నో డస్ట్ నో మరకలు... | Sakshi
Sakshi News home page

నో డస్ట్ నో మరకలు...

Published Sat, Sep 24 2016 11:41 PM

నో డస్ట్ నో మరకలు...

ఇళ్లలోని దమ్మూ ధూళి పోగొట్టాల్సిందంటే చీపురుకట్ట చేత పట్టాల్సిందే! ఇక నేల మీది మొండి మరకలను వదలగొట్టాలంటే, మాప్, ఫ్లోర్‌బ్రష్ వంటివి జబ్బ సత్తువ కొద్దీ ఉపయోగించాల్సిందే! అంటే, రెండు పనులకూ రెండు వేర్వేరు పరికరాలను వాడక తప్పదు. కొంచెం హైటెక్‌గా ఆలోచించినా పరిస్థితి ఇదే! దుమ్మూ ధూళీ తొలగించడానికి వాక్యూమ్ క్లీనర్, మరకలను తొలగించడానికి స్టీమ్ మాప్ వేర్వేరుగా వాడాల్సిందే! ఆ రెండు పనులూ ఒకే పరికరంతో చేయగలిగితే ఎంతో బాగుంటుంది కదూ! శ్రమ తగ్గుతుంది.

మరోవైపు వస్తువులను భద్రపరచాల్సిన చోటూ తగ్గుతుంది. ఇదే ఆలోచనతో రూపొందించిన పరికరం ఆల్-ఇన్-వన్ వాక్యూమ్ అండ్ స్టీమ్ మాప్. నేల మీద పేరుకుపోయిన దుమ్మూ ధూళిని తొలగించడమే కాదు, నేల మీది మొండి మరకలనూ ఏకకాలంలో ఇట్టే మటుమాయం చేసేస్తుంది. ఈ పరికరం ఇంట్లో ఉంటే శుభ్రతకు భరోసా ఉన్నట్లే!

Advertisement
Advertisement