సరదాగా చేసేయొచ్చు టేస్టీ సాల్సా! | Sakshi
Sakshi News home page

సరదాగా చేసేయొచ్చు టేస్టీ సాల్సా!

Published Sun, Feb 8 2015 12:30 AM

సరదాగా చేసేయొచ్చు టేస్టీ సాల్సా!

ఫుడ్nబ్యూటీ
 
మన ఆహారంలో విరివిగా ఉపయోగించే టమాటాలో లైసోపెన్ అనే యాంటీఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటుంది. ఇది క్యాన్సర్, గుండె సంబంధిత సమస్యలను నివారిస్తుంది. టమాటాతో విటమిన్ సీ, ఫైబర్ ప్రొటీన్లు కూడా లభిస్తాయి. తక్కువ క్యాలరీలను ఇస్తూ ఇది మంచి రుచిని పంచుతుంది. అలాంటి టమాటాతో ఇట్టే చేసేసుకోగల వంటకం ‘టమాటా సాల్సా’. భోజనంలో భాగంగా ఈ సలాడ్‌ను తీసుకోవచ్చు.
 
అవసరమైనవి:
టమాటాలు రెండు, ఉల్లికాడలు రెండింటిని చిన్నగా కట్ చేసి ఉంచుకోవాలి,  కొత్తిమీర అరకప్పు, పుదీనా కొంచెం, తగిన పరిమాణాల్లో జీరాపొడి, ధనియాల పొడి, పచ్చిమిర్చి ఒకటి, తగినంత నిమ్మరసం, ఉప్పు.
 
విధానం:
ఈ పదార్థాలన్నింటినీ ఒక గిన్నెలో వేసి మిక్స్ చేస్తే టమాటా సాల్సా రెడీ!
 
 పోషకవిలువలు:
 ఒక కప్పు సాల్సాలో 20 కిలో క్యాలరీల శక్తి, రెండు గ్రాముల ఫైబర్ ఉంటుంది.
 ప్రొటీన్లేమీ ఉండవు.
 
 
అందానికి గుడ్డు.!
 
పోషకాహారంగానే కాదు అందం విషయంలోనూ గుడ్డు ప్రాధాన్యత కలిగివుంది.
 
గుడ్డు తెల్లసొనని ముఖానికి పట్టించి, ఆరిన తర్వాత వెచ్చని నీటితో శుభ్రం చేసుకొంటే మెటిమలు తగ్గుతాయి.

పొడిచర్మం గల వారు తెల్లసొనకు నిమ్మరసం, ఆలివ్ నూనె కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి... ఆరాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకొంటే మార్పు కనిపిస్తుంది.

పచ్చసొనకు తేనె, పెరుగు కలిపిన మిశ్రమాన్ని మొహానికి పట్టించుకొంటే చర్మం నిగారిస్తుంది.

జుట్టు జిడ్డుతత్వంతో ఉండే వారు తెల్లసొనను మాత్రమే తలకు పట్టించి ఆరిన తర్వాత స్నానం చేస్తే జుట్టుకు కొత్త జీవం వస్తుంది.

పొడి చర్మం గల వారు తెల్లసొనలో పాలను కలుపుకొని హెయిర్‌ప్యాక్‌గా వేసుకోవచ్చు. దీని వల్ల కేశాలకు మెరుపు వస్తుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement