని చూస్తే మొదట షాకింగ్‌గా అనిపిస్తుంది. ఆ తర్వాత ఆశ్చర్యం వేస్తుంది. అందులోని నీళ్లు ముదురు గులాబిరంగులో ఉంటాయి. అందుకే దీన్ని అందరూ ముద్దుగా పింక్ లేక్ అని పిలుచుకుంటారు.
 
 వాతావరణంలోని  మార్పు వల్ల రెబ్టా సరస్సులోని నీళ్లు అలా గులాబిరంగులోకి మారాయేమోనని మొదట్లో అనుకున్నారు. ఆ రంగు మెల్లగా పోతుందని వేచి చూశారు కూడా. కానీ అలా జరగలేదు. సరస్సులోని నీరు ఎప్పుడూ గులాబి రంగులోనే కనిపించసాగింది. దాంతో దాన్ని అలా మార్చిందేమిటో తెలుసుకోవాలని పరిశోధనలు మొదలు పెట్టారు. చివరకు తేలిందేమిటంటే... ఈ నీటిలో ఉప్పు చాలా ఎక్కువగా ఉంటుందట. సరస్సు అడుగున ఉన్న మట్టిలో ఉండే కొన్ని రసాయనాలు ఉప్పుతో కలిసి ఈ రంగును ఏర్పరిచాయని శాస్త్రవేత్తలు తేల్చారు. ఏదేమైనా సరస్సు గులాబిరంగులో ఉండటం విచిత్రమే. అందుకే దీన్ని వరల్డ్ హెరిటేజ్ సెంటర్‌గా ఎంపిక చేస్తామంటోంది యునెస్కో!

Advertisement
Advertisement