వారఫలాలు (12 డిసెంబర్‌ నుంచి 18 వరకు) | Sakshi
Sakshi News home page

వారఫలాలు (12 డిసెంబర్‌ నుంచి 18 వరకు)

Published Sun, Jan 12 2020 5:17 AM

Weekly Horoscope Of December 12Th To January 18th 2020 In Sakshi Funday

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. తీర్థయాత్రలు చేస్తారు. సంఘంలో  పలుకుబడి పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు, కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి, కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ఉన్నత పోస్టులు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో  ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. శ్రమాధిక్యం. పసుపు, ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
ఉత్సాహంతో ముందడుగు వేసి అనుకున్న పనులు చక్కదిద్దుతారు. దూరపు బంధువులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థుల జీవితాశయం నెరవేరుతుంది. చాకచక్యంగా కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. సోదరుల నుంచి ధనలాభాలు.  వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం మధ్యలో స్వల్ప అనారోగ్యం. ఆకుపచ్చ, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు ముందుకు సాగక నిరాశ చెందుతారు. సోదరులు, మిత్రులతో కొన్ని విషయాలలో  తగాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది.  పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.   కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి. ఉద్యోగ యత్నాలు నిరాశ పరుస్తాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు ఉంటాయి, విస్తరణ కార్యక్రమాలలో అవాంతరాలు. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు ఎదురుకావచ్చు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. నూతన పరిచయాలు. గులాబీ, లేత పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
అనుకున్న సమయానికి డబ్బు సమకూరుతుంది. ఆప్తులు, బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. పరపతి కలిగిన వ్యక్తులతో పరిచయాలు. ఒక సమాచారం నిరుద్యోగులకు ఉత్సాహాన్నిస్తుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు.  కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో మరింత లాభాలు చేకూరుతాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. పారిశ్రామికవర్గాలకు యత్నాలు సఫలం. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్య, కుటుంబసమస్యలు. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
విద్యార్థులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. పనులు సజావుగా కొనసాగుతాయి. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. జీవితభాగస్వామితో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆలయాలు సందర్శిస్తారు. నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. గృహ, వాహనయోగాలు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు పదవీయోగం.  వారం ప్రారంభంలో ఆస్తి వివాదాలు. స్వల్ప అనారోగ్యం. నేరేడు, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. రుణభారాలు తొలగుతాయి. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి చేకూరుతుంది. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. సోదరులు, మిత్రులతో సఖ్యత నెలకొంటుంది. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటి నిర్మాణాల్లో ఆటంకాలు తొలగుతాయి. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు.  వ్యాపారాల విస్తరణకు  నూతన పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగాలలో ఊహించని ఇంక్రిమెంట్లు రాగలవు. కళారంగం వారి యత్నాలు సఫలం. వారం చివరిలో ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. బంధువులతో వివాదాలు. ఆకుపచ్చ, నీలం రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
కొన్ని వివాదాలు నెలకొన్నా పరిష్కరించుకుంటారు. అనుకున్నంత సొమ్ము సమకూరి అప్పులు సైతం తీరతాయి. నిరుద్యోగులు జీవితాశయం నెరవేరి ఉత్సాహంగా గడుపుతారు. ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. ఆస్తిలాభాలు ఉండవచ్చు. గృహం, వాహనాలు కొంటారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగి ఊరట చెందుతారు. ఉద్యోగాలలో పైస్థాయి వారి సహాయం అందుతుంది. రాజకీయవర్గాలకు మరింత అనుకూలమైన సమయం. వారం మధ్యలో ఆరోగ్యభంగం. పసుపు, ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
మీ అభిప్రాయాలను కుటుంబసభ్యులతో  పంచుకుంటారు. ఆస్తి వ్యవహారాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో మరింత ప్రగతి కనిపిస్తుంది.  వాహనయోగం. ప్రముఖులతో చర్చలు సఫలమవుతాయి. నూతన పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వ్యాపారాలు మరింతగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. గులాబీ, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఏ పని చేపట్టినా విజయమే. ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కొన్ని వివాదాలు, సమస్యలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. నూతన పెట్టుబడులతో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు అనుకోని విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం ప్రారంభంలో  అనుకోని ధనవ్యయం. అనారోగ్యం. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
రహస్య సమాచారాలు తెలుసుకుంటారు. ఆశించినంతగా డబ్బు సమకూరి అవసరాలు తీరతాయి.  కుటుంబసమస్యల నుంచి బయటపడతారు. విద్యార్థ్ధులకు ఊహించని అవకాశాలు దక్కుతాయి.  చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి.  అందరిలోనూ ప్రత్యేక గుర్తింపు పొందుతారు. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు కొంతమేర తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో భూవివాదాలు. సోదరులతో కలహాలు.
నీలం, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
కొద్దిపాటి చికాకులు, సమస్యలు ఎదురైనా నేర్పుగా అధిగమిస్తారు. సోదరులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. పనులు చకచకా పూర్తి చేస్తారు.  ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. కొత్త వ్యక్తుల పరిచయాలు. సంఘంలో పేరుప్రతిష్ఠలు మరింత పెరుగుతాయి. వాహనయోగం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు లభిస్తాయి. కళారంగం వారికి నూతనోత్సాహం. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ఆకుపచ్చ, గులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
కొత్త వ్యక్తులు పరిచయం ఉత్సాహాన్నిస్తాయి. ఆస్తి వ్యవహారాలలో కొత్త అగ్రిమెంట్లు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. అనుకున్న పనులు విజయవంతంగా సాగుతాయి. సోదరులు, మిత్రులతో సఖ్యత నెలకొంటుంది.. ఇంటి నిర్మాణప్రయత్నాలు కలసివస్తాయి.  నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. కళారంగం వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు, సన్మానాలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. గులాబీ, లేత ఎరుపు రంగులు.  ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి. 

Advertisement
Advertisement