వారఫలాలు (మే 24 నుంచి 30వరకు)

24 May, 2020 06:19 IST|Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
కొన్ని పనులు  ముందుకు సాగక కొంత  నిరాశ చెందుతారు. ఆర్థిక పరిస్థితి కాస్త ఊరటనిస్తుంది. ఇంటి నిర్మాణాలలో అవాంతరాలు. నిర్ణయాలలో మార్పులు చేసుకుంటారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కష్టపడ్డా ఫలితం అంతగా కనిపించదు. నిరుద్యోగుల ప్రయత్నాలు నెమ్మదిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపారాలలో నిదానం పాటించండి. ఉద్యోగాలలో కొత్త  బాధ్యతలు. పారిశ్రామికవర్గాలకు ఒడిదుడుకులు. వారం మ«ధ్యలో శుభవార్తలు. వాహనయోగం. గులాబీ, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కాలభైరవాష్టకం పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
అనుకున్న కార్యక్రమాలను పూర్తి చేసేవరకూ విశ్రమించరు. ఆర్థిక పరిస్థితి మరింత అనుకూలిస్తుంది. దీర్ఘకాలిక రుణాలు తీరతాయి. విద్యార్థుల భవిష్యత్తుపై భరోసా కలుగుతుంది. స్థిరాస్తి వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. వాహనాల కొనుగోలు యత్నాలు వాయిదా వేస్తారు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగాలలో  అదనపు బాధ్యతల నుంచి విముక్తి.  కళారంగం వారి ఆశలు కాస్త నిరాశ పరుస్తాయి. వారం చివరిలో  దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. గులాబీ, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఇంటాబయటా మీకు ఎదురుండదు. విద్యార్థులు అనుకున్న ఫలితాలు పొందుతారు. చేపట్టిన  పనులలో జాప్యం జరిగినా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఆస్తుల వ్యవహారాలు కాస్త పరిష్కరించుకుంటారు. సంఘంలో గౌరవానికి లోటు రాదు. సంగీత,  సాహిత్య విషయాలపై ఆసక్తి చూపుతారు. ఆకస్మిక ధనలాభ సూచనలు. ఒక  సమస్య పరిష్కారమవుతుంది. వ్యాపారాలలో కోరుకున్న లాభాలు దక్కే ఛాన్స్‌. ఉద్యోగాలలో  కొత్త విధులు చేపడతారు. రాజకీయవర్గాల కృషి ఫలించే సమయం. వారం ప్రారంభంలో  ధనవ్యయం , అనారోగ్యం. ఆకుపచ్చ, నీలం రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి.. సమాజంలో మీరంటే ప్రత్యేక గౌరవం పొందుతారు. ఉద్యోగార్ధుల యత్నాలు కొంత నెమ్మదిస్తాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకుతెచ్చుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన డబ్బు సమకూరి అవసరాలు తీరతాయి. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు నిదానిస్తాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులు విస్తరణయత్నాలను ముమ్మరం చేస్తారు. ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. పారిశ్రామికవేత్తలకు గతం కంటే ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో  ఖర్చులు అధికం. బంధువిరోధాలు. తెలుపు, పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
శ్రమకోర్చి కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో అకారణంగా విరోధాలు. సమాజసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆశించిన విధంగా ఆర్థిక వ్యవహారాలు కొనసాగుతాయి. పాతమిత్రుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. ప్రముఖుల సలహాలు స్వీకరిస్తారు. విద్యార్థులకు ఫలితాలు కొంత ఊరటనిస్తాయి. కొన్ని్న సమస్యలు నేర్పు, ఓర్పుతో పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం కొంత చికాకు పరుస్తుంది. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో పనిభారం కాస్త పెరిగే సూచనలు.   రాజకీయవర్గాలకు ఊహించని అవకాశాలు.  వారం మధ్యలో  అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో స్వల్ప సమస్యలు. ఎరుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
అనుకున్న పనులు విజయవంతంగా సాగుతాయి. ఆత్మీయులతో వివాదాలు పరిష్కార మవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు జరుపుతారు. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. ప్రముఖులతో పరిచయాలు. ఇంటì నిర్మాణాలలో ఆటంకాలు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబంలో మీపై మరిన్ని బాధ్యతలు ఉంచుతారు. వ్యాపారాలు క్రమేపీ లాభిస్తాయి. ఉద్యోగాలలో విధుల్లో అవాంతరాలు తొలగుతాయి. రాజకీయవర్గాలకు శ్రమ ఫలిస్తుంది. వారం ప్రారంభంలో ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యం మందగిస్తుంది. ఆకుపచ్చ, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌ స్తోత్రాలు పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
మొదట్లో నెలకొన్న సమస్యలు తీరి ఊరట చెందుతారు. సంఘంలో ప్రత్యేక గౌరవం పొందుతారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కార దశకు చేరతాయి. వాహనాలు, భూములు కొనుగోలు యత్నాలు నిదానిస్తాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులు మొదట్లో కష్టపడ్డా ఫలితం పొందుతారు. వ్యాపారస్తులకు పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగస్తులకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో  వృథా ఖర్చులు. ఆకుపచ్చ, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
కొత్తగా చేపట్టిన పనులు కొంత ఆలస్యంగా పూర్తి కాగలవు. ఆశించిన ఆదాయం సమకూరుతుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం. ఆశ్చర్యకరమైన రీతిలో కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తుల విషయంలో నెలకొన్న స్తబ్దత తొలగుతుంది. దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం మరింత సంతోషం కలిగిస్తుంది. మీ ఆశయాలు కొన్ని నెరవేరే సమయం.  వ్యాపారాలలో  ఊహించని పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో  కొంత ఊరట లభిస్తుంది. కళారంగం వారికి కొంత ఊరట లభిస్తుంది. ఎరుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయస్తోత్రాలు పఠించండి. 

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
కష్టం ఫలిస్తుంది. నూతన ఉద్యోగయత్నాలు సానుకూలమవుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్య కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. కాంట్రాక్టులు ఎట్టకేలకు దక్కుతాయి. మిత్రులు, బంధువులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. వాహనాల కొనుగోలు యత్నాలు నిదానిస్తాయి. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. వ్యాపారాలలో ఆశించినంతగా  లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో  బాధ్యతలు కొంత తగ్గవచ్చు. పారిశ్రామికవర్గాలకు శ్రమ ఫలిస్తుంది. వారం చివరిలో  ఖర్చులు. కొన్ని అంచనాలు తప్పుతాయి. గులాబీ, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ప్రారంభంలో సమస్యలు కొంత చికాకు పర్చినా అ«ధిగమిస్తారు. బంధువులు, మిత్రులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. రావలసిన డబ్బు అందుతుంది. వివాహ, ఉద్యోగయత్నాలు ముమ్మరం చేస్తారు. ఇంటి నిర్మాణాలు కాస్త నిదానిస్తాయి. వ్యాపారాలలో అనుకోని లాభాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు, చిక్కులు తొలగుతాయి. కళారంగం వారికి కార్యసిద్ధి. వారం చివరిలో వృథా ఖర్చులు. మానసిక అశాంతి. స్వల్ప అనారోగ్యం. నీలం, ఆకుపచ్చ రంగులు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
వ్యూహాత్మకంగా కొన్ని పనులు పూర్తి చేస్తారు. అనుకోకుండా కొన్ని కాంట్రాక్టులు చేజారతాయి. ఆత్మీయులతో వివాదాలు తీరతాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి  విజయాలు సాధిస్తారు. విద్యార్థుల యత్నాలు కొంత సానుకూలమవుతాయి. ఆరోగ్యపరంగా కొంత చికాకు ఎదురుకావచ్చు. జాగ్రత్త అవసరం. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.  వ్యాపారాలలో  పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగాలలో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. పారిశ్రామికవర్గాలకు శ్రమ పడ్డా ఫలితం కనిపిస్తుంది. వారం ప్రారంభంలో బంధువులతో వివాదాలు నెలకొంటాయి. ఇంటాబయటా ఒత్తిడులు ఎదురవుతాయి. ఆకుపచ్చ, తెలుపు రంగులు. హనుమాన్‌ చాలీసా పఠిచండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
మీ కష్టం కొంత ఫలిస్తుంది.  అనుకున్న కార్యక్రమాలు కొంత జాప్యమైనా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కలుగుతుంది. వ్యతిరేకులను కూడా ఆకట్టుకుంటారు. ఇంట్లో వేడుకల నిర్వహణపై దృష్టి పెడతారు.  చిన్ననాటి మిత్రులతో సఖ్యత. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి  వస్తాయి.  వ్యాపారాలలో  స్వల్ప  లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో అదనపు విధులు చేపడతారు. కళారంగం వారికి ఊరటనిచ్చే సమాచారం రావచ్చు. వారం మధ్యలో అనుకోని ధనవ్యయం. ఆరోగ్యభంగం. బంధువులతో తగాదాలు. గులాబీ, ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. వేంకటేశ్వరస్వామిని స్తోత్రాలు పఠించండి.

-సింహంభట్ల సుబ్బారావు
జ్యోతిష్య పండితులు 

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా