టీ డికాక్షన్‌తో మెరుపు | Sakshi
Sakshi News home page

టీ డికాక్షన్‌తో మెరుపు

Published Sat, Sep 24 2016 9:55 PM

టీ డికాక్షన్‌తో మెరుపు - Sakshi

న్యూ ఫేస్
ఉదయాన్నే టీ తాగితే తాజాదనం భావన కలుగుతుంది, చురుగ్గా ఉంటామని చాలా మంది ఆలోచన. అందుకే ఉదయాన్నే రోజును టీతో మొదలుపెడతారు. కొంతమంది పాలు కలపకుండా బ్లాక్ టీని సేవిస్తారు. అంటే కేవలం డికాక్షన్ మాత్రమే అన్నమాట. టీ డికాక్షన్‌తో మేని మెరుపును కూడా పెంచుకోవచ్చు.
 
కావాల్సినవి:
స్పూన్ టీ పొడి
అర స్పూన్ తేనె
2 స్పూన్ల బియ్యప్పిండి
 
తయారీ:
కప్పున్నర నీళ్లను వేడి చేసి, అందులో టీ పొడి వేయాలి. అర కప్పు టీ అయ్యేంత వరకు మరిగించి, చల్లారనివ్వాలి.
టీ డికాక్షన్ చల్లారాక అందులో తేనె, బియ్యప్పిండి కలపాలి.
ముఖానికి, మెడకు, చేతులకు పట్టించి, పూర్తిగా ఆరనివ్వాలి. ఇందుకు కనీసం 20 నిమిషాల సమయం పడుతుంది.
ముఖం మీద నీళ్లు చిలకరించి, వేళ్లతో మృదువుగా మర్దన చేయాలి.
తర్వాత చల్లని నీటితో మొత్తం కడిగేయాలి.
టీ డికాక్షన్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు మచ్చలు, మొటిమలు తొలగించడానికి సహాయపడతాయి. ముడతలను నివారిస్తాయి. బియ్యప్పిండి మర్దన వల్ల మృతకణాలు తొలగిపోతాయి. తేనెలోని పోషకాలు సహజకాంతిని ఇస్తాయి. అందుకని, వారానికి 2-3 సార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే చర్మ సమస్యలు దరిచేరవు. స్నానానికి ముందు శరీరానికంత టీ డికాక్షన్‌తో ప్యాక్ వేసుకొని, తర్వాత స్నానం చేస్తే తాజాదనం అనుభూతి కలుగుతుంది. మేనికాంతి సహజసౌందర్యంతో నిగనిగలాడుతుంది.

Advertisement
Advertisement