వారఫలాలు : 2 జూలై నుంచి 8 జూలై 2017 వరకు | Sakshi
Sakshi News home page

వారఫలాలు : 2 జూలై నుంచి 8 జూలై 2017 వరకు

Published Sun, Jul 2 2017 2:14 AM

వారఫలాలు : 2 జూలై నుంచి 8 జూలై 2017 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో మాటపడతారు. అనుకున్న కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. సోదరులు, మిత్రులతో విభేదాలు.   ఉద్యోగస్తులకు విధుల్లో చికాకులు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం ప్రారంభంలో శుభవార్తలు. గులాబీ, పసుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోణి, మృగశిర 1,2 పా.)
 ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. సన్నిహితులు, బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. వాహనయోగం. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళాకారులకు పురస్కారాలు. వారం చివరిలో ఆరోగ్య సమస్యలు. ధనవ్యయం. ఆకుపచ్చ, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీగణపతిని పూజించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
 అనారోగ్య పరిస్థితుల నుంచి ఉపశమనం పొందుతారు. ఇచ్చిన హామీలు నిలుపుకుంటారు. సేవాకార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయవర్గాల వారికి విశేష ఆదరణ. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఒత్తిడులు. పసుపు, తెలుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ చాలీసా పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
 అనుకున్న పనుల్లో జాప్యం. ఆలోచనలు కలసిరావు. సోదరులతో మాటపట్టింపులు ఏర్పడతాయి. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు వాయిదా వేస్తారు. విద్యార్థులు, నిరుద్యోగుల కృషి అంతగా ఫలించదు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు ఒత్తిడులు. రాజకీయవర్గాలకు పర్యటనల్లో ఆటంకాలు. వారం చివరిలో శుభవార్తలు. స్వల్ప ధనలాభం. తెలుపు, లేత ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఆర్థిక వ్యవహారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఇంటాబయటా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఇంటి నిర్మాణయత్నాలు ముందుకు సాగవు. సోదరులు, మిత్రులతో విభేదాలు. చేపట్టిన కార్యక్రమాలు నత్తనడకన సాగుతాయి.  వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. పారిశ్రామికవర్గాలకు గందరగోళంగా ఉంటుంది.  వాహనయోగం. ఎరుపు, నేరేడు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రం పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
బంధువర్గం నుంచి ఒత్తిడులు. ఆస్తి వ్యవహారాలలో చికాకులు. కుటుంబసభ్యుల సహకారం అందక ఇబ్బంది పడతారు. అనారోగ్య సూచనలు. రాబడి సంతృప్తికరంగా ఉన్నా ఖర్చులు కూడా ఎదురవుతాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. ఉద్యోగులకు పనిభారం. కళాకారులకు నిరాశాజనకంగా ఉంటుంది. వారం మధ్యలో శుభవార్తలు. స్వల్ప ధనలబ్ధి. గులాబీ, ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆర్థిక లావాదేవీలలో ఒడిదుడుకులు తొలగుతాయి. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు అనుకోని హోదాలు దక్కుతాయి. రాజకీయవర్గాలకు పదవులు రావచ్చు. వారం మధ్యలో ధనవ్యయం. స్వల్ప అనారోగ్యం. లేత ఎరుపు, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
 ఆర్థిక ఇబ్బందుల నుంచి కాస్త బయటపడే అవకాశం. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. ఆలోచనలు అంతగా కలసిరావు. ఇంటాబయటా కొన్ని విమర్శలు ఎదుర్కొంటారు. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగులకు ఒత్తిడులు. రాజకీయవర్గాలకు పర్యటనల్లో అవాంతరాలు. కార్యసిద్ధి. ఎరుపు, లేత గులాబీరంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీగణపతి స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
వీరికి అన్ని విధాలా అనుకూల సమయం.  కార్యోన్ముఖులై అనుకున్నది సాధిస్తారు. దూరపు బంధువుల రాక సంతోషం కలిగిస్తుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వాక్చాతుర్యంతో అందర్నీ ఆకట్టుకుంటారు. వ్యాపారాలు అభివృద్ధి పథంలో సాగుతాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో అనారోగ్యం. అనుకోని ఖర్చులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
వీరికి పట్టింది బంగారమే అన్న విధంగా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో వివాదాలు తీరతాయి. ఆర్థిక లావాదేవీలు గతం కంటే ఆశాజనకంగా ఉంటాయి.  చిరకాల స్వప్నం నెరవేరుతుంది. వాహనయోగం. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి.  వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు విధుల్లో చికాకులు తొలగుతాయి.  వారం చివరిలో ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. నీలం, నేరేడు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ముఖ్యమైన కార్యక్రమాలు సాఫీగా పూర్తి కాగలవు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. కళాకారులకు సన్మాన, సత్కారాలు. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. ఆరోగ్య సమస్యలు. నలుపు, ఆకుపచ్చ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.  పంచముఖ ఆంజనేయస్వామిని పూజించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
అనుకున్న పనుల్లో ఆటంకాలు.  మిత్రులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు ఎదురవుతాయి.  విలువైన డాక్యుమెంట్లు, ఆభరణాలు భద్రంగా చూసుకోండి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు శ్రమాధిక్యం. ధనలబ్ధి. ఎరుపు, తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అమ్మవారికి అర్చన చేయించుకుంటే మంచిది.

Advertisement

తప్పక చదవండి

Advertisement