వారఫలాలు : 4 డిసెంబర్ నుంచి 10 డిసెంబర్ 2016 వరకు | Sakshi
Sakshi News home page

వారఫలాలు : 4 డిసెంబర్ నుంచి 10 డిసెంబర్ 2016 వరకు

Published Sat, Dec 3 2016 11:25 PM

Varaphalalu: from 4 December to 10 December 2016

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
 అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. ఆప్తుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. పాతమిత్రుల ద్వారా ఆహ్వానాలు రాగలవు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. గృహ నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలలో లాభాలు.  రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. లేత పసుపు, తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి.
 
 వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.)
  ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ కలిగించినా అవసరాలు తీరతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వాహనయోగం. కీలక నిర్ణయాలకు తగిన సమయం. వ్యాపారాలు అభివృద్ధిదాయకంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు హోదాలు. కళాకారులకు సన్మానాలు. ఎరుపు, లేత గులాబీ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ ఛాలీసా పఠనం మంచిది.
 
 మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
 అనుకున్న ఆదాయం సమకూరడంలో కొంత జాప్యం. ముఖ్యమైన పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. చిరకాల స్వప్నం నెరవేరుతుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వివాహ యత్నాలు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి. రాజకీయవర్గాలకు పదవులు దక్కే అవకాశం. పసుపు, లేత నీలం రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారకస్తోత్రాలు పఠించండి.
 
 కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
 శ్రమానంతరం పనులు పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో స్వల్ప వివాదాలు నెలకొంటాయి. విద్యార్థులకు ఒత్తిడులు ఉన్నా అనుకున్న ఫలితాలు సాధిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. శుభకార్యాల రీత్యా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం. కళాకారులకు సామాన్యంగా ఉంటుంది. తెలుపు, ఎరుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
 
 సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
 ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. రాబడి కొంత పెరుగుతుంది. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కవచ్చు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. గులాబీ, నేరేడు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
 
 కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
 కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయుల నుంచి పిలుపురావచ్చు. ఆదాయం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. పాతమిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఒక సమాచారం నిరుద్యోగులకు ఊరటనిస్తుంది. విద్యార్థులకు కొత్త ఆశలు. వ్యాపార లావాదేవీలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు సన్మానయోగం. పసుపు, తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుస్తుతి మంచిది.
 
 తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
 ప్రతిభాపాటవాలు వెలుగుచూస్తాయి. బంధువర్గం సలహాలతో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. భూవివాదాలు కొంత వరకూ పరిష్కారమవుతాయి. దేవాలయాలు సందర్శిస్తారు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు కొత్తహోదాలు దక్కవచ్చు. కళాకారుల కృషి ఫలిస్తుంది. నీలం, ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవిస్తోత్రాలు పఠించండి.
 
 వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
 కొన్ని కార్యక్రమాలు అప్రయత్నంగా పూర్తి కాగలవు. రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. శుభకార్యాల రీత్యా ఖర్చులు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. ఎరుపు, లేత పసుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనే యస్వామి స్తోత్రాలు పఠించండి.
 
 ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
 ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. బంధుమిత్రులతో అకారణంగా తగాదాలు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించండి. పాతమిత్రులను కలుసుకుంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిర్ణయాలలో తొందరపాటు వద్దు. వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు అదనపు విధులు. రాజకీయవర్గాలకు చికాకులు తప్పకపోవచ్చు. ఎరుపు, నేరేడు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.
 
 మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
 ఉత్సాహంగా చేపట్టిన కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. సన్నిహితులు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. నీలం, ఆకుపచ్చరంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.
 
 కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
 ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ప్రముఖుల నుంచి  అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. బంధువుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. రాబడి ఉత్సాహాన్నిస్తుంది. కుటుంబసభ్యులతో వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగుల సేవలకు గుర్తింపు పొందుతారు. రాజకీయవర్గాలకు అనుకున్న పదవులు దక్కుతాయి. నలుపు, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. వేంకటేశ్వరస్వామిని పూజించండి.
 
 మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
 కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు మరింత దగ్గరవుతారు. వాహనాలు, భూములు కొనుగోలు చే స్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని వివాదాలు ఓర్పుతో పరిష్కరించుకుంటారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగులకు అదనపు పనిభారం తగ్గుతుంది. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. గులాబీ, బంగారురంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి.
 

Advertisement
Advertisement